ఖమ్మం, నవంబర్ 4 ప్రభాతవార్త క్రీడాప్రతినిధి : ఈనెల 6,7 తేదీల్లో దోమల్‌గూడ, హైద్రాబాద్ వ్యాయామవిద్య కళాశాలలో అండర్-17 ఖోఖో బాలబాలికల రాష్ట్ర జట్ల ఎంపికలు నిర్వహించను న్నట్లు స్కూల్‌గేమ్స్‌రాష్ట్ర కార్యదర్శి కె.రామిరెడ్డి తెలిపారు. అదేవిధంగా 9 నుండి గుంటూర్‌లో అండర్-17 హ్యాండ్‌బాల్ రాష్ట్రజట్ల ఎంపికలు నిర్వహించనున్న సమాచారాన్ని ఇప్పటికే పలు జిల్లాల కార్యదర్శులకు అందజేసినట్లు సంబంధిత క్రీడాంశాల్లో ఎంపికలకు అనుగుణంగా క్రీడాకారులను పంపాలని తెలిపారు. 10 నుంచి వనపర్తిలో రాష్ట్ర స్థాయి హాకీపోటీలు అండర్-17 బాలబాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ఈనెల 10న మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో నిర్వహించనున్నట్లు రామిరెడ్డి తెలి పారు. 3 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణతో పాటు పోటీల్లో ప్రతిభకనపర్చిన చిన్నారులను రాష్ట్ర జట్టుకు ఎంపికచేయనున్నట్లు తెలిపారు.