మార్చిన వార్తా విశేషాలు - మంగళ వారం మార్చి   16th 2010 - 2:11 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
తప్పుకోమంటే తప్పుకుంటా
శని వారం, నవంబర్ 07, 2009 , 11:41 [IST]

rosaiahసోనియా నిర్ణయం శిరోధార్యం : రోశయ్య
న్యూఢిల్ల్లీ, నవంబరు 6, ప్రభాతవార్త:
జగన్‌ సిఎంకావాలని కొంతమంది నేతలు, కార్యకర్తలు ఉత్సాహం చూపారు. అందుకు తగ్గట్టుగానే జగన్‌ కూడా ముం దుకు దూకారు. జగన్‌ సిఎం కావాలని అనుకోవటాన్ని నేను తప్పు పట్టను. రేపు మా పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలుస్తున్నాను. మీరు ముఖ్య మంత్రి పదవి నుంచి తప్పుకోండి అని సోనియా అంటే అరనిమిషంలోనే సంతోషంగా తప్పుకుంటాను అంటూ తొలి పర్యటనలోనే ముఖ్యమంత్రి రోశయ  సంచలనవ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పర్యటన కోసం శుక్ర వారం రాత్రి హస్తినకు వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ వీరప్పమొయిలీ నివాసానికి వెళ్లారు.

సుమారు 45నిమిషాల పాటు మొయిలీతో రాష్ట్రరాజకీయాలపై చర్చించారు. శనివారం సోనియాతో ఏఏ అంశాలపై మాట్ల్లాడాలో కూడా చర్చించినట్లు సమాచారం. మొయిలీని కలిసిన అనంతరం అక్కడే సిఎం రోశయ్య విలేకరులతో మాట్లా డారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు ఎంత అండదండగా ఉందో రోశయ్య ముఖం చూస్తే స్పష్టమవుతుంది. కాంగ్రెస్‌ పార్టీలో నిర్ణయానికి కట్టుబడి ఉం డాల్సిందే నేనా జగనా ఇంకా ఎవరైనాసరే. సోనియా ఆదేశాలను తాను శిర సావహిస్తానని రోశయ్య చెప్పారు. పార్టీలో సైనికుడిలా తాను పనిచేస్తున్నాని మరోమారు స్పష్టం చేశారు.

గ్రేటర్‌ ఎన్నికలపై మొయిలీతో చర్చించామని, విజయం సాధించటమే ధ్యేయంగా కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో వత్తిడి తీవ్రంగా ఉంటుందని, ఎంఎల్‌ఏలు, ఎంపీల అబిప్రా యాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చామన్నారు. చిన్నచిన్న సమస్యలు ఉంటే వాటిని సర్ధుబాటు చేసుకుంటామనిచెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల్లో డబ్బులకు టిక్కెట్టు అమ్మకున్నారనే ఆరోపణలపై ఖండించారు. జలయజ్ఞంపై కొండా సురేఖ వ్యాఖ్యలకు బజారులోనిలబడిసమాధానంఇవ్వబోననిస్పష్టం చేశారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 అంచనాలు మించి ద్రవ్యోల్బణం
 'అమీర్‌ఖాన్‌తో పనిచేయాలని ఉంది
 పార్లమెంటరీ విధానం మరింత పటిష్టం:..
 ధరలపై ధనాధన్‌
 అందరితో సంప్రదించాకే
 నిత్యానందకు రంజిత మసాజ్‌
 మహిళాబిల్లుతో ఎంపీల్లో ఆనందం
 సంఘీ రథయాత్రకు అపూర్వ స్పందన
 'బీహార్‌' పరివర్తన్‌ యాత్ర ప్రారంభం
 సచిన్‌ను చూసి నేర్చుకోండి
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com