మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
ఉదయించిన 23 'కిరణాలు'
శని వారం, నవంబర్ 07, 2009 , 2:42 [IST]
దీప్తిశ్రీ కవ్ఞలూరు

cheli46 వారాల కఠోరమైన దీక్షను పూర్తిచేసుకున్న రుషుల్లా ఉన్నారు వారంతా. ఆత్మవిశ్వాసం, తమ కృషి ఫలించి లభించిన అపురూపమైన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్న తపన వారి ప్రతి అడుగులో కనిపిస్తోంది. జాతీయగీతాన్ని ఆలపిస్తున్నప్పుడు వారి గుండెల్లో జాతీయభావం పెల్లుబుకుతోంది. దీక్షగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని, బంధు ప్రీతికి, స్వార్థానికి తావివ్వకుండా దేశ సేవకే అంకితమౌతామని నిర్మల హృదయంతో ప్రమాణం చేసారందరూ.

అధికారులు, తల్లిదండ్రులు, ఆహుతుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. తమ బిడ్డలను ధీరలుగా చూస్తున్న ఆ తల్లిదండ్రుల హృదయాలు పులకించాయి. తమ శిక్షణలో సర్వోత్తములుగా తీర్చిదిద్దబడ్డ వారిని చూసి అకాడమీ గర్వపడింది. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ 61వ బ్యాచ్‌ 23మంది మహిళా ఐపియస్‌లను దేశానికి సగర్వంగా అందించింది. వీరిలో ముగ్గురు క్లిష్టమైన ప్రాంతంగా భావించే జమ్మూ, కాశ్మీర్‌లో నియమింపబడటం విశేషం. శిక్షణాకాలాన్ని పూర్తి చేసుకున్న అభ్యర్థుల దీక్షాంత్‌ పేరేడ్‌. పురస్కారాల ప్రదానోత్సవ సందర్భంగా పలువురు మహిళా ఐపియస్‌ల మనోగతాన్ని 'చెలి ఆవిష్కరిస్తోంది.

అత్యుత్తమ శిక్షణ

ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌కు ఎంపికైన 99 మందికి (బ్యాచ్‌ నెం-61)పోలీస్‌ అకాడమీ 46 వారాల శిక్షణను సమర్థవంతంగా పూర్తిచేసింది. వీరిలో ఎనిమిదిమంది రాయల్‌ భూటాన్‌ పోలీస్‌ సర్వీసెస్‌, మాల్దీవ్‌ పోలీస్‌ సర్వీసెస్‌కి చెందిన వారున్నారు. ఐపియస్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న వీరిలో ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఎమ్‌.ఫిల్‌, ఎమ్‌బిబిఎస్‌, ఆర్ట్స్‌కి చెందినవారే కాకుండా జాబ్‌ హోల్డర్స్‌ కూడా ఉన్నారు.

శిక్షణలో భాగంగా ఫైరింగ్‌, వెపన్‌ ట్రైనింగ్‌, హార్స్‌రైడింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌, మాప్‌ రీడింగ్‌, స్విమ్మింగ్‌, యోగా, కళలను వీరు నేర్చు కున్నారు. లా, కాన్స్టిట్యూషన్‌, క్రిమినాలజీ, ఫిజియోలజీ, ఇన్వెస్టిగేషన్‌, ఫోరెన్సిక్‌ సైన్సెస్‌, మెడిసిన్‌, మేనేజ్‌మెంట్‌, పోలీస్‌ ఎథిక్స్‌తో పాటుగా ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీని కూడా అవపోసన పట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌, గ్రేహౌండ్స్‌ దళాల వద్ద శిక్షణ పొందారు. అంతేకాక ఈ బ్యాచ్‌ తమిళనాడులోని సత్యమంగళం అడవుల్లో కూడా అతి కష్టమైన శిక్షణను పూర్తిచేసుకుంది. అకా డమీలో శిక్షణా కాలం పూర్తి అయిన తరువాత అభ్యర్థులు ఈశాన్య ప్రాంతాలు, జమ్ము కాశ్మీర్‌ లలో కొద్దిరోజులు రిపోర్టింగ్‌ చేసారు. ఇప్పుడు వారికి కేటాయించిన ప్రాంతాల్లో ఆరునెలల ప్రొబేషనరీ పీరియడ్‌ను పూర్తిచేస్తారు.

గర్వకారణం

ఐపియస్‌ల చరిత్రలో మొదటిసారిగా 23మంది మహిళలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేందుకు సన్నద్ధులయ్యారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి అత్యధికంగా ఏడుగురు మహిళలు, తమిళనాడు నుంచి నలుగురు, మహారాష్ట్ర నుండి ముగ్గురు ఐపియస్‌లుగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ, హర్యానా, అస్సామ్‌, ఛత్తీస్‌ఘడ్‌, కేరళ, పాండిచ్చేరి, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌లనుంచి మిగిలిన వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒక్క మహిళా లేకపోవడం కించిత్‌ నిరాశపరిచినా మున్ముందు మరింత మందికి వీరంతా స్ఫూరిదాతలౌతుండటం శుభ పరిణామమే. యువ ఐపియస్‌లలో 25ఏళ్ల లోపున్నవారు ముగ్గురున్నారు. అవివాహితలుగా ఉన్న వారి సంఖ్య 20. హోంమంత్రి చిదంబరం ఎదుట ప్రమాణం చేసిన వారిలో ఏడుగురు ముందు నుంచీ సర్వీసులో ఉన్నవారూ ఉన్నారు.

ప్రతిభకు పురస్కారాలు
శిక్షణా సమయంలో అభ్యర్థులు కనబరిచిన ప్రతిభాపాటవాలకుగాను తొమ్మిదిమంది ఐపిఎస్‌లు వివిధ అత్యుత్తమ అవార్డులను అందుకున్నారు. జ్యోతిప్రియా సింగ్‌ సెకండ్‌ బెస్ట్‌ ఆల్‌రౌండర్‌గానూ, బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ లేడీ ఐపియస్‌గా ఎంపికయ్యారు. ఇండోర్‌ సబ్జెక్ట్స్‌లో పారుల్‌ మాథుర్‌, రోహిని కోటక్‌లు ట్రోఫీ లందుకున్నారు. అవుట్‌డోర్‌ సబ్జెక్ట్స్‌లో అజిత బేగం సుల్తానా బెస్ట్‌ లేడీ ఐపియస్‌గా ఎంపిక య్యారు. జనరల్‌లో నిశాంతిని, అలంకృత సింగ్‌, నీలాంబరి, శోభా.బి.పురుషోత్తమ్‌ ట్రోఫ ీలందుకున్నారు. రీజనల్‌ లాంగ్వేజస్‌ ట్రోఫీ లందుకున్న వారిలో రమ్యభారతి, శోభా.బి. పురుషోత్తమ్‌, నీలాంబరి ఉన్నారు.

యువ ఐపియస్‌ల మనోగతం
స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, గ్రేహౌండ్స్‌ వారి వద్ద శిక్షణ పొందాం. అడవుల్లో పగలు, రాత్రీ తేడా లేకుండా కష్టపడ్డాం. చదువుకునే రోజుల్లో అయినా, తరువాతైనా తీరిక సమయం అంటూ ఎప్పుడూ నాకు లేదు. ఎప్పుడూ నా పనిలో నిమగ్నమయ్యే ఉంటాను. ఏ కాస్త టైమ్‌ దొరికినా ఇంట్లోనే గడుపుతాను. సివిల్‌ సర్వీసెస్‌ నా జీవిత లక్ష్యం అనుకున్నాను. అది సాధించి నందుకు గర్వ పడటం లేదు. దాన్ని సాధించిన తరువాత వేయాల్సిన ముందడుగు గురించే ఆలోచిస్తున్నాను. శాంతి, భద్రత పరిరక్షణే ప్రధమ కర్తవ్యంగా భావిస్తుంటాను. దేశం కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా వెనుదీయననే ప్రమా ణాన్ని అక్షరాలా నిలబెట్టుకుంటాను.

జ్యోతిప్రియా సింగ్‌

మా తాతగారి ప్రోత్సాహమే నన్ను ఇక్కడ వరకూ నడిపించింది. అమ్మా, నాన్నలు వెంటే ఉండి సహకారం అందించారు. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌. ఆ పేరు వింటేనే చెప్పలేని ఉద్వేగం ఆవరిస్తుంది నాలో. ఈ హోదాని పొందడం ఆనందంగా ఉంది. దానితోపాటు నా బాధ్యతలను నిక్కచ్చిగా నిర్వహిస్తాననే ప్రమా ణాన్ని ఎన్నటికీ మరిచిపోను. ప్రతిభాపాటిల్‌, సబితారెడ్డి మున్నగువారంతా మహిళా సాధి కారతకు నిదర్శనంగా నిలిచారు. ఇప్పుడు 23 మంది ఐపియస్‌లు దాన్ని మరోసారి రుజువు చేస్తున్నారు. అయినా ఈ అభివృద్ధి సరిపోదు. మరింతగా మహిళల ముందడుగు కావాలి. అందుకు కాస్త సమయం పడుతుంది. ఐపి యస్‌లలో కూడా పురుషులకు సమానమైన సంఖ్యలో స్త్రీలు నిలబడే కాలం దగ్గరలోనే ఉంది. శిక్షణా కాలం అంతా ఎంతో బాగా గడిచింది. ఇదే ముందు 30-40 ఏళ్ల ఉద్యోగ జీవితానికి పునాదిగా పనిచేస్తుంది.

నీలాంబరి.వి.జగదాలే

మాది మహారాష్ట్ర. జమ్ము కాశ్మీర్‌ ప్రాంతానికి నాకు పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చారు. ఇది చాలా ఉద్రిక్త ప్రాంతం. అయినా అందుకు నేను భయపడటం లేదు. దేన్నైనా ఛాలెంజింగ్‌గా తీసుకోవడం శిక్షణలో భాగంగా నేర్చుకున్నాం. అలాంటి ఛాలెంజ్‌ నాకు ఎదురైనందుకు సంతోషపడుతున్నాను. ట్రైనింగ్‌లో ఎంతగా ఎంజా§్‌ు చేసామో అంతకంటే ఎక్కువగా ఎంతో నేర్చుకున్నాం కూడా. మానసికంగా, శారీరకంగా ఎంతో స్ట్రాంగ్‌ అవ్వడానికి ఈ శిక్షణ ఎంతో సహాయపడింది. స్వార్థానికి అతీతంగా దేశానికి సేవ చేయాలన్నదే నా లక్ష్యం.

శోభా పురుషోత్తమ్‌

ఐపియస్‌ కాకుంటే రీసెర్చ్‌ అసోసియేట్‌ అయ్యుం డేదాన్ని. ఉత్తరాఖండ్‌లో నా విధులు నిర్వహించ డానికి సంసిద్దంగా ఉన్నాను. అన్ని విషయాల్లో ఆ భగవంతుని ఆశీస్సులు, మా పేరెంట్స్‌ అండదండలు ఉండటం నా అదృష్టం. మహిళలు పెరిగే ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా ఉండాలి. పోలీస్‌ వ్యవస్థలో మరింత మంది మహిళలు అడుగుపెట్టాల్సి ఉంది.

నివేదిత.కె.కుమార్‌
నేను చదివింది సైకాలజీ. పోలీస్‌ సర్వీస్‌ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాన్నగారు కూడా సివిల్స్‌లో పనిచేశారు. అస్సాం-మేఘాలయాలో పోస్టింగ్‌లో చేరనున్నాను. మా అమ్మానాన్నల సంతోషం నిజంగా చెప్పలేనిది. శిిక్షణ సమయంలో స్విమ్మింగ్‌, హార్స్‌ రైడింగ్‌లను బాగా ఎంజా§్‌ు చేశాను. ప్రొఫెషన్‌ విషయంలో ఖచ్చితంగా ఉంటాను. నా ఉద్దేశ్యంలో మొదటి నుండీ మనకున్న చట్టాలు అద్భుతమైనవి. వాటిని మరింత మెరుగ్గా మార్చుకోవడం వల్ల మంచిఫలితాలు పొందవచ్చు.

సర్వీస్‌లో చేరే ముందు చాలా ఎమోషనల్‌గా ఉండేదాన్ని. ఇప్పుడు బాలెన్స్‌ చేసుకోవడం అలవాటయ్యింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల స్థాయిలో ఉన్నాను. మా అమ్మ నాకు స్ఫూర్తి. ఆమె నేను దేశం గర్వించ దగ్గ స్థాయిలో ఉండాలని ఆశించేది. ఆ కల తీరినందుకు ఆమె చాలా సంతోషిస్తోంది. విధి నిర్వహణలో ఎలాంటి కష్టాన్ని ఎదిరించేందుకైనా సిద్ధంగా ఉండమని ఆమె నూరిపోసింది.
పుణ్ణీ

యువ ఐపియస్‌ల మనోభావాలను పంచుకుంటే దేశ భవిష్యత్తు మరింత పురోగమన దిశగా దూసుకుపోతుందనిపిస్తోంది కదూ. వారందరికీ 'చెలి తరఫున హార్ధిక శుభాకాంక్షలు.

 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 రాధాతత్త్వము
 స్నేహితులంటే ఎలా ఉండాలి?
 సమానవాదమే మనవాదం
 మెప్పించే మాటతీరు
 పిన్నవయసు సిఇఒ
 తల్లిపాల బ్యాంకు మరొకటి
 సీ'రియల్'‌లో వాస్తవాలెక్కడ?
 రాఖీ వెనుక రాచగాధలు
 పాక్‌ ప్రధాని లత అభిమాని
 వీణా వాదనలో ప్రవీణ
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com