మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
తుపాకీ నీడన గిరిజన ప్రాంతాల అభివృద్ధి శూన్యం
గురు వారం, నవంబర్ 05, 2009 , 11:16 [IST]

manmohan singhఅటవీ భూములపై చట్టబద్ధమైన హక్కు; ప్రధాని
న్యూఢిల్లీ, నవంబర్‌ 4, ప్రభాతవార్త:
గిరిజన ప్రాం తాలు తుపాకీ నీడలో ఉన్నందునే అక్కడ ఆర్థి కంగా అభివృద్ధికి నోచుకోకుండా ప్రమాదపరిస్థి తులు ఎదుర్కొంటుందని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మావోయిస్టులకు స్పష్టమైన సందేశాన్ని అందించారు.
అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి జీవిస్తున్న గిరి జనులకు ఆ భూములపై చట్టబద్ధమైన హక్కును కల్పించడంలో రాష్ట్రాలు జాప్యం చేయడం తగ దని ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ సూచిం చా రు. తద్వారా మన జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతూకాన్ని, విలువైన వన్య సంపదను పరి రక్షించుకోవచ్చని ఆయన చెప్పారు. బుధవారం ఢిల్లీలో జరిగిన 2006 అటవీ హక్కుల చట్టం తోపాటు గిరిజన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా ల అమలుపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సాంఘి క సంక్షేమ, అటవీశాఖ మంత్రుల సమావేశాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించారు.

jathiyaఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గిరిజన ప్రాం తాల అభివృద్ధి, గిరిజనుల ఆర్ధిక, సామాజిక స్థితి గతుల మెరుగుదలను సమ్మిళితవృద్ధికి ముడి పెట్టాలనేది ప్రభుత్వ అభిమతమని చెప్పారు. సమాజంలో అవకాశాలకు, అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ వర్గాలకు చట్టబద్ధమైన హక్కులు కల్పిం చలేకపోతే సమానాభివృద్ధికి ఆస్కారం ఉండదని అన్నారు. గిరిజన తెగలకు తమ భవిష్యత్‌ను తామే నిర్ణయించుకోగలిగే సాధికారత  అవసర మని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. గిరిజ నులు ఆత్మగౌరవంతో కూడిన జీవనోపాధి, భద్ర త కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఆయన స్పష్టం చేశారు.

దేశ ప్రజల్లో వారు ఒక భాగమేనన్న విషయాన్ని మరిచిపో కూడదని చెప్పారు. 2006 అటవీ హక్కుల చట్టం ఈ దిశలో మైలు రాయిగా పేర్కొనదగి నదని ఆయన అన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రాలు సమర్ధవంతంగా అమలు చేయాలని ఆయన కోరా రు. నిర్దిష్ట కాలవ్యవధిలో హక్కు పత్రాలను త్వరి తగతిన పంపిణి చేసేలా రాష్ట్రాలు చర్యలు తీసు కోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రు లతోపాటు సాంఘిక, గిరిజన, అటవీశాఖ మం త్రులు, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కాం తిలాల్‌ భూరియా, సహాయ మంత్రి డాక్టర్‌ తు షార్‌ ఎ చౌధురీ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 వైశ్యులంతా ఓటుహక్కును..
 కొందరు కాంగ్రెస్‌సీనియర్ల..
 తారలు దిగివచ్చిన వేళ...
 కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
 పోలీసు వ్యవస్థలో మార్పులు రావాలి:..
 జగన్‌ ఓదార్పుపై ప్రధాని పిలుపుతో..
 కాశ్మీర్‌లో అన్నివర్గాలతో..
 ఇసి కొత్త కమిషనర్‌గా ఎపి కేడర్‌..
 చట్టసభల్లో రిజర్వేషన్లకోసం..
 అక్రమమైనింగ్‌పై లోక్‌సభలో టిడిపి..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com