న్యూఢిల్లీ, నవంబర్ 4 : తాలిబాన్, అల్ ఖైదా మిలిటెంట్లు పుంజుకోవడం వల్ల భారత దేశానికి సవాల్ ఎదురవుతున్నదని విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు అన్నారు. బుధవారం ఏర్పాటైన దక్షిణాసియా-2020 సదస్సులో ఆమె ప్రసంగిం చారు. ఉగ్రవాదాన్ని అణిచివేయవలసిం దిగా ప్రపంచదేశాలు పాకిస్థాన్‌పై ఒత్తిడి తేవాలని ఆమె కోరారు. ప్రాంతీయ భద్రతకు ఉగ్రవాదం సవాల్ వంటిదని ఆమె అన్నారు. తాలిబాన్,అల్ ఖైదా మిలిటెంట్లు పుంజుకోవడం వల్ల భారత దేశానికి అసలైన సవాళ్ళు ఎదురవుతున్నాయని ఆమె అన్నారు. అఫ్ఘానిస్థాన్‌కు ప్రపంచదేశాలు సహా యాన్ని అందించవలసిన అవసరం ఉందని ఆమె చెప్పారు. అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగినట్లు ఆమె తెలిపారు. ఉగ్రవాదం అణిచి వేతకు ప్రపంచదేశాలు పాకిస్థాన్‌పై ఒత్తిడి తేవాలని ఆమె కోరారు.
ఉగ్రవాదాన్ని అణచడంలో విఫల మైన పక్షంలో ఈ ప్రాంతంలో హింసాకాండ పెరిగి పోతుందని ఆమె చెప్పారు. దక్షిణ వజిరిస్థాన్‌లో తాలిబాన్ల నుంచి భారతదేశంలో తయారైన ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నట్లు పాకిస్థాన్ చేసిన ప్రకటన నిరాధారమైనదని ఆమె అన్నారు. పొరుగుదేశంలో ఈమధ్య జరిగిన హింసాత్మక సంఘటనల గురించి ప్రస్తావిస్తూ తమను ప్రోత్స హించే వారిని కూడా ఉగ్రవాదశక్తులు వదిలిపెట్టవని వాటి వల్ల నిరూపించబడినట్లు ఆమె చెప్పారు. అర్థవంతమైన చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు భారత్, పాకిస్థాన్‌కు తెలిపిందని ఆమె అన్నారు.
ఉగ్రవాద శక్తులను పాకిస్థాన్ అణిచివేస్తేనే ఆ దేశంతో చర్చలు సాధ్యమవుతాయని ఆమె తెలిపారు. భారత వ్యతి రేక కార్యకలాపాలను పాక్‌అనుమతించరాదని ఆమె కోరారు. పాకిస్థాన్‌లో శాంతి సుస్థిరతలు నెలకొనా లని తాము కోరుతున్నామనీ, ఆ దిశగానే తాము పనిచేస్తామని ఆమె తెలిపారు. ఇతర దక్షిణాసియా దేశాలతో భారత్‌కు గల సంబంధాల గురించి వివరిస్తూ పొరుగు దేశాల అభివద్ధికి సహాయాన్ని అందజేయడంలో భారతదేశం ఎప్పుడూ ముందