మార్చిన వార్తా విశేషాలు - సొమ వారం మార్చి   15th 2010 - 8:13 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
డెల్టా ఆధునీకరణ ఉల్టా
శుక్ర వారం, నవంబర్ 06, 2009 , 10:44 [IST]

deltaగోదా'వరికి నీరు లేదు!
ఎల్‌జిఒ బుక్కు దుమ్ము దులిపారు
ఉన్న జలం ఇంజనీర్లకు వరం - కొందరు రైతులకు శాపం
ప్రభాతవార్త - కాకినాడ :
గోదావరిలో నీరు లేదు. అలాగని గోదావరిడెల్టాలో ఆధునీకీక రణలేదు. ప్రస్తుతం గోదావరిజిల్లాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య. గోదావరికి గడచిన కొన్ని దశాబ్దాల్లో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ ఉత్పన్నం కాలేదు. మూడు దశాబ్దాల క్రితం ఇటువంటి పరిస్థితులు అప్పట్లో ఉన్నా లోక లైజ్‌ గెజిట్‌ ఆర్డర్‌తో బయటపడేవి కాదు.

ఎల్‌జిఒ ప్రకారం అప్పట్లో ఇంజనీర్లు ఆడింది ఆట, పాడింది పాట. ఏ ప్రాంతానికి, ఏ ఆయ కట్టుకు నీరు ఇవ్వాలనేది 1962లో రూపొం దించిన ఎల్‌జిఒ బుక్కు నుంచే తాము నీరంది స్తామని వారు చెప్పుకునేందుకే అనువుగా ఉన్నా ఆచరణలో మాత్రం రెండుచేతులా పుష్కలంగా డబ్బు పొందేందుకే అప్పట్లో ఈ ఎల్‌జిఒ వారికి వరంగా ఉండేది. ఇప్పుడైతే డిస్టిబ్యూషన్‌ కమిటీలు వచ్చాయి.

అప్పట్లో ప్రతి ఆయకట్టులో ఉన్న దళారీలే ఇంజనీర్లకు ఎకరాకు ఇంతనిచెప్పి సొమ్ము పోగుచేసి వంతు లవారీ నీటి సౌకర్యాన్ని అందించే వారు. అయితే ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమ యంలో ఖరీఫ్‌కే కాదు రబీకి కూడా నీరు ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేయడంతో ఆయన దెబ్బకు జడిసి ఇంజనీర్లు ఎల్‌జిఒను మూసివేశారు. తిరిగి ఇన్నాళ్లకు ఆ బుక్‌కు దుమ్ము దులిపారు. గోదావరిలో నీరు లేకపో వడం ఆయాచితంగా ఇంజనీర్లకు వరమైంది. నీరు లేదంటూ బిగబట్టి రైతాంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి చివరకు నీరుఇచ్చి గుంజుకునే పాతపద్ధతి మొదలవబోతోంది.

ఓ విధంగా గోదావరిలో నీరు లేకపోవడం దురదృష్టకరమైనా ఓ విధంగా రైతాంగం అర్ధం చేసుకుంటే ఈ పరిస్థితిని సద్వినియోగం చేసు కోవచ్చు. ఈ రబీకి క్రాఫాలిడే ప్రకటించి డెల్టా ఆధునీకరణకు రైతాంగం ఏకగ్రీవ ఆమోద ముద్ర తెలిపితే అటు ప్రభుత్వం, ఇటు ఇంజనీర్లు ఇరకాటంలో పడేవారు. ఆ పరిస్థితి ఎక్కడ ఉత్పన్నమవుతుందోనన్న భయంతో ఎల్‌జిఒ దుమ్ము దులిపారు. దాని ప్రకారం తమ కళ్ల ముందే నీరు పారుతున్నా తమ చేలకు కాకుండా ఇతరుల చేలకు నీరు వెళ్లే పరిస్థితి ఈ రబీలో తిరిగి మొదలవుతోంది. దీంతో నీటియుద్దాలు తప్పవు. ఈ పరిస్థితి అటు ప్రజాప్రతినిధులకు, ఇటు డిసిలకు, మరో పక్క ఇంజనీర్లకు తెలిసినా రైతాంగాన్ని ఏదో విధంగా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

గోదావరి డెల్టా ఆధునీకరణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సుమారు రూ.2వేల కోట్లలతో ఆమోదముద్ర వేశారు. సర్‌ ఆర్థర్‌కాటన్‌ నిర్మించిన డెల్టావ్యవస్థ అనేక ప్రాంతాల్లో శిథిµలావస్థకు చేరుకుంది. ము ఖ్యంగా కల్వర్టులు, లాకులు, వంతెనలు, క్వార్టర్స్‌, కార్యాలయాలు అన్ని శిథిµలావస్థకు చేరి మరమ్మతులకు ఎదురు చూస్తున్నాయి. ఇటువంటి
తరుణంలో  నీటి ఎద్దడిని  పరిగణలోకి తీసుకుని డెల్టా ఆధునీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయ త్నిస్తే నీటికొరతను ఎదుర్కొంటున్న రైతాంగానికి మరికొన్ని దశాబ్దాలపాటు మేలు చేసినట్లు అవు తుంది. అయితే ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఆ పనులకు ఆటంకాలు కల్పిస్తున్నాయని తెలుస్తోంది.

