| ప్రైస్ వాటర్‌హౌస్‌కు క్లీన్‌చిట్ |
| గురు వారం, నవంబర్ 05, 2009 , 11:55 [IST] |
 |
|
న్యూఢిల్లీ, నవంబర్ 4: సత్యం కంప్యూటర్స్ ఆడిటింగ్ సంస్థ ప్రైస్ వాటర్ హౌస్ క్రూప్స్(పిడబ్ల్యూసి) కు వ్యతిరేకంగా తీసుకోవాలని అనుకున్న క్రమశిక్షాణా చర్యలను ఉపసంహరించు కున్నట్లు అకౌంట్స్ రెగ్యులేటరీ సంస్థ ఛార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐపిఏఐ) నిర్ణయించింది. సత్యం కుంభకోణంలో ఈ సంస్థకు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. తమపై చర్యలు తీసుకోవ డానికి నిర్ధేశించిన డిసిప్లినరీ ప్రొసిడింగ్స్‌ను నిలిపి వేయాలని పిడబ్ల్యూసి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అందు వల్ల ప్రభుత్వ చర్య చట్టవ్యతిరేకమైందని పిడబ్ల్యూసి కోర్టుకు విన్నవించింది. పిడబ్ల్యూసికి దేశంలో ఆరు ఫ్రాంఛైజీలు ఉన్నాయని, వీటికి ఒకదానికి ఒకటి సంబంధం లేదని తెలిపింది. అందు వల్ల ఢిల్లీలోని పిడబ్ల్యూసి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం కుదరదని, దీన్ని వెంటనే నిలిపి వేయాలని కోర్టును కోరింది. దీనిపై వాదనలు విన్న జస్టీస్ సంజీవ్ ఖన్నా పిడబ్ల్యూసిపై క్రమశిక్షణా చర్యలను నిలిపి వేయాలని ఆదేశించారు.
|
|
|
|
|
|
|