మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
పాకిస్థాన్‌ ఘన విజయం
గురు వారం, నవంబర్ 05, 2009 , 11:46 [IST]

pakistan teamఅబుదాబీ, నవంబర్‌ 4 : అబుదాబీలో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్‌ ఘనవిజయం నమోదు చేసింది. తటస్ట వేదికలో న్యూజిలాండ్‌తో ఆరంభమైన వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 287 పరుగుల భారీస్కోరు సాధించి, ప్రత్యర్ధిని 149 పరుగులకే కట్టడి చేసి 138 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. భధ్రతా కారణాలతో గత ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సిన పర్యటనను రద్దు చేసుకున్న న్యూజిలాండ్‌ తటస్థ వేదిక అయిన అబుదాబీలో సిరీస్‌ ఆడటానికి సమ్మతించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు మొహం వాచిపోయి ఉన్న పాకిస్థాన్‌ తొలి వన్డేల్లో చెలరేగి ఆడి ఘనవిజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌కు పరుగుల ఖాతా తెరవకుండానే ఎదురుదెబ్బ తగిలింది.

షేన్‌ బాండ్‌ బౌలింగ్‌లో ఒపెనర్‌ సల్మాన్‌భట్‌ 0 స్కోరు వద్దే డకౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. ఆ వెంటనే కెప్టెన్‌ యూనిస్‌ఖాన్‌ కూడా బాండ్‌ బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండా క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. 0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్‌ను ఓపెనర్‌ ఖలీద్‌లతీఫ్‌తో కలిసి మహ్మద్‌యూసఫ్‌ ఆదుకున్నాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు కలసి 57పరుగుల భాగ స్వామ్యం నెలకొల్పిన అనంతరం యూసఫ్‌ (49 బంతుల్లో 30) వెనుదిరిగాడు. ఆ వెంటనే ఉమర్‌అక్మల్‌ (9) వికెట్‌ను కోల్పోయిన పాకిస్థాన్‌కు ఆల్‌రౌండర్‌ షాహిద్‌అఫ్రీది అపద్భాంధువుడయ్యాడు. వేగంగా ఆడిన అఫ్రిదీ అయిదో వికెట్‌కు లతీఫ్‌తో కలిసి 101 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఓరమ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 50 బంతులు ఎదుర్కొన్న అతను 4ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేసి పాక్‌ భారీస్కోరుకు తోడ్పడ్డాడు.

  నిలకడగా ఆడి పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ను పటిష్ట స్థితికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన లతీఫ్‌ 112 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతో 64 పరుగులు చేసి 41.1  ఓవర్‌లో ఆరో వికెట్‌గా పెవిలియన్‌కు చేరగా తదనంతరం కమ్రాన్‌అక్మల్‌ సుడిగాలి వేగంతో బ్యాటింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు. చివర్లో అబ్ధుల్‌రజాక్‌ (26, 20 బంతుల్లో ఒక ఫోర్‌, 2 సిక్స్‌లు) కాసేపు బ్యాట్‌కు ధాటిగా పనిచెప్పగా, ఉమర్‌గుల్‌, మహ్మద్‌ఆమీర్‌లు డకౌట్‌ అయ్యారు. కమ్రాన్‌అక్మల్‌ 43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 పరుగులు చేసి అజేయంగా నిలువగా, సయీద్‌అజ్మల్‌ 0 పరుగులతో నాటౌట్‌గా మిగలడంతో పాకిస్థాన్‌ 50 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు సాధించింది. కివీస్‌ బౌలర్లలో షేన్‌బాండ్‌, వెటోరీలు రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌తో పాకిస్థాన్‌ బౌలర్లు ఆడుకున్నారు. ఉమర్‌గుల్‌ (2/24), అబ్ధుల్‌రజాక్‌ (2/38), షాహిద్‌అఫ్రీది (2/ 46), సయీద్‌అజ్మల్‌ (2/18), మహ్మద్‌అమీర్‌ (1/15)తో రాణించడంతో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 39.2ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ రెడ్మాండ్‌ (91 బంతుల్లో 6 ఫోర్లలో 52), వెటోరీ (41 బంతుల్లో ఒక ఫోర్‌తో 38), మెక్‌కలామ్‌ (27 బంతులో4 ఫోర్లతో 21) మాత్రమే జట్టులో రెండం కెల స్కోరు చేయగలిగారు. ఆల్‌ రౌండ్‌ అఫ్రీది మ్యాన్‌ ఇఫ్‌ దిమ్యాచ్‌గా నిలిచాడు.

స్కోరుబోర్డు

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: సల్మాన్‌భట్‌ సి మెక్‌కల్లమ్‌ బి బాండ్‌ 0, ఖాలీద్‌ లతీఫ్‌ బి వెటోరీ 64, యూనిస్‌ఖాన్‌ సి మెక్‌కల్లమ్‌ బి బాండ్‌ 0, మహ్మద్‌ యూసుఫ్‌ రనౌట్‌ 30, ఉమర్‌ అక్మల్‌ బి వెటోరీ 9, షాహిద్‌ అఫ్రిదీ సి బట్లర్‌ బి ఒరమ్‌ 70, కమ్‌రాన్‌ అక్మల్‌ నాటౌట్‌ 67, అబ్దుర్‌ రజాక్‌ సి స్టైరిస్‌ బి బట్లర్‌ 26, ఉమర్‌గుల్‌ 0, మహ్మద్‌ ఆమేర్‌ 0, సయీద్‌ అజ్మల్‌ నాటౌట్‌,

అదనం: 21, మొత్తం: 287-9 (50 ఒవర్లు).
వికెట్ల పతనం: 1-0, 2-0, 3-57, 4-75, 5- 176, 6-184, 7-270, 8-271, 9-277.
బౌలింగ్‌: బాండ్‌10-2-61-2, సౌథీ10-2- 54- 1, బట్లర్‌ 7-0-54-1, ఒరమ్‌ 10-0- 47-1,  వెటోరీ 10-1-34-2, మెక్‌కల్లమ్‌ 3-0-29-0.

న్యూజిలాండ్‌ :
బ్రాండన్‌ మెక్‌కలామ్‌ బి ఉమర్‌గుల్‌ 21, రెడ్మాండ్‌ ఎల్‌బిడబ్ల్యు సయీద్‌ అజ్మాల్‌ 52, గుప్తిల్‌ బి ఉమర్‌గుల్‌ 4, టేలర్‌ సి కమ్రాన్‌అక్మల్‌ బి మహ్మద్‌అమీర్‌ 0, స్ట్రిస్‌ సి (సబ్‌) ఇమ్రాన్‌ఫారత్‌ బి అబ్ధుల్‌రజాక్‌ 5, వెటోరీ బి షాహిద్‌అఫ్రీది 38, ఓరమ్‌ బి అబ్ధుల్‌రజాక్‌ 9, ఎన్‌.ఎల్‌.మెక్‌కలామ్‌ ఎల్‌బిడబ్ల్యు అఫ్రీది 0, బట్లర్‌ రనౌట్‌ 4, షేన్‌బాండ్‌ నాటౌట్‌ 4, సౌథీ ఎల్‌బిడబ్ల్యు సయీద్‌అజ్మాల్‌ 1, అదనం - 11,
మొత్తం (39.2 ఓవర్లలో) - 149 ఆలౌట్‌
వికెట్ల పతనం: 1-30 (బి.మెక్‌కలామ్‌, 7.4), 2-34 (గుప్తిల్‌, 9.2), 3-35 (టేలర్‌, 10.2), 4-50 (స్ట్రిస్‌, 15.1), 5-119 (రెడ్మాండ్‌, 29.3), 6-139 (వెటోరీ, 34.5), 7-139 (ఎన్‌ఎల్‌ మెక్‌కలామ్‌, 34.6), 8-139 (ఓరమ్‌, 35.3), 9-144 (బట్లర్‌, 37.2), 10-149 (సౌథీ, 39.2)
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 ఒత్తిడిలో పాక్‌ క్రికెట్‌ బోర్డు
 ఆటగాళ్ళ గదులనుంచి పెద్దఎత్తున..
 ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
 క్వార్టర్స్‌లో సైనా
 ఫైనల్‌లో భారత్‌
 ప్రపంచ చాంపియన్‌షిప్‌..
 లంకపై ప్రతీకారానికి సిద్ధమైన..
 వీరూకు శ్రీలంక బోర్డు క్షమాపణ
 గెలుపు దక్కింది
 భారత్‌కు గెలుపు కావాలి
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com