మార్చిన వార్తా విశేషాలు - మంగళ వారం పిబ్రవరి   09th 2010 - 4:39 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
ఒఎంసి గనుల అవినీతి బాగోతంపై డైరెక్టర్‌పై వేటు పడేనా?!
శుక్ర వారం, నవంబర్ 06, 2009 , 10:31 [IST]

అక్రమాలను తీవ్రంగా పరిగణిస్తున్న సిఎం
ప్రత్యేక ప్రతినిధి, ప్రభాతవార్త / హైదరాబాద్‌:
అనంత పురంజిల్లా, డి హీరేహాళ్‌ మండలంలో ఓబుళా పురం మైనింగ్‌ కార్పొరేషన్‌ (ఒఎంసి) యధేచ్ఛగా పాల్పడుతున్న ఇనుప ఖనిజం అక్రమ తవ్వాలకు గనులశాఖ డైరెక్టర్‌ విడి రాజగోపాల్‌ అండగా నిలు స్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒఎంసి అధినేత, కర్నాటకలో బిజెపి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్న గాలి జనార్ధనరెడ్డికి అడ్డ గోలుగా అనుమతులిచ్చి, రాష్ట్ర ఖనిజ సంపదను దోచుకుంటున్నారంటూ గత కొద్దిరోజుల నుంచి విప క్షాల నుంచి వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి కె రోశయ్యతోపాటు, ఆ పార్టీఅధిష్టానంకూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

దివం గత  సిఎం వైఎస్‌కు,  జగన్‌,  కెవిపిలకు కూడా ఒఎంసి అక్రమాలలో భాగస్వామ్యం ఉన్నదని వారు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇవే ఆరోపణలతో గతకొద్దిరోజులుగా విపక్షాలన్నీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. ఈ పరిణామాలన్నీ ముఖ్యమంత్రి రోశయ్యఆచితూచీపరిశీలిస్తున్నారు.విపక్షాలు చేస్తున్న ఈ ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్ఠకు కళంకం తెచ్చా యన్న యోచనలో సిఎం ఉన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితి ఇంకా చేయి జారకుండా  అవినీతి అధికా రులపై విచారణ జరిపి, క్రమశిక్షణా చర్యలు తీసుకో వాలని భావిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

గనుల అక్రమాలకు అండగా ఉన్న డైరెక్టర్‌పై ఎందుకు  చర్యలు తీసుకోరని విపక్షాలు సిఎం రోశయ్యను సూటిగా  ప్రశ్నిస్తున్నాయి. అంతేగాక ప్రభుత్వం స్పందించకపోతే సుప్రీంకోర్టు పరిధి లోగల ఉన్నతస్థాయి సాధికార కమిటీకి ఫిర్యాదు కూడా చేయనున్నట్లు టిడిపి నేతలు హెచ్చరిస్తు న్నారు. ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి రోశయ్య గనులశాఖ డైరెక్టర్‌పై  వేటు వేయాలని యోచిస్తు న్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే రాజగోపాల్‌ నిర్వహిస్తున్న డైరెక్టర్‌, ఎపి ఎండిసి ఎండి రెండు పదవుల నుంచి ఒకేసారి తప్పించాలా లేక ఒక పదవి నుంచి తప్పించాలా అనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోవ లసి ఉన్నది. అయితే రాజగోపాల్‌ను అక్కడే కొన సాగించాలని పాలక పెద్దలతోపాటు బిసి సం ఘాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.

ఇదిలావుండగా, గనుల శాఖ డైరెక్టర్‌గా, ఎపి ఎండిసి ఎండిగా రెండు పదవులు నిర్వహిస్తున్న రాజగోపాల్‌నుతక్షణమేఆపదవులనుంచి తప్పించి, విచారణకు ఆదేశించాలంటూ ప్రధాన విపక్షమైన టిడిపి  నేతలు  కొద్టిరోజుల  నుంచి అదేపనిగా కొన్ని సాక్ష్యాధారాలతోసహా ఆరోపణలు గుప్పి స్తున్న విషయం తెలిసిందే. అంతేగాక గురు వారం సాయంత్రం గనుల శాఖ ప్రభుత్వ కార్య దర్శి వీరభద్రయ్యను టిడిపి ఎమ్మెల్యేలు రేవంత ్‌రెడ్డి,దయాకరరావు ప్రభృతులు సచివాలయంలో కలిసి ఒక మెమోరాండం సమర్పించారు. తక్ష ణమే ఒఎంసి అక్రమ తవ్వకాలను నిలుపు చేయా లని, లీజులు రద్దుచేసి, ఆ కంపెనీ అధినేత గాలి జనార్ధనరెడ్డి, ఆయనను ప్రోత్సహిస్తున్న గనుల శాఖ డైరెక్టర్‌  రాజగోపాల్‌పై చర్యలు తీసుకోవా లని,  ఇందుకు  సంబంధించిన ఫైళ్ళను తమకు చూపించాలని డిమాండ్‌ చేశారు. 

కాగా  ముఖ్యమంత్రి ఆదేశాలపై ఒఎంసి సరి హద్దు వివాదం, ఇనుపఖనిజం అక్రమ తవ్వకాలు తదితర అంశాలపై గనులశాఖ కార్యదర్శి వీరభద్ర య్య అధ్యయనం చేస్తున్నారు. నేటి సాయంత్రం కూడా సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు. ఒఎంసిపైవచ్చిన ఫిర్యాదులు,ఆరోపణలకుసంబం ధించిన ఫైళ్ళనుకూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన సిఎం ఢిల్లీ పర్యటనకు ముందే  ఒఎంసి అక్రమాలపై సమగ్రనివేదిక అందజేయనున్నారు. ముఖ్యమంత్రి శుక్రవారం ఢిల్లీపర్యటనలో ఒఎంసి అక్రమాలవల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కలిగే అప్ర తిష్ఠ,  తదనంతర పరిస్థితులను అధిష్ఠానానికి  వివరించనున్నారు.రోశయ్యపర్యటనతర్వాతగనుల డైరెక్టర్‌పై ఏ చర్యలు తీసుకునేదీ తేలనున్నది.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 మెరుగుపర్చకుంటే మెతుకుండదు:..
 ఏప్రిల్‌ 1న జూ.ఎన్టీఆర్‌..
 తాలిబన్లను తలపిస్తున్నారు
 'అదుర్స్‌ను బహిష్కరిస్తున్నాం
 గాడి తప్పిన రోశయ్య పరిపాలన: తలసాని
 వర్సిటీలపై మూడు కమిటీల ఏర్పాటు
 రాజ్యాంగ విరుద్ధం
 
 
ముఖ్య వార్తలు
  కత్రినా ఐటమ్‌సాంగ్‌
  ఫిలిప్పీన్స్‌ పోలీసుల కాల్పుల్లో..
  భారత పర్యటనకు 5 ఇంగ్లండ్‌ మహిళా..
  కోల్‌కతా టెస్టుకు శ్రీశాంత్‌
  ఎటిపి ర్యాంకింగ్‌లో మెరుగుపడ్డ..
  పేదల పక్షపాతిగా మోడీ
  స్వదేశీ ఉపగ్రహ ప్రయోగం!
  త్వరలో అదుపులోకి ధరలు : ప్రణబ్‌
ముస్లిం రిజర్వేషన్స్ పై హైకోర్ట్ ఇచ్చిన తీర్పు సమంజసమేనా?
అవును
కాదు
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com