కావ్య, పూజిత, లెటీషియా, శ్వేత, సంధ్య వీరంతా కాలేజీలో స్నేహితులు కాదు. ఒకేచోట పనిచేసే వారూ కాదు. కానీ అందరి ఆలోచనా ఒక్కటే.వారి ఆశయం ఒక్కటే. అదే వారిని ఒకచోటకు చేర్చింది. ఒకేబాటలో నడిచేలా చేసింది. వీరంతా మేక్ ఎ డిఫరెంట్ వాలంటీర్లు. డిఫరెంట్‌గా ఆలోచించడం వీరి నైజం. అనేక స్వచ్ఛంద సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలకు సహాయం చేయడానికి వీరంతా నడుంకట్టారు. స్వచ్ఛంద సంస్థల్లో పిల్లలకు ఇంగ్లీష్, కమ్యూ నికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలపమెంట్ తరగతులు నిర్వహిస్తున్నారు.అంతేకాదు సరదాగా ప్రతి ఆదివారం వారిని షికారుకూ తీసు కెళుతుంటారు. వీరు ఈసారి 16వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలకు వివిధ సంస్థల నుంచి 100మంది బాలలను తీసుకువచ్చి, వారి కెప్పుడూ అనుభవంలోకి రాని అద్భుత ప్రపంచాన్ని చూపించారు. వారి కళ్లలోని సంతోషాలను చూసి సంతృప్తిగా వెనుదిరిగారు.
మాకు ఈ సినిమాల పండగ బాగా బాగా నచ్చింది. మేమెప్పుడూ ఇలాంటి చోటికి రాలేదు. స్కూల్, హాస్టల్ లేదంటే పార్క్‌కి వెళ్లేవాళ్లం.ఇప్పుడు ఈ అక్కలంతా వచ్చి మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు. మాలాగా ఎంతో మంది ఈ సినిమాలు చూడటానికి ఇక్కడికి వచ్చారు. వాళ్లందరితో మాట్లాడాం కూడా. ఎంత సంతో షంగా ఉందో చెప్పలేం అంటూ ఉబ్బితబ్బిబౌతూ చెప్పారు కస్తూర్బా గాంధీహోమ్ పిల్లలు. వీరేకాదు అరుణవేదికా రెయిన్‌బో, ఫార్ ఫమ్ స్ట్రీట్ చిల్డ్రన్ వంటి మరికొన్ని సేవా సంస్థలనుంచి కూడా పిల్లలు ఇక్కడకి వచ్చారు.గోల్డెన్ ఎలి ఫెంట్‌తో ఆడుకున్నారు. చేతులపై బంగారు ఏనుగు టాటూ వేయించుకున్నారు. గోల్డెన్ గణేష్‌తో ఫ్రెండ్‌షిప్ చేసుకున్నారు.తమతో మాట్లాడటానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ చిరు నవ్వుతో పలకరించారు.
అమర్‌వేదిక నుంచి వచ్చిన నిర్మల తన స్నేహితురాళ్లు లక్ష్మి, మల్లికలతో కలిసి ఐమాక్స్‌ను చూడటం మర్చిపోలేని అనుభవం అని మురిసిపోయింది.జయలక్ష్మి తను కూడా యాక్టర్‌ని కావాలనుకుంటున్నట్టు చెప్పింది. మల్లిక, శివలీల, ఇందిర అందరకీ ఆనందమే. గ్రాడ్యుయేషన్ చేస్తున్న సంధ్య మాట్లాడుతూ ఈ పిల్లలంతా హోమ్‌లో ఉంటూ చదువు కుంటున్నారు. వీరికి ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ లేదు.ందుకే మేక్ ఎ డిఫరెంట్ తరుఫునుంచి కొంతమందిమి కలిసి ఈ పిల్లలకు బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాం అని చెప్పింది. ఇరవై రెండేళ్ల పూజిత కూడా చదువుకుంటూ ఈ అనాథ పిల్లలకు ఆంగ్లపాఠాలు నేర్పే అక్కగా మారింది.గూగుల్‌లో పనిచేసే కావ్య, శ్వేతలు తమ స్నేహితులందరినీ కలుపుకుని హోమ్‌లోని పిల్లలకు కొత్త లోకాన్ని చూపే ప్రయత్నం చేస్తు న్నారు.
కేరళ నుంచి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చిన లెటీషియా కూడా వీరి పరిచయంతో ఈ ఉద్యమంలో భాగం పంచుకుంది. పిల్లల మధ్య గడపడం ఇష్టంకావడం ఒక కారణం అయితే, తల్లిదండ్రులు లేని ఈ పిల్లలకు ఆసరాగా మేమున్నామనే భరోసానందించాలన్న తపన వీరందరినీ ఒక్కతాటిపైకి తెచ్చింది.ఐసిఎఫ్‌ఎఫ్‌లో పాల్గొన్న నేషనల్ ఛైల్డ్ రైట్స్ కమీషన్ ఛైర్‌పర్సన్, రామన్‌మెగసేసే, పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతాసిన్హా పిల్లలకోసం తీసే సినిమాలు అన్నివర్గాల బాలలకు అందు బాటులోకి రావాలని అన్నారు. బాలల చలన చిత్రోత్సవ సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆవిడ తన మనో భావాలను 'చెలికి వివరించారు.
ఇప్పుడు ప్రదర్శిస్తున్న సినిమాలు ఉచితం కనుక అన్ని సామాజిక వర్గాలవారూ చూసేందుకు రాగలిగారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, పేదకుటుంబాల పిల్లలు, వేరువేరు సంస్థలనుంచీ కూడా రావడం ఆనందాన్నిస్తోంది. పిల్లలకు వినోదాన్ని అందివ్వడం మన కర్తవ్యం.ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వ తగిన చొరవ చూపించి వారి హక్కులను వారు పొందగలిగేలా చూడాలి. అది ఖచ్చింతంగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతే. మన రాజ్యంగంలోని 17వ ఆర్టికల్ ఛైల్డ్ రైట్స్‌ని, వాటిని కాపాడటానికి ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యతలను వివరించింది. వాటి ప్రకారం బాలలకు వినోద సాధనాలుగా పరిగణించబడే వాటిని ప్రోత్సహించాలి.వినోద మాధ్యమాల్లో ముఖ్యమైనది సినిమా.పిల్లలకు మంచి మెసేజ్‌ను ఇచ్చే బాలల చిత్రాలను నిర్మించేందుకు తగిన వనరులను కల్పించడం ప్రభుత్వ బాధ్యతే.
Hi,
"What a nice feeling!" I read a good article. I would like to meet these AKKAYYALU, కావ్య, పూజిత, లెటీషియా, శ్వేత, సంధ్య. I appreciate their unselfish service. We need many Kavyas, Pujitas, Leticias, Swethas, and Sandyas in India. I would like meet personally to congratulate them. Please send their e-mail addresses. I will be visiting Hyderabad, (India)in June, 2010. Being a mentor, I do the same service to my college students in California, USA.
Yours,
Srichandra.