|
ఇంద్ర, బిందు జంటగా శ్రావణ్ బాపట్ల దర్శకత్వంలో ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి పతాకంపై బొద్దం ఇంద్రసేన నిర్మిస్తున్న 'పుత్రుడు చిత్రం డి.టి.ఎస్. జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని రెండోవారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా హీరో, నిర్మాత ఇంద్ర మాట్లాడుతూ 'పరుషవేది నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం డి.టి.ఎస్. జరుగుతోంది. ఈ చిత్రాన్ని రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రంలో నేను రెండు షేడ్స్‌లో నటిస్తున్నాను అని అన్నారు. హీరోయిన్ బిందు మాట్లాడుతూ 'నెగిటివ్ షేడ్ వ్ఞన్న పాత్రలో నటిస్తున్నాను. ఇందులో 15 నిమిషాలపాటు గ్రాఫిక్స్ ఉంటాయి అని చెప్పారు. దర్శకుడు శ్రావణ్ బాపట్ల మాట్లాడుతూ 'పరుషవేది కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం అనుక్షణం సస్సెన్స్‌తో ఉత్కంఠను కలిగిస్తుంది. అన్ని కార్యక్రమాలూ పూర్తిచేసి చిత్రాన్ని రెండోవారంలో విడుదల చేస్తున్నాం అని చెప్పారు.ఈ చిత్రానికి సమర్పణ: పాన్ అమెరికా, నిర్మాత: బొద్దం ఇంద్రసేన, దర్శకత్వం: శ్రావణ్ బాపట్ల.
|