| సంక్రాంతికి 'తాజ్ మహల్ ' |
| శని వారం, డిసెంబర్ 19, 2009 , 11:23 [IST] |
 |
|
హీరో శివాజీ స్వీయనిర్మాణ సంస్థ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ స్థాపించి రూపొందిస్తున్న తొలి చిత్రం 'తాజ్‌మహల్. అరుణ్ సింగార్ దర్శకునిగా పరిచయమవ్ఞతు న్నారు. శృతి కథానాయిక.హీరో శివాజీ మాట్లాడుతూ 'ప్రతీ ఒక్కరి జీవితాల్లో పెన వేసుకుపోయిన ప్రేమ, దాని తాలూకు అనుభూతుల నేపథ్యంలో ఈ చిత్ర కథాంశం వ్ఞంటుంది. అనుభూతి ప్రధానంగా అందరినీ ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు అభిమాన్‌రామ్ అందించిన సంగీతం మెలోడి ప్రధానంగా అలరిస్తుంది. పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. చక్కటి కథను తెరకెక్కించడానికి నిర్మాతగా మారాల్సి వచ్చింది.
అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'ప్రతి ఒక్కరికీ ప్రేమ తాలుకు అనుభూతులు వెంటాడుతూనే వ్ఞంటాయి. ఇలాంటి అనుభూతుల దృశ్యమాలికే ఈ 'తాజ్‌మహల్ అని అన్నారు.
|
|
|
|
|
|
|