|
కృష్ణభగవాన్, బాబా, సోని ప్రధాన పాత్రలలో శ్రీ వసంత పిక్చర్స్ పతాకంపై వేణుగోపాల్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 10 నుండి వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ 'కామెడీతో పాటు చక్కటి ఫీలున్న కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తయింది. డిసెంబర్‌లో సినిమా పూర్తవ్ఞతుంది అని అన్నారు. కృష్ణభగవాన్, జాకీ, బాబా, సోని ఎమ్మెస్ నారాయణ, రంగనాథ్, రామిరెడ్డి, అన్నపూర్ణ, తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం, దర్శకత్వం, నిర్మాత: జి.వేణుగోపాల్.
|