|
'కింగ్ తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న కామాక్షి కళా మూవీస్ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. నాగార్జున హీరోగా కిరణ్ దర్శకత్వంలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న భారీ చిత్రం షెడ్యూల్ గోవాలో పూర్తయింది.
ఈ షెడ్యూల్ వివరాల్ని నిర్మాత చెబుతూ 'హీరో నాగార్జున, మోడల్స్ పాల్గొన్న ఓ సాంగ్‌ని సెట్ వేసి చిత్రీకరించాం. 'స్లమ్ డాగ్ మిలియనీర్‌లో విలన్‌గా నటించిన అంకుర్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. విలన్‌పై కొన్ని సన్నివేశాలనూ, నాగార్జునతో ఫైట్స్, ఛేజ్ చిత్రీకరించాం. దీంతో ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ పూర్తవ్ఞతుంది. నవంబర్ 10 నుండి హైదరాబాద్‌లో షెడ్యూల్ కంటిన్యూ గా జరుగుతుంది. మమతా మోహన్‌దాస్ హీరోయిన్‌గా నట ిస్తోంది. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి సంగీతం: సందీప్ చౌతా, కెమెరా: సర్వేష్ మురారి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అక్కినేని వెంకట్, నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కిరణ్.
|