|
ప్రకాష్‌రాజ్, భూమిక ప్రధాన పాత్రల్లో టేకుల కృపాకర్‌రెడ్డి దర్శకత్వంలో ఆమోద్ ఎంటర్‌టైన ్‌మెంట్స్ పతాకంపై నిర్మి స్తున్న చిత్రం రెండో షెడ్యూల్ రెండో వారంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పరుచూరి వెంకటే శ్వరరావ్ఞ మాట్లాడుతూ ' భార్య, భర్తల మధ్య జరిగే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది.
భార్య, భర్త మధ్య కొత్త కోణాన్ని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించాం. చదువ్ఞకున్న అమ్మాయి కథే ఈ చిత్రం అని అన్నారు. దర్శకుడు టి.కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ 'ఒక అమ్మాయి పెళ్ళి తర్వాతి జీవితంలో ఎదుర్కొనే సంఘటనల సమాహారమే ఈ చిత్రకథ. ఈ చిత్రం రెండో షెడ్యూల్ రెండో వారంలో ప్రారంభించి సినిమా పూర్తయ్యేవరకు కొనసాగిస్తాం. డిసెంబర్ నాటికి సినిమాను పూర్తిచేసి చిత్రాన్ని జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు. పరుచూరి వెంకటేశ్వరరావ్ఞ, వైజాగ్ ప్రసాద్, శివపార్వతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే: పరుచూరి బ్రదర్స్, సంగీతం: చిన్నా, కెమెరా: కాండ్రు పూర. నిర్మాత: అమోద్ ఎంటర ్‌టైన్‌మెంట్స్, కథ, దర్శకత్వం: టేకుల కృపాకర్ రెడ్డి.
|