మార్చిన వార్తా విశేషాలు - గురు వారం మార్చి   11th 2010 - 10:07 AM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
అనర్హులకు 40 లక్షల సబ్సిడీ
శని వారం, నవంబర్ 07, 2009 , 11:34 [IST]

ఉద్యానవన మిషన్‌లో అడ్డగోలు వ్యవహారాలు
హైదరాబాద్‌, నవంబర్‌6, ప్రభాతవార్త:
రాష్ట్రంలో పండ్ల తోటలను అభివృద్ధి చేసి రైతాంగాన్ని అన్నివిధాలు ఆదు కోవాలనే ప్రభుత్వ లక్ష్యం అవినీతిపరులకు కామధేనువు లాగా మారింది. కోట్లాది రూపాయల నిధులతో రాష్ట్ర ఉద్యాన వన మిషన్‌ను ఏర్పాటు చేసి రైతులకు సబ్సిడ లతో పండ్ల తోటలను పెంచేందుకు, పండ్లతోటలకు అవసరమైన బయో ప్రొడక్స్‌ ఉత్పత్తి చేసే యూనిట్లకు, ఇతర సంబంధిత రంగాలకు సబ్సిడీలను   ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ఉద్యానవన మిషన్‌ అధికారులు, కొన్ని పేపర్‌ టైగర్‌ లాంటి కనీస అర్హతల్లేని కంపెనీలు కుమ్మక్కయ్యి కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోప ణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.

అన్ని అర్హతలుండి రు ణాలకోసం చెప్పులరిగేలా తిరిగినాపట్టించుకోని ఉద్యాన వన శాఖాధికారులు కనీస అర్హతలు కూడా లేనటువంటి కంపెనీకి ఏకంగా 40లక్షల రూపాయలనిధులను సబ్సి డీగా ఇచ్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అర్హత లేని సంస్ధలకు లక్షలాది రూపాయలు సబ్సిడీల ఇచ్చి వాటాలు వేసుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రస్ధాయిలో విన్పిస్తున్నాయి. సంస్ధలో జరుగుతున్న అవినీతి, అక్ర మాలు,ఉన్నతాధికారులఅడ్డగోలువ్యవహారాలకు ఇటీవల  కె.ఎన్‌ బయో సైన్సెస్‌కు ఇచ్చిన సబ్సిడీ దర్పణం పడు తుందని అందులో పనిచేసే ఉద్యోగులు చెప్పుకుంటు న్నారు.  వివరాలలోకి వెళ్లితే.. పండ్లతోటలకు, వాటి అనుబంధరంగాలకుసంబంధించిన యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ఉద్యానవన మిషన్‌సబ్సిడీలు అం దిస్తుంది.

ఇందులో భాగంగా కె.ఎన్‌ బయో సైన్సెస్‌ అనే కంపెనీకి గత జూన్‌ నెలలో 40 లక్షల సబ్సిడీ అందించింది. నిబంధనల  ప్రకారం  రాష్ట్ర ఉద్యానవన మిషన్‌ 2004లో ఏర్పాటు చేయగా తర్వాత స్ధాపించిన కంపెనీలకు మాత్రమే సబ్సిడీ ఇవ్వవల్సి ఉంటుంది.  అయితే అక్టోబర్‌ 2003లో స్ధాపించిన కెఎన్‌ బయో సైన్సెస్‌కు 2009లోసబ్సిడీ ఇవ్వడం పలు అనుమానా లకు తావిస్తోంది. అది కూడా రెండుసార్లు తిరస్కరిం చిన తర్వాత సబ్సిడీ అందిం చడం ఏమిటని సీనియర్‌ అధికారులే ప్రశ్ని స్తున్నారు.

కెఎన్‌ బయో సైన్సెస్‌ పూర్వాపరాలు
ఈ కంపెనీ యాజమాని మొదట్లో శ్రీసాయి బయోటెక్‌ ల్యాబ్‌ పేరిట టిష్యూ కల్చర్‌ ఉత్పత్తిచేసే కంపెనీ ప్రారం భించి తర్వాత దానిని రద్దుచేసి 2003 అక్టోబర్‌లో  ఈ కె.ఎన్‌బయోసైన్సెస్‌యూనిట్‌ను ప్రారంభించారు. ప్రస్తు తం ఈ  కంపెనీలో బయో ఫర్టిలైజర్స్‌, ట్రైకోడెర్మా విరిడి, సుడోమోనాస్‌, అజెస్పెర్లిం, రైజోబియం తది తరబయోపెస్టిసైడ్సుతయారుచేస్తున్నట్లు సంస్ధ  యాజ మాని సుధారెడ్డి తెలిపారు.

కెఎన్‌ బయో సైన్సెస్‌కు అర్హత ఉందా?

అసలు ఈ కెఎన్‌బయో సైన్సెస్‌కంపెనీకి సబ్సిడీ పొంద డానికి అర్హతలున్నాయా అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. సంస్ధను 2003ప్రారంభించినందున నిబంధ నల ప్రకారం సబ్సిడీపొందడానికి అర్హత లేదని ఉద్యాన వనశాఖలో సీనియర్‌ అధికారులే పరోక్షంగా అంగీకరిసు ్తన్నారు. దీనికితోడు అసలు ఈ సంస్ధ ఇప్పటివరకు సక్ర మంగా వ్యాపారంచేసినట్లుగాలేదు. సంస్ధను 2003లో ప్రారంభించి 2008వరకువ్యవసాయ, ఉద్యానవన తది తర ప్రభుత్వ శాఖలతో వ్యాపార లావాదేవీలు జరిపిన దాఖలాలులేవు. 2008-09లోమాత్రమే ఆగ్రోస్‌ ద్వారా ఉద్యానవనశాఖకు ఇరవైలక్షలలోపు మెటీరియల్‌ సప్లయి చేశారు.

