మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
మట్టికాదు మెరిపించే మాణిక్యం
గురు వారం, నవంబర్ 05, 2009 , 12:17 [IST]

cheliఒకప్పుడు పిల్లలు మట్టిలో ఆడుతుంటే తల్లులు వారించేవారు కాదు. అప్పుడు వారికి తెలుసేమో పిల్లల ముఖవర్ఛస్సును పెంచే సాధనం అదే అని.  ఇప్పుడు మట్టిలో కాలు పెట్టనీకుండా పెంచిన తమ పిల్లలు టీనేజ్‌లో ఎన్ని సౌందర్య సాధనాలను ఉపయోగి స్తున్నారో చూడటమే తల్లుల పాత్ర అయ్యింది. మట్టిస్నానం మంచిదని   మహాత్మా గాంధీ సెలవిచ్చారు. ప్రాచీన ఆయుర్వేదంలోనూ మట్టి పాత్ర మహత్తర మైనదని చెప్పబడింది. మరి ఆ మట్టిని మనం ఈ న్యూక్లియర్‌ యుగంలో అందానికై   ఎలా వాడుకోవాలో చూద్దాం.

రాళ్లనుంచి రాలిన మట్టి సౌందర్య  పోషకాల్లో వాడేందుకు శ్రేష్ఠమైనది. పగుళ్లకు హీలింగ్‌ ఏజెంట్‌గా ఇది పనిచేస్తుంది. కాలిన, తెగిన గాయాలను మాన్పేందుకు ప్రయోజనకారి. ఇందులో ఉన్న ఎన్నో విలువలు చర్మానికి యవ్వనాన్ని ప్రసాదిస్తాయి. ముల్తానా మట్టి, మ్యాజిక్‌ మడ్‌ అని కూడా ముద్దుగా పిలుచుకునే దీనిలో అల్యూ మినియమ్‌, సిలికాన్‌, ఐరెన్‌ ఆక్సిడెంట్‌, లైమ్‌, మెగ్నీషియమ్‌లతో పాటు నీటిని కలిగి ఉంటుంది. ఇంకా ఎన్నో ఇతర పోషక విలు వలను కూడా కలిగి వుంటుందీ మట్టి. ముడతలు, మచ్చలు, మొటిమలను నివారించే గొప్ప సాధనం ముల్తానా మట్టి. నేటితరం అమ్మాయిలందరికీ ఇది అత్యంత ఇష్టమైన సౌందర్యసాధనం. ఎవరికీ తెలియని విషయం ఏమంటే ముఖవర్ఛస్సు కోసం వాడే ఫేషి యల్స్‌, బ్లీచింగ్‌, మేకప్‌లన్నింటిలో ఈ మ్యాజిక్‌ మట్టి పాత్ర ఉంటుంది. ముఖాన్ని కోమలంగా, కాంతులీనుతూ చూసు కోవాలంటే ఈ క్రింది ఫేషియల్‌ క్రమం తప్పకుండా 3 నెలలు ప్రయత్నించండి.
3 చెంచాల ముల్తానా మట్టి
1 చెంచా తేనె
4 చెంచా పాలు
1 చెంచా రోజ్‌ వాటర్‌

cheliవిధానం
పాలలో ముల్తానా మట్టిని కలిపి బాగా పేస్ట్‌లా చేయాలి. అందులో తేనె, రోజ్‌వాటర్‌ మిక్స్‌ చేసి జారుగా చేయాలి. మాస్క్‌ వేసుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఒక్క విషయం మాస్క్‌ ఉన్నంత సేపూ మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే మాట్లాడం వల్ల మాస్క్‌పై పగుళ్లు ఏర్పడతాయి.

ఉపయోగాలెన్నో
్ముల్తానా మట్టిని షేవింగ్‌ సోప్‌గా కూడా ఉపయోగించవచ్చు.
్ప్రాకృతిక సబ్బుగా దీన్ని వర్ణించవచ్చు. ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఇవ్వని సోప్‌ ఇది.
్స్క్రబ్బర్‌గా కూడా దీన్ని వాడుకోవచ్చు. కొద్దిగా తేనె కలిపి వాడడం మరింత ప్రయోజనాన్ని పొందవచ్చు.
్చర్మంపై ఏర్పడే ముడతలు,మచ్చలు, మొటిమలు మొదలైన వాటికి ముల్తానా మట్టి ప్రాకృతిక మందు.  
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 రాధాతత్త్వము
 స్నేహితులంటే ఎలా ఉండాలి?
 సమానవాదమే మనవాదం
 మెప్పించే మాటతీరు
 పిన్నవయసు సిఇఒ
 తల్లిపాల బ్యాంకు మరొకటి
 సీ'రియల్'‌లో వాస్తవాలెక్కడ?
 రాఖీ వెనుక రాచగాధలు
 పాక్‌ ప్రధాని లత అభిమాని
 వీణా వాదనలో ప్రవీణ
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com