మార్చిన వార్తా విశేషాలు - ఆది వారం మార్చి   14th 2010 - 7:14 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
టిక్కెట్లు అమ్ముకున్నారు
శుక్ర వారం, నవంబర్ 06, 2009 , 10:35 [IST]

pranteeyaదానంపై మణెమ్మ ధ్వజం, భిక్షపతి ఆగ్రహం
ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నిమిత్తం అభ్యర్థుల ఎంపిక సందర్భంగా టిక్కెట్లుఅమ్ముకున్నారనినగర నాయ కత్వంపై పలు ఆరోపణలు వచ్చాయి. లక్షలాది రూపాయలకు టిక్కెట్లు అమ్ముకున్నారని గ్రేటర్‌ హైదరాబాద్‌ పార్టీ అధ్యక్షుడు దానం నాగేం దర్‌పై నేరుగా ఆరోపణలు చేస్తూ ముషిరాబాద్‌ ఎమ్మెల్యే మణెమ్మ గురువారం అర్ధరాత్రి ధర్నా చేశారు.

నాగేందర్‌ ఇంటి ముందే తన అనుచరు లతో ధర్నా చేయడంతో పాటు ఆయనతో నేరుగా వాదులాటకు దిగారు. బోలక్‌పూర్‌, కవాడిగూడ, బాగ్‌లింగంపల్లి, ముషిరాబాద్‌ తదితర డివిజ న్లతో తాను సూచించిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారని, ఇందులో లక్ష లాది రూపాయలు తారుమారయ్యాయన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తామని, దానంను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

రమ్యాగ్రౌండ్‌ వద్ద డిఎస్‌ దిష్టిబొమ్మ తగల పెట్టగా, కూకట్‌పల్లి హౌజింగ్‌ బోర్డు కాలనీలోని కాంగ్రెస్‌ కార్యాలయాన్ని ధ్వసం చేయడంతో పాటు తగలపెట్టారు. తాము కోరుకున్నవారికి టిక్కెట్లు రాలేదని వడ్డేపల్లి నర్సింగ్‌రావు ఆను చరులు ఈ విధ్వంసానికి దిగారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, వైఎస్‌ జగన్‌కు సన్ని హితంగా ఉండే సుధీర్‌రెడ్డి (ఎల్‌.బి.నగర్‌) తన వెంట కోన శ్రీశైలం గౌడ్‌(కుత్బుల్లాపూర్‌), భిక్షపతి యాదవ్‌(శేర్‌లింగంపల్లి), రాజిరెడ్డి(ఉప్పల్‌) తది తర ఎమ్మెల్యేలను పెట్టకుని గురువారం మధ్యా హ్నం నుంచి సాయంత్రం వరకు ఒక హోటల్‌లో సమావేశమై భవిష్యత్తుకార్యక్రమాన్ని రూపొందిం చుకున్నారు. తాము అనుకున్న వారికి టిక్కెట్లు రాకపోతే, స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దింపాలని యోచించారు.

వారి భావించినట్లుగానేటిక్కెట్లు రాకపోవడంతో ఆందోళనకు సన్నద్ద మవుతున్నారు. వీరితో పాటు సమావేశమైన వడ్డే పల్లి నర్సింగ్‌రావు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఆయన తనతో పాటు తన అనుచరులకు డివిజన్‌ టిక్కెట్లు కోరుకున్నారు. అయన గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి పోటీ చేసి ఓడిపో యారు. కాగా,మల్కాజ్‌గిరిఎమ్మెల్యేఆకుల రాజేం దర్‌, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే జయసుధ కూడా వారి బాటలోనే ఉన్నారు.వారు సుధీర్‌రెడ్డికి ఫోన్‌ చేసితాముకోరుకున్నవారికిటిక్కెట్లు రాలేదన్నారు.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 హైదరాబాద్‌ నుంచి విశాఖకు ఎఫ్లూ..
 డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
 బహిష్కరణపై ఆగ్రహం
 కాంగ్రెస్‌నూ అంటున్నాం
 వరుస డంప్‌లు
 ప్రధాన పార్టీల నిష్క్రమణతో ఒంటరైన..
 మావోయిస్టు నేతల 'ఎన్‌కౌంటర్‌' పై..
 శాఖమూరికి నివాళి
 నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో..
 బహిష్కరణపై తెలుగుదేశం ఆగ్రహం
 
 
ముఖ్య వార్తలు
  ఇంటర్‌ పరీక్షల్లో 39 మంది డిబార్‌
  నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది..
  సిపిపి కోశాధికారిగా..
  కాంగ్రెస్‌ నెత్తిన కుంపటిలా మహిళా..
  ధరలపై ధనాధన్‌
  భారీ స్కోరుపై కన్నేసిన ఇంగ్లండ్‌
  నేపాల్‌లో స్వామి రాందేవ్‌ యోగా..
  పాక్‌ ప్రతిపాదన తిరస్కరించిన..
  జైల్లో తన హత్యకు కుట్ర: హసీనా ఆరోపణ
  ఐటిసి ఇన్ఫోటెక్‌లో కొత్త ఉద్యోగాలు
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com