డా.పి.యశోద, యం.డి (ఆయుర్వేద) కాన్పులు అండ్ స్త్రీల వైద్య నిపుణులు అమీర్‌పేట్,
డాక్టర్‌గారూ! నా వయస్సు 26సంవత్సరాలు. నాకు వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు అయింది. 2సంవత్సరాలు వరకూ సంతానం కలుగలేదు. పిల్లలుకోసం ట్రీట్‌మెంట్ తీసు కున్నాను. నాకు అండం విడుదల సక్రమంగా లేదని చెప్పారు. అండం విడుదలకు టాబ్లెట్సు, ఇంజెక్షన్స్ తీసుకున్నాను. ఒక సంవత్సరం తర్వాత గర్భవతిని అయ్యాను. కానీ రెండవ నెలలోపే అబార్షన్ అయిపోయింది. తర్వాత ఒక సంవత్సరానికి ఇపుడు ట్రీట్‌మెంట్ అవసరం లేకుండానే గర్భం వచ్చింది.
కానీ నాకు ఎందుకో మరలా అబార్షన్ అవుతుందేమోనని భయంగా ఉంది. గర్భం దాల్చిన వెంటనే డాక్టర్‌ని సంప్ర దించి అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాను. ఎటువంటి లోపం లేదని చెప్పారు. నాకు ఇప్పుడు 2వనెల జరుగుతోంది. నాకు అబార్షన్ కలుగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియ జేయండి. ఒకసారి అబార్షన్ దానికదే అయితే మరలా అబార్షన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని మా స్నేహితులు అంటున్నారు. అబార్షన్ కలుగకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఎటువంటి ఆహార పదార్థాలు సేవించాలో తెలియజేయగలరు. బేబీ సక్రమంగా ఎదగడానికి పోషకాంశాలు ఆహారంలో ఎంత శాతం ఉండాలనేది తెలియ జేయండి. మాధురి, మచిలీపట్నం
వివాహానంతరం అనేక ఏళ్లపాటు సంతానం కలు గక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగి, ఔషధాలు సేవించి లేదా కృత్రిమ గర్భధారణ పద్ధతులను అనుసరించి గర్భం దాల్చినప్పటికీ, గర్భిణీ తగిన జాగ్రత్తలు తీసుకోనందున గర్భ విచ్ఛిత్తి వంటివి ఏర్పడి తగిన ఫలితం పొంద లేకపోతున్నారు.
స్త్రీ గర్భం దాల్చడమంటే మరొక ప్రాణిని తన శరీరంలో మోయడమే. కనుక తల్లి శరీరంలో అనేక రకాలైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఆయా మార్పులకనుగుణంగా, తల్లి ఏయే రకాల ఔషధాలను సేవించాలనే విషయాలతో పాటు, గర్భం దాల్చిన సమయం నుంచి కాన్పు జరిగే వరకూ తల్లి సేవించాల్సిన ఆహార పదార్థాలు, వాటి మోతాదు, చేయకూడని పనులు మొదలైన విషయాలన్నీ గర్భిణీ పరిచర్యగా ఆయుర్వేద వైద్యశాస్త్రం వివరించింది.
స్త్రీ ఆరోగ్యంగా ఉంటూ, ఆరోగ్యవంతమైన శిశువుకు సుఖ ప్రసవం ద్వారా జన్మనివ్వడానికి చేపట్టే చర్యలకు గర్భిణీ పరిచర్య అంటారు. దీన్నే యాంటినేటల్ కేర్ అని అంటారు.మీకు అబార్షన్ కలుగడానికి కారణం ఏంటో మీరు తెలియజేయలేదు. సాధారణంగా దానికదే అబార్షన్ అయినపుడు మరలా అబార్షన్ జరగకుండా ముందుగా జాగ్రత్త పడడానికి కొన్ని పరీక్షలు చేయించాలి. కొంతమందిలో గర్భం దాల్చిన ప్రతీసారి అబార్షన్ అయిపోతుంటుంది. దీన్నే హాబిట్యువల్ అబార్షన్ అంటారు. అటువంటపుడు (టిఓఆర్‌హెచ్) టార్చ్‌టెస్ట్, కారియోడైపింగ్ వంటి రక్తపరీక్షలు తప్పని సరిగా చేయించాలి. వీటి ద్వారా అబార్షన్‌కు కారణం చాలా వరకు నిర్ధారణ అవుతుంది.
