| 'క్రీడల అభివద్ధికి పైకా దోహదం' |
| గురు వారం, నవంబర్ 05, 2009 , 11:37 [IST] |
 |
|
సంగారెడ్డి, నవంబర్ 4,ప్రభాతవార్త ప్రతినిధి : యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే ప్రభుత్వం పైకా ద్వారా క్రీడలను నిర్వహిస్తోందని జిల్లా క్రీడాభివద్ది అధికారి అజ§్‌ుకుమార్ తెలిపా రు. ప్రభుత్వం ప్రారంభించిన పంచాయతీ యువ క్రీడా ఔర్ ఖేల్ అభియాన్ స్కీం (పైకా) అవగాహన సదస్సు బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యువతకు క్రీడా మైదానం, సామగ్రి సమకూర్చడానికి నిధులను పైకా గుర్తించిన 92 గ్రామాలు, 4 మండలాల్లో ఆయా పాఠశాలల హెడ్‌మాస్టర్ల ద్వారా వినియోగిం చడం, యువతను అథ్లెటిక్స్ టైకోండో, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, ఫుట్‌బాల్, బాక్సింగ్, ఖోఖో, హాకీ, కబడ్డీలో రాణించేలా చేయడమే ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.
డిఇఓ జి.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయిందని, దీన్ని ప్రభుత్వం గుర్తించి పైకా ప్రారంభించడం వల్ల ఎంతో మేలు జరుగు తుందన్నారు. క్రీడల ద్వారా మానసిక సమతుల్య త, నాయకత్వ లక్షణాలు, వ్యక్తుల మధ్య పోటీ వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. పైకాను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత ప్రధానోపా ధ్యాయులపైనే ఉందని అన్నారు. అడిషనల్ ఎస్పీ బుచ్చిరాంరెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పైకాను అమలు పర్చడంలో కమిటీల ఏర్పాట్లలో గ్రామ స్థాయిలో సబ్ ఇన్స్‌పెక్టర్‌ను సభ్యులుగా ఉన్నారని అన్నారు. దీన్ని మండల స్థాయిలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌ను భాగస్వామిని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.
గ్రామ స్థాయిలో అవగాహన పెంచడానికి సిద్దిపేట, తూప్రాన్, మెదక్‌లలో పైకాను చిత్తశుద్దితో అమలు చేయాల న్నారు. సంగారెడ్డి ఆర్డీఓ రామచంద్రరావు మాట్లా డుతూ ఆరోగ్యమే మహాబాగ్యమని, క్రీడల ద్వారా ఆరోగ్యం పొందవచ్చని అన్నారు. చైనా ఒలింపి క్స్‌లో ప్రథమంగా నిలిచిందని మనం కూడా ఆ దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. పైకా కింద మొదటి విడతగా ఒకలక్ష రూపాయలను ఆట మైదానం అభివద్ధికి, వివిధ సామగ్రికి నిధులు కేటాయించినట్లు ఆయన చెప్పారు. క్రీడా నైపుణ్యం ద్వారా మనిషి పూర్తి స్థాయిలో అభివద్ధి చెందుతారని తెలిపారు.
స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ పైకా5 సంవ త్సరాల కార్యక్రమమని, దాన్ని గ్రామ స్థాయి నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. పైకా గుర్తించిన పాఠశాలలు గల గ్రామాలకు లక్ష రూపాయలు, మండలానికి రూ.ఐదు లక్షల నిధులు కేటాయిం చినట్లు వెల్లడించారు. యూనిసెఫ్ ప్రాజెక్టు డైరెక్టర్‌్ సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలో యువతకు శిక్షణ ఇవ్వడంలో పైకా యూనిసెఫ్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ పైకా మొదటిసారిగా అమలవుతుం దని, ఇది ఒక అద్బుత అవకాశమని అన్నారు. సమావేశంలో జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధా నోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
|
|
|
|
|
|
|