| నేడు 'మహా మంత్రివర్గం ఏర్పాటు' |
| శని వారం, నవంబర్ 07, 2009 , 11:39 [IST] |
 |
|
న్యూఢిల్లీ, నవంబర్ 6 : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై పక్షంరోజులుగా నెలకొన్న ప్రతిష్టం భనకు స్వస్తిపలుకుతూ, రాష్ట్రంలోకాంగ్రెస్- ఎన్ సిపి కొత్త మంత్రివర్గం శనివారం ప్రమాణ స్వీకా రం చేయనుంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ రెండుపార్టీలు వరుసగా మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి.
మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు 23మంది మం త్రులు, ఎన్‌సిపికి 20మంది మంత్రులు ఉం టారు.ఎన్‌సిపిమంత్రులంతా శనివారమే ప్రమాణ స్వీకారం చేస్తారు. కాంగ్రెస్ మంత్రులు మాత్రం దశలవారీగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ''మేం రేపు (శనివారం) కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వం ఏర్పాటుకు ఈ రోజు సాయంత్రం సంసిద్ధత తెలుపుతాం అని కాబోయే ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ తెలిపారు.
|
|
|
|
|
|
|