మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
చెరకు ఆర్డినెన్స్‌పై ప్రతిపక్షాల దాడి
శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 4:11 [IST]

sugar cansన్యూఢిల్లీ నవంబర్‌ 19:- చెరకు ధరను నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఎఫ్‌ఆర్‌పి ఆర్డినె న్స్‌పై నల్లచట్టం అని దీనివల్ల భారతీయ రైతాం గం బాగా దెబ్బతింటుందని ప్రతిపక్షపార్టీలు ప్రభు త్వంపై దాడి చేసాయి. ఈ ఆర్డినెన్స్‌ను ఉపసహం రించేవరకు పార్లమెంట్‌ను స్తంభింప చేస్తామని కొందరు రైతులు చెరకు గిట్టుబాటు ధర లభించక చెరకు తోటలను తగలబెడుతున్నారని, మరికొం దరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కాని వివిధ రాజకీయ పార్టీలతో గాని చర్చించకుండా ఎఫ్‌ఆర్‌పి వంటి కీలక నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

ఈ ఆర్డినెన్స్‌ను పూర్తిగా ఉపసంహరించినప్పుడే ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలకు సిద్ధపడ తామని ఆయన అన్నారు. సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ మాట్లాడు తూ చెరకు రైతుల తరపున ఈ ఆర్డినెన్స్‌ను ఉపసంహరింప చేసేందుకు, పార్లమెంటు నుంచి పల్లెల వరకు ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. పార్లమెంట్‌లో ప్రారంభమైన ఈ పోరాటం దేశవ్యాప్తంగా విస్తరింపచేస్తామని, గతంలో ఎన్నడూ జరగని స్థాయిలో ఉద్యమం జరుగుతుందని, అధికారంలో ఉన్నవారందరూ రైతులకు జరుగుతున్న అన్యాయానికి కారకులేనని ఆయన హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎఫ్‌ఆర్‌పి కంటే రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా ఎస్‌ఎపి ధరను నిర్ణయిస్తే ఆ తేడాను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఎస్‌ఎమ్‌పి కంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్‌ఎపి ఎక్కువగా ఉంటే ఆ తేడాను చక్కెర మిల్లులు చెల్లించాల్సి వచ్చింది. ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ సమక్యంగా ఉన్నాయని, ప్రభుత్వంలో ఉన్నవారు సైతం ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారని ములాయం సింగ్‌ యాదవ్‌ చెప్పారు. యుపిఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డిఎమ్‌కె కూడా కేంద్ర ప్రభుత్వ చెరకు విధానాన్ని వ్యతిరేకించింది. ఒకవంక రైతులకు సరైన ధర లభించడం లేదని, మరోవంక వినియోగదారులు ఆహార ధాన్యాలకు అధిక ధర చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు.

ఈ ఆర్డినెన్స్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం చెరకు రైతులను లూటీ చేయడానికి మిల్లులకు లైసెన్సులు ఇచ్చినట్లు అయిందని సమాజ్‌వాది పార్టీ నాయకుడు అమర్‌సింగ్‌ చెప్పారు. రైతులు ఒకవంక తమ చెరకు తోటలను తగలబెట్టుకుంటుంటే ప్రభుత్వం చక్కెర దిగుమతికి అనుమతించదని పేర్కొన్నారు. డిఎమ్‌కెతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా చెరకు విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. అవసరమైతే బిజెపి నాయకుడు ఎల్‌కె అద్వానీని కలిసి రైతుల కోసం కలిసి రావాల్సిందిగా పాదాల మీద పడతానని అమర్‌సింగ్‌ పేర్కొన్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్‌ నాయకుడు జగదంబికాపాల్‌ మాట్లాడుతూ రైతులకు సరైన ధర లభించడానికి తాము కూడా మద్దతు తెలుపుతున్నామని అన్నారు.

డిఎమ్‌కె వ్యతిరేకత
సరసమైన గిట్టుబాటు ధర పేరుతో చెరకు ఎఫ్‌ఆర్‌పిని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్టినెన్స్‌ను యుపిఏ భాగస్వామి అయిన డిఎమ్‌కె తీవ్రంగా వ్యతిరేకించింది. డిఎమ్‌కె కాకుండా అనేక ఇతర ప్రతిపక్షాలు కూడా ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే ఎఫ్‌ఆర్‌పి ఉండాలన్న అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చెరకు ధరపై ఎటువంటి చర్చలు రాష్ట్ర ప్రభుత్వాలతో చేయకుండా ఈ ఆర్డినెన్స్‌ జారీ చేయడం పట్ల డిఎమ్‌కె పార్లమెంటరీ పార్టీ నాయకుడు టిఆర్‌బాలు విచారం వ్యక్తం చేసారు. టెలికామ్‌ మంత్రి ఏ రాజా, బాలు ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీని కలిసి డిఎమ్‌కె అభిప్రాయాలను వివరించారు.

చెరకు ధరపై ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ లోక్‌సభలో రభస జరగడంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది. వాయిదా సమయంలో ఆర్థిక మంత్రిని ఇద్దరు డిఎమ్‌కె నాయకులు కలిసారు. రాష్ట్రాలు ప్రకటించే ఎస్‌ఎపి ధర విధానాన్ని కొనసాగించాలని, ఎఫ్‌ఆర్‌పికి, ఎస్‌ఎపికి ఉన్నతేడా ధరను రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా మిల్లులే చెల్లించాలని డిఎమ్‌కె పట్టుబడుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌పి 129.84 పైసలు క్వింటాలుకు ప్రకటించగా తమిళనాడు ప్రభుత్వం రూ.155 ఎస్‌ఎపిని ప్రకటించింది. దేశంలోని ప్రధాని రాజకీయ పార్టీలు అయిన బిజెపి, ఆర్‌జెడి, సమాజ్‌వాదిపార్టీ, అన్నడిఎమ్‌కె, కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 కొబ్బరి మార్కెట్‌కు ముందుంది పండగ
 కొల్హాపూర్‌లో గేట్‌వే హోటల్
 మెక్‌డోవెల్‌ హోల్డింగ్స్‌ ఫలితాలు
 రేమండ్‌ వీల్‌ కొత్త వాచ్‌
 బేకర్స్‌ ఇన్‌ నుంచి ఉత్పత్తులు
 బంగారంలో ప్లాటినం లోహాల ఉనికి
 వ్యవసాయరంగానికి భారీ రుణాలు
 ఎయిర్‌ ఇండియాపై ఫిర్యాదు
 పెరిగిన టాటా మోటార్స్‌ అమ్మకాలు
 పెరిగిన ఫిన్‌ ఎయిర్‌ టర్నోవర్‌
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com