|
మీరాజాస్మిన్ కథానాయికగా అమర్‌నాథన్ మూవీస్ పతాకంపై శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వంలో పి.అమర్‌నాథ్ రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ వేములపల్లి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ఇదొక హర్రర్ చిత్రం. మీరాజాస్మిన్ ఈ పాత్రకు చక్కగా సరిపోతుంది. ఈ చిత్రంలో రాజీవ్‌మోహన్ ఓ ముఖ్యపాత్రని చేస్తున్నాడు. అన్ని కమర్షియల్ అంశాల మేళవింపుతో విభిన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ 'ఈ నెల 11 నుంచి డిసెంబర్ 15 వరకు ఆర్‌ఎఫ్‌సిలో తొలి షెడ్యూల్ చేస్తాం. ఆ తర్వాత డిసెంబర్ చివరి వారం నుంచి చెన్నైలో జరిగే షెడ్యూల్‌తో చిత్రం పూర్తవ్ఞతుంది. భారీ వ్యయంతో గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నాం. ఈ చిత్రానికి 'మోక్ష అనే పేరు పరిశీలనలో వ్ఞంది అన్నారు. నాజర్, రాహుల్‌దేవ్, రాజ్యలక్ష్మీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్.పి, సమర్పణ: పి. హిమబిందు, నిర్మాత: అమర్‌నాథ్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ వేములపల్లి.
|