మార్చిన వార్తా విశేషాలు - శని వారం మార్చి   13th 2010 - 4:41 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
తెలంగాణపై హైకమాండ్‌కు చెబుతా
శని వారం, నవంబర్ 07, 2009 , 11:38 [IST]

kcrఢిల్లీ వెళ్లే ముందు కెసిఆర్‌కు రోశయ్య హామీ
ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్‌:
తెలంగాణ సాధన విషయంలో తాము శాంతియుత పోరాటం చేయాలనుకున్నామని, యుపిఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖ రరావు శుక్రవారంనాడు సాయంత్రం ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను కలిశారు. ఆయన నివాసానికి కేసీఆర్‌తో పాటు ప్రొఫెసర్‌ జయశంకర్‌, శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్‌, పలువురు ఎమ్మె ల్యేలు వెళ్ళారు.

  ఈ సందర్భంగా రోశయ్య ఒక మెమోరాండం సమర్పిస్తూ పదేళ్ళుగా తెలంగాణ ఏర్పాటు విషయంలో దగా చేస్తున్నారని, కాంగ్రెస్‌ అధిష్టానం సరైన రీతిలో స్పందించడంలేదని, సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ ప్రసంగాలకు విలువ లేకుండా చేశారని కెసిఆర్‌ పేర్కొన్నారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా కేంద్రంపై వత్తిడిచేయాలని కోరారు. దానికి రోశయ్య స్పందిస్తూ తాను ఇప్పుడు ఢిల్లీకి వెడుతున్నందున తెలంగాణ అంశాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసు కెడతానని, ఈ సమయంలో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టొద్దని సూచించినట్లు తెలుస్తోంది.

 అనంతరం కెసిఆర్‌ బృందం రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ ఎన్డీ తివారీని కలుసుకుంది. అక్కడ ఆయన వారి మెమోరాండాన్ని క్షుణ్ణంగా చది వించుకుని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెస్తానని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి ఈటెల రాజేందర్‌ తెలంగాణ ఏర్పాటు న్యాయమైన, ప్రజాస్వామి కమైన డిమాండ్‌ అని తెలియజేస్తూ ఈమేరకు ఈనెల రెండు లేదా మూడో వారంలో కేసిఆర్‌ నిర్వహించే నిరాహార దీక్షలకు మిత్ర పక్షాల నుంచి మద్దతు కోరుతూ లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌ నారాయణ, సిసిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వి. రాఘవులు, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ తదితరులను రాత్రి పొద్దుపోయే వరకు కలుసుకున్నారు.

9,10 తేదీల్లో ఢిల్లీకి కెసిఆర్‌ పయనం
 ఈ విడత ఆయన యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాందీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, ఇతర పక్షాల జాతీయ నేతలను కలుసుకుని తెలంగాణ ఏర్పాటు విషయంలో స్పందించాలని కోరేందుకు ఈనెల 9,10న ఢిల్లీకి వెళ్ళేందుకు కేసిఆర్‌ సన్నద్ద మవుతున్నారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 జమునకు ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం
 పరిహారంలోనూ పరిహాసం!
 మహిళా లోకానికి శుభాకాంక్షలు
 చల్లని కబురు
 లేచింది మహిళా లోకం దద్దరిల్లింది..
 ముగ్గురు రైతుల ఆత్మహత్యలు
 పర్యటన జయప్రదం
 వద్దన్నవారూ వస్తారు
 థర్డ్‌ జనరేషన్‌ (3జి) ప్రారంభించిన..
 పర్యావరణ మార్పులతో పంట నష్టం :..
 
 
ముఖ్య వార్తలు
  ఐటి, పరిశ్రమల భద్రతకు..
  'ఇంటర్‌'లో 60 వేల మంది డుమ్మా
  మైనింగ్‌ మాఫియాకు సర్కార్‌ దన్ను
  ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం..
  15 లేదా 16న లోక్‌సభలో మహిళా బిల్లు
  సొంత పార్టీ నుంచి సూకీ బహిష్కరణ
  ఒఎన్‌జిసి, ఐఒసి ఐపిఒలు ఉండవు
  కొత్త హంగులతో మాక్స్‌ ఐపిఎల్‌..
  హైతీ బాధితుల సహాయార్థం లియాండర్‌..
  రుణాల వడ్డీ మాఫీపై రాష్ట్రాల పోటీ
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com