డి. సురేష్‌బాబు తనయుడు రానా ప్రతిష్ఠాత్మక సంస్థ ఏ.వి.యం ప్రొడక్షన్స్ ద్వారా హీరోగా పరిచయం అవ్ఞతన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు శేఖర్ కమ్ముల.ఏ.వి.ఎమ్. సంస్థ నిర్మిస్తున్న 174 వ చిత్రం 'లీడర్. కావటం విశేషం.అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ 'నా జీవితంలో మరచిపోలేని అనుభూతి ఈ చిత్రం. నేను ఫీలయి రాసుకున్న చక్కటి కథకి ఏ.వి.యం సంస్థ తోడయింది. ప్రజల కోసం బ్రతికే నిజమైన 'లీడర్ ఎలా వ్ఞండాలో ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాను.
ఇంతవరకు వచ్చిన రాజకీయ చిత్రాలకు భిన్నంగా ఒక్క ఫైట్‌కానీ, ఒక్క రక్తపు బొట్టుకానీ సినిమాలో కనిపించ కుండా రూపొందించాను. 'లీడర్ నా చిత్రాల్లో కెల్లా ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. సంగీత దర్శకుడు మిక్కీ.జె.మేయర్ అందించిన సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవ్ఞతుంది అని అన్నారు. నిర్మాత శరవణన్ మాట్లాడుతూ 'నిజమైన 'లీడర్ ఎలా వ్ఞండాల్లో శేఖర్ కమ్ముల ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కరించారు. రానా బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయే చిత్రం ఇది. ఇటీల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. మిక్కీ.జె.మేయర్ అందించిన రీ రికార్డింగ్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది అన్నారు.
హీరో రానా మాట్లాడుతూ 'ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కరు చక్కటి సహకారాన్ని అందించారు. మా కుటుంబం పరిశ్రమకే అంకిత మయింది. నేను కూడా పరిశ్రమకు అంకిత మవ్ఞతున్నాను. సామాజిక అంశాలను చర్చించే చిత్రం ద్వారా పరిచయం అవ్ఞతున్నందుకు చాలా ఆనందంగా వ్ఞంది. ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం వ్ఞంది అని చెప్పారు.