అదికూడా కంపెనీయాజమాని చెప్పినట్లు వివిధ ఉత్పత్తులు కాకుండా ట్రైకోడెర్మావిరిడి, సుడోమోనాస్‌ ప్రొడక్స్‌ మాత్రమే సరఫరా చేసినట్లు   ఆగ్రోస్‌ రికా ర్డులు స్పష్టం చేస్తున్నాయి. 2009-10లో శాంపుల్స్‌ సరఫరా చేయలేదని ప్రాథమిక దశలోనే ఈ సంస్ధ టెం డరును  తిరస్కరించినట్లు  ఆగ్రోస్‌సంస్ధ అధికారులు చెపుతున్నారు. శాంపుల్‌ ఇవ్వనట్లయితే టెండర్‌ను అను మతించమని నిబంధనలలోనే స్పష్టంగా పేర్కొన్నప్పటికీ 40లక్షల సబ్సిడీ ఎత్తుకున్న ఇంతా పెద్ద కంపెనీ శాం పుల్స్‌ సరఫరా చేయకుండా టెండర్‌లో పాల్గొనడమే మిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవ త్సరం కూడా ఈ కంపెనీ పేరుమీద వేరే సంస్ధ వ్యాపా రం చేసినట్లు సంస్ధ యాజమాని సుధారెడ్డి చెప్పడం ఇక్కడప్రస్తానార్హం. అసలు ఈ కంపెనీ ఎలాంటి బయో ప్రొడక్స్‌ ఉత్పత్తి చేయడం లేదని అందుకే టెండర్‌ సమ యంలోశాంపులుఅందించలేకపోయిందనిచెపుతున్నారు.

సబ్సిడీ ఎందుకిచ్చినట్లు?

కెఎన్‌ బయో సైన్సెస్‌కు సబ్సిడీ ఇవ్వడం పలు అను మానాలకు తావిస్తోంది. ఈ కంపెనీ సబ్సిడీ కోసం దర ఖాస్తు చేసుకుంటే రెండు సార్లు ప్రస్తుత ఇడి అరుణ్‌ కుమార్‌ దానిని తిరస్కరించినట్లు చెపుతున్నారు. కార ణాలు ఇదమిత్థంగా తెలియనప్పటికీ  ఈ కంపెనీకి అదే అధికారి సబ్సిడీఎందుకిచ్చారో అంతుచిక్కడంలేదని అధి కార వర్గాలే అంటున్నాయి. కంపెనీకి ఇచ్చిన సబ్సిడీలో 12లక్షలు చేతులు మారినట్లు ఉద్యానవనశాఖలో ప్రచా రం జరుగుతుంది.

నిబంధనలకనుగుణంగానే సబ్సిడీ

కెఎన్‌ బయో సైన్సెస్‌కు నిబంధనల ప్రకారమే సబ్సిడీ ఇచ్చినట్లు ఉద్యానవనమిషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఇడి) అరుణ్‌కుమార్‌ తెలిపారు. కంపెనీ రిజిస్ట్రేషన్‌తో సంబం ధంలేకుండా సబ్సిడీ తీసుకున్న తర్వాత ఉత్పత్తి ప్రారం భించాల్సిఉంటుందని చెప్పారు. మొదట్లో కొన్ని డాక్యు మెంట్లుఅందించనందునసబ్సిడీఇవ్వడం వాయిదా వేసి పూర్తి డాక్యుమెంట్లు అందిన తర్వాత సబ్సిడీ మంజూ రుచేసినట్లు ఇడి టెలిఫోనులో వివరణ ఇచ్చారు.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 మైనింగ్‌ మాఫియాకు సర్కార్‌ దన్ను
 మెడపెట్టి గెంటినా చూరు పట్టుకు..
 పరిహారంలోనూ పరిహాసం!
 'ఇంటర్‌'లో 60 వేల మంది డుమ్మా
 లక్ష్మీపార్వతితో బాలకృష్ణ భేటీ
 ఇంటర్‌ జవాబుపత్రం నిండా జై తెలంగాణ
 రోశయ్యకు అస్వస్థత
 విద్యుత్‌ సమస్యపై అసెంబ్లీలో గరం..
 తెలంగాణ కోసం సంతకాలు చేయని..
 ఐటి, పరిశ్రమల భద్రతకు..
 
 
ముఖ్య వార్తలు
  చంద్రబాబును దూషిస్తే సహించం
  మహిళాబిల్లుతో ఎంపీల్లో ఆనందం
  ఎట్టకేలకు మహిళకు పట్టం
  'చెన్నై సూపర్‌ కింగ్స్‌'కు బౌలర్ల..
  అతిగా జీతాలు ఇవ్వకండి
  మార్కెట్లోకి ఫోర్డు పైగో కారు
  రోజాలు పూయించే బులియన్‌ స్టిచ్‌
  అతివలకు అందివస్తున్న అవకాశాలూ,..
  రజనీ అయితే ఓకే!
  'ఏమాయ చేసావె' విజయానందం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com