న్యూఢిల్లీ, నవంబరు6, ప్రభాతవార్త: గ్రేటర్ టిక్కెట్ల గొడవలోఅధిష్టానం జోక్యం ఉండదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్పమొయిలీ స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రేటర్ టిక్కెట్ల పంపిణీ విషయం పిసిసి చీఫ్ డి.శ్రీనివాస్, ముఖ్యమంత్రి రోశయ్యలే చూసుకుంటారని చెప్పారు. ఎవరికి టిక్కెటు ఇవ్వాలి ఎవరి వద్దూ అనేది వారిద్దరే నిర్ణయించుకోవాలి. గ్రేటర్ పంచాయతీలో మేం కలుగజేసుకోం. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ. ఎన్నికల సమ యంలో జరిగే టిక్కెట్ల పంపిణీలో ఇలాంటి ఆందో ళనలు సహజమేనని మొయిలీ పేర్కొన్నారు. గ్రేటర్ టిక్కెట్ల పంపిణీలోఎక్కడా అవకతవకలు జరగ లేదని, డబ్బు పంపిణీ అవా స్తవంగా పేర్కొన్నారు. నిజంగా ఎవరికైనా అన్యా యం జరిగితే వాళ్లకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు.
ఆశావహులు ఎక్కువ మంది ఉండటంతో ఇలాంటి సమస్యలు వస్తాయన్నారు. ఎంపీలు, ఎం ఎల్‌ఏల సిఫార్సు లను కూడా పరిగణలోకి తీసుకుని టిక్కెట్ల పంపిణీ జరిగిందన్నారు. టిక్కెట్లు రానివాళ్లు బాధప డాల్సిన అవసరంలేదని, వారికి వేరొక చోట అవకాశం ఇస్తామన్నారు. గ్రేటర్ హైదారా బాద్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయటంపై విలేకరులు మొయిలీని ప్రశ్నించగా నో కామెంట్ అంటూ దాటవేశారు.