గర్భిణీ స్త్రీ ఆరోగ్యానికి సంబంధించి, గర్భస్థ శిశువు ఆరోగ్యానికి సంబంధించి, సుఖప్రసవానికి సంబంధించి గర్భం దాల్చడానికి ముందుగానే స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకోవడం మంచిది. దీనివల్ల పండంటి పాపాయికి జన్మనివ్వడమే కాకుండా, ప్రసూతికి ముందు తర్వాత కూడా తల్లి ఆరోగ్యం బాగుంటుంది. శిశువు కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది. గర్భిణీలు చేయకూడని పనులు ్గర్భం ధరించిన తరువాత ఎక్కువగా శారీరక శ్రమ చేయకూడదు. ్అతిగా నడవడం, అతిగా ఆలోచించడం పనికిరాదు. ్పగలు మరీ ఎక్కువ సేపు పడుకోకూడదు. ్సాధ్యమైనంతవరకూ మనస్సును ప్రశాం తంగా, ప్రసన్నంగా ఉంచుకోవాలి. ్గర్భిణీలు గోడలకు తెలుపురంగు ఉన్న గదుల్లో విశ్రమిస్తే మంచిది. ్ఎరుపు లేదా నలుపురంగుల గదులో విశ్ర మిస్తే భయం, కోపం, విసుగు మొదలైన లక్షణాలు పెరుగుతాయి. దాని ప్రభావం గర్భస్థ శిశువుపై పడుతుంది. ్మంచి పుస్తకాలు చదవడం మంచిదే. ్అశ్లీల చిత్రాలు చూడడం, భయం కలిగించే సినిమాలు,టివి సీరియల్స్ వంటివి చూడడం వల్ల అనర్థాలు ఎక్కువగా ఉంటాయి. ్ఎక్కువ ధ్వనితో కూడిన శబ్దాలు వినడం, సంగీతాన్ని పెద్ద ధ్వనితో వినడం చేయరాదు. ఇవి గర్భస్థ శిశువు మానసిక స్థితిపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ.
ఎటువంటి ఆహారం సేవించాలి ్కారం, చేదు, వగరు, ఉప్పు రుచుల కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా సేవించకూడదు. ్ద ఈ చర్యలు ఎదిగే శిశువు మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపెడతాయి. సాధ్యమైనంతవరకూ తీపి, పులుపు ఉండేటట్లుగా ఆహార పదార్థాలను తయారుచేసుకోవాలి. ్గర్భిణీదశలో స్త్రీలు తీసుకునే ఆహారంలోకి పోషకాంశాలే ఇటు తల్లి ఆరోగ్యాన్ని కాపాడుతూ అటు గర్భస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడు తాయి. స్తన్యవృద్ధికి కూడా గర్భిణీ ఆహారమే ఆధారం.
్కొన్నిసార్లు గర్భస్థ పిండం వృద్ధి చెందక పోవడం, అవయవ నిర్మాణ లోపాలతో కూడిన శిశువు జన్మించడం, నెలలు పూర్తిగా నిండక ముందే కాన్పు కావడం వంటి పలు అంశాలకు పోషకాహార లోపమే ప్రధాన కారణమవు తున్నాయి. గర్భం దాల్చిన స్త్రీ సేవించే ఆహారంలో ఒక రోజుకు అవసరమయ్యే పోషకపదార్థాలు 2500 కిలో కేలరీల శక్తి 60గ్రాముల ప్రోటీన్లు 1000 మిల్లీగ్రాముల కాల్షియం 40 మిల్లీగ్రాముల ఐరన్ 6000 ఐ.యు.విటమిన్‌ఎ 400 ఐ.యు.విటమిన్ డి 1.5 మిల్లీగ్రాముల థయమీన్ 1.5మిల్లీగ్రాముల రైబోఫ్లేవిన్ 15 మిల్లీ గ్రాముల నికోటినిక్‌యాసిడ్ 60 మిల్లీ గ్రాముల విటమిన్ సి 2 యు.జి. విటమిన్ బి12 గర్భిణీలు ప్రసవం లోపు 5-6 కిలోల బరువు వరకూ మాత్రమే పెరగాలి. శిశువు 2.5 నుంచి 3కేజీల వరకూ బరువు ఉండాలి. ఆయుర్వేదం ప్రకారం ఒక నెల నుంచి డెలివరీ వరకూ ప్రతినెలలో మామూలుగా తీసుకునే ఆహార పదా ర్థాలను తగ్గించి పాలు, వెన్న, నెయ్యి, పెరుగు అధికంగా చేర్చి వైద్య సలహా ప్రకారం వాడినట్లైతే శిశువు ఆరోగ్యం చక్కగా ఉంటుంది.