కోచ్ వాట్‌మోర్ కోల్‌కతా, నవంబర్ 6 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కోచ్‌గా డేవ్ వాట్‌మోర్, తిరిగి కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ నియ మితులయ్యారు. వివాదాస్పద నిర్ణయాలతో కోచ్ గత సీజన్లో కోచ్ బాధ్యల నుంచి తప్పుకున్న జాన్‌బ ుకానన్ స్థానాన్ని వాట్‌మోర్ భర్తీ చేయనున్నాడు. దీంతో కోచ్ విషయమై గత కొంత కాలంగా కొనసా గుతున్న ప్రతిస్థంభనకు జట్టు యజమాన్యం తెరదించింది. ఈ మేరకు జట్టు యాజమాన్య నిర్ణయా న్ని కోల్‌కతా కెప్టెన్‌గా తిరిగి పిలుపునందుకున్న కెప్టెన్ గంగూలీ ఇక్కడ ప్రకటించాడు. ఐపిఎల్ -3 పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ వసీం అక్రం మెన్టర్‌గా వ్యవహరిస్తాడని, భారత్ మాజీ వికెట్ కీపర్, ఢిల్లీ కోచ్ విజ§్‌ుదహియా సహయకకోచ్‌గా వాట్‌మోర్ కు సహకరిస్తాడని వెల్లడించాడు.
తనకున్న అపార అనుభవంతో జట్టును విజయబాట పట్టించగల సామర్థ్యమున్న కోచ్ వాట్‌మోరని గంగూలీ ప్రశంసించాడు. కోచ్‌తో కలిసి జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించడానికి బాధ్యతగా వ్యవహరిస్తానని దాదా తెలిపాడు. చాలాకాలం వాట్‌మోర్‌తో నుంచి తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయనతో కలిసి పని చేసే అవకాశం లభించడం అనందదాయకమన్నాడు. ఈ విషయంపై తాను మాట్లాడడం సమంజసం కాదని నైట్ రైడర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి జా§్‌ు భట్టాచార్య దాటవేశాడు. కోచ్‌గా అధికారికంగా ప్రకటించేందుకు జట్టు యాజమాన్యం సిద్ధమైందన్నాడు.
అస్ట్రేలియా కోచ్ జాన్‌బుకాన్‌కు కోచ్ బాధ్యతల్ని అప్పటించాలని జట్టు యాజమాన్య తర్జనభర్జన చేసి చివరకు వాట్‌మోర్‌ను కోచ్‌గా ఎంపిక చేసింది. కివీస్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ స్థానంలో గంగూలీకి సారథ్య బాధ్యతల్ని అప్పగించింది. మెక్‌కల్లమ్ నాయకత్వంలో జట్టు విఫలమవడంతో యజమాని షారుఖ్ కెప్టెన్ పగ్గాల్ని దాదాకే అప్పగించేందుకు సిద్ధమయ్యాడు. కోచ్ కోసం పలువురు ఆటగాళ్లని సంప్ర దించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం గత జూన్‌లోనే వాట్‌మోర్ వైపు మొగ్గుచూపినట్లు సమా చారం.
సమర్ధుడైన కోచ్ ఎంపికకు జాన్‌రైట్, రిచర్డ్ పైబస్, డెర్మాట్‌రీవి, డంకన్‌ఫ్లెచర్, లాల్‌చంద్‌రాజ్ పుట్, ఎం.వి.రామన్, అశోక్‌మల్హోత్రా తదితరులతో సంప్రదింపులు జరిగాయి. 55 ఏళ్ల వాట్‌మోర్ ఆస్ట్రేలియాకు 7 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి అనంతరం కోచ్‌గా అవతారమెత్తి పలు చారిత్రక విజయాల్లో పాలుపంచుకున్నాడు. 1996లో శ్రీలం క ప్రపంచకప్ గెలిచినప్పుడు ఆ జట్టు శిక్షకుడు ఈయనే. 2007 ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రి కాలపై బంగ్లాదేశ్ గెలుపొంది చరిత్ర సృష్టించినప్పు డు ఆ జట్టుని వెనకుండి నడిపించింది వాట్‌మోరే.
గత ఏడాది భారత్ అండర్ -19 కోచ్‌గా నియమితుడైన ఈయన మలేసియాలో జరిగిన జూనియర్ కప్‌ను భారత్‌కు సాధించి పెట్టడంలో కీలకపాత్ర పోషించాడు. అంతటి విజయవంతమైన కోచ్ నేతృత్వంలో గత రెండు ఐపిఎల్ సీజన్లలో పేలవమైన ప్రదర్శన ఇచ్చిన కోల్‌కతానైట్ రైడర్స్ కూడా విజయబాట పడుతుందని ఆ జట్టు యాజ మాన్యం ధీమాగా ఉంది.