ఆ మాట బయటపెట్టకుండా నాలుగేళ్ల కాల పరి ధిలో చివరి క్లోజర్‌లో ఆ పనులు చేసేందుకు ప్రయ త్నిస్తామంటున్నారు. ఇంత వరకు కాల్వల మట్టితీత పనులతో కాలక్షేపం చేయాలనే దృక్పథంతోనే అటు అధికారులు, కాంట్రాక్టర్లు ఉన్నారు. మట్టి పనుల్లో అయితే కాసుల వరద పారుతోంది. దీంతో క్లోజ ర్‌లో మట్టి పనులకే వారు మొగ్గుచూపుతారు. కాం ట్రాక్టర్లు సైతం ముందుగా ఇటువంటి పనులకే టెం డర్లు వేస్తారు, ప్రాధాన్యత ఇస్తారు. నిర్మాణ పనులు సాధ్యమైన మేర వీరు ముట్టుకోకుండా ఉండే ప్రయ త్నాలే డెల్టా ఆధునీకరణలో చోటు చేసుకోబోతు న్నాయి.

ఈ ఏడాదికాదు వచ్చే ఏడాదికూడా ఆధునీ కరణలో నిర్మాణపనులకు కాంట్రాక్టర్లు  చొరవచూపే అవకాశం ఉండదని భావిస్తున్నారు. డెల్టా ఆధునీ కరణలో 16 ప్యాకేజీలు ఉన్నా అందులో అయి దారు ప్యాకేజీలు ఒక కొలిక్కి వచ్చినా వాటి పనులు చేపట్టే దిశలో కాంట్రాక్టర్లు లేరు. దీనికి సవా లక్షా కారణాలు చెబుతున్నారు. అగ్రిమెంట్ల ప్రకారం ఈ క్లోజర్‌లో ఆ పనులు లేవని ఒక కారణంగా చూపు తున్నారు. చిత్తశుద్ది ఉంటే గోదావరిలో నీరులేని ఈ పరిస్థితిలో ప్రభుత్వం మెడలువంచి ఈ క్లోజర్‌లోనే ఈపనులు చేసేలాఅంగీకరింపచేయవచ్చు. ప్రభుత్వ అనిశ్చిత స్థితిలో కాంట్రాక్టర్లు చేతులు కాల్చుకునేం దుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం మీద వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఆమోదమైన గోదావరి డెల్టా ఆధునీకరణ నేతి బీరలో నేతి చం దంగానే ఉంటోంది. అటు ప్రజాప్రతినిధులు, ఇంజ నీర్లు, కాంట్రాక్టర్లు సంయుక్తంగా కృషి చేస్తేనే ఒక కొలిక్కి రావచ్చు.


గోదావరి జిల్లాల్లో సుమారు 9లక్షల ఎకరాలకు రబీ ఆయకట్టు ఉండగా దానికి 105 రోజుల పంట కాలానికికావాల్సిన నీటిఅవసరాన్నిబట్టి 102 టిఎం సిలు కావాల్సి ఉంది. అయితే పరిశ్రమలకు, మంచి నీటికి, చెరకు పంటకు ఇలా ఇతరత్రా అన్ని అవస రాలు పోను గోదావరిలో ఉండే 32 టిఎంసిల్లోనూ ఇక మిగిలేది 20 టిఎంసిలు ఉంటుంది. ఈ నీటితో ఉభయగోదావరి జిల్లాల్లో 2లక్షల 25వేల ఎకరా లకు రబీ ఆమోదమైంది. ఇప్పటికి తూర్పుగోదావ రికి లక్షా 9వేల 600 ఎకరాలు, పశ్చిమ గోదావరి లక్షా 15వేల 400 ఎకరాలు సాగుకు అనుమతి లభించింది.

అదేవిధంగా తూర్పుడెల్టాకు 66,400, సెంట్రల్‌ డెల్టాకు 43,200, పశ్చిమడెల్టాకు లక్షా 25వేల ఎకరాల ఆయకట్టుకు నీరు పంపిణి జరి గేలా స్థిరీకరించారు. ప్రస్తుతం మండలాల వారీ ఎన్నెన్ని ఎకరాలకు నీరు ఇవ్వాలనే దానిపై కూడా లెక్కలు ఖరారు చేశారు. ఇకపై సర్వే నెంబర్ల వారీ విడదీయాల్సి ఉంటుంది. ఇప్పటికే అటు ఆధునీ కరణ లేక, ఇటు రబీ లేక ఉండే రైతాంగం ఈ ఏడాదిఏవిధంగా స్పందిస్తుందోనన్నఆందోళన సైతం ప్రభుత్వంలో ఉంది. అందుకే అచీ తుచీ అడుగు వేయాలని ఎక్కడా ఎటువంటి వివాదాలు రాకుండా సర్దుబాట్లు చేయాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు ఎక్కడికక్కడ జారీ అయ్యాయి.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 96 మున్సిపాలిటీలలో మంచినీటి..
 హైదరాబాద్‌ నుంచి విశాఖకు ఎఫ్లూ..
 సిపిపి కోశాధికారిగా..
 జమునకు ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం
 పరిహారంలోనూ పరిహాసం!
 మహిళా లోకానికి శుభాకాంక్షలు
 చల్లని కబురు
 లేచింది మహిళా లోకం దద్దరిల్లింది..
 ముగ్గురు రైతుల ఆత్మహత్యలు
 పర్యటన జయప్రదం
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com