|
వసూలుకు రంగం సిద్ధం రుజువయ్యే నేరాలపైనే నోటీసిచ్చిన డిఎఫ్‌ఒ అనంతపురం, నవంబర్ 5 ప్రభాతవార్త ప్రతినిధి : ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ నుంచి 500 కోట్ల రూపాయలు అపరాధరుసం వసూలు చేయడానికి రంగంసిద్ధం చేసినట్లు విశ్వసనీ యంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివిద శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏఏ శాఖల పరిధిలో ఒఎంసిి ఉల్లంఘనలకు పాల్ప డిందో వాటిని సూటిగా ఎత్తి చూపి ఇంత భారీ స్థాయిలో అపరాధరుసుం విధించాలని నిర్ణయిం చినట్లు సమాచారం. అపరాధ రుసుం వసూలు చేయడంతో పాటు నిబంధనలకు అనుగుణంగా ఓఎంసి నడుచుకునేలా కట్టడి చేయాలనే నిర్ణ యానికి వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి డిఎఫ్‌ఒ కల్లోల్ బిస్వాస్ ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్‌కు ఇచ్చిన నోటీసులకు సమాధానాలు ఇవ్వలేని స్థితిలో కంపెనీ ఉంది. క్షేత్రస్థాయిలో స్పష్టంగా నిరూపణయ్యే ఉల్లంఘనలపైనే డిఎఫ్‌ఒ నోటీసులు ఇచ్చారు. చాలా ఏళ్ళపాటు ఇక్కడ డిఎఫ్‌ఒగా పనిచేసిన అనుభవం నేపధ్యం లోనే కల్లోల్ బిస్వాస్ ఒఎంసి సమాధానం ఇవ్వ లేని విషయాలపైనే నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలోనే ఇచ్చిన నాలుగు నోటీసులకు కేవలం ఒక్కనోటీసుకు మాత్రమే ఒఎంసి ప్రతి నిధులు సమాధానం ఇవ్వగలిగారు. మే నెల 9వ తేదీన ఆరున్నర హెక్టార్లలో అక్రమంగా మైనింగ్‌కు పాల్పడినట్లు నోటీసులు ఇచ్చారు.
దీనికి ఒఎంసి సపమాధాన మిచ్చింది. నోట ీసులో బళ్ళారి ఐరన్‌ఓర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన భూముల్లోకి చొరబడి అక్రమంగా 2.5 లక్షల టన్నులను మైనింగ్ చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు. దీనికి చాలా తెలివిగా ఒఎంసి సమాధానమిచ్చింది. మైనింగ్ లీజు రద్దు చేస్తారేమోనన్న ఉద్దేశంతో గనుల శాఖనుంచి 2.5లక్షల టన్నుల ఐరన్ ఓర్ సరఫరాకు బిఐఓపి పర్మిట్లు తీసుకుంది. అయితే వివిద కారణాలరీత్యా అక్కడ వారు లారీ లోడు ఐరన్‌ఓర్‌ను కూడా తవ్వుకోలేదని సమాచారం. దీన్ని పసిగట్టిన ఓబుళాపురం మైనింగ్ కార్పొ రేషన్ వారు బిఐఓపి లీజుభూముల్లోకి చొరబడి అక్రమంగా మైనింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నోటీసుకు ఇచ్చిన సమాధానంలోను 2.5 లక్షల టన్నుల ఐరన్ ఓర్ రవాణాకు పర్మిట్లు పొందిన బిఐఒపినే ఆఖనిజాన్ని తవ్వుకుని ఉంటుందని తమకు సంబంధంలేదని సమాధానమివ్వగలిగింది. అయితే మిగి లిన నోటీసులకు వారి వద్ద సమాధానం లేదు. అక్టోబర్ 26న రిజర్వ్ ఫారెస్టులో అక్రమంగా రహదారినిర్మించారని నోటీసు ఇచ్చారు. రహదారిని ఏర్పాటు చేసింది నిజమే. అది కని పించే తప్పుకాబట్టి ఏమని సమాధానం చెప్పుకోవాలో అని ఒఎంసి తలలు పట్టు కుంది. అక్టోబర్ 28న హెచ్.సిద్దాపురం, ఓబుళాపురం గ్రామాలమధ్య గ్రామసరిహద్దులను ఉద్దేశించిఏర్పాటుచేసినరాళ్లను తొలగించారని నోటీసు ఇచ్చారు. దీనికి సమాధానం లేదు. ఆంధ్రప్రదేశ్- కర్నాటక రాష్ట్ర సరిహ ద్దులను చెరిపేసి రహదారి నిర్మించారని నోటీసు ఇచ్చారు. ఇదీ క్షేత్రస్థాయిలో నిరూపితమవుతుంది. నవంబర్ 1వ తేదీన కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్ర మంగా ఇనుప ఖనిజాన్ని రవాణా చేస్తున్నారని నోటీసు ఇచ్చారు. దీనికి ఒకవేళ వారు సమాధానం ఇవ్వగలిగినా మిగిలిన నోటీసులకు ఒఎంసి వద్ద సమాధా నాలు లేవని సమాచారం. ఈ క్రమంలోనే ఎలాగు తప్పులు నిరూపితమవు తాయని భారీగా అపరాధరుసుం విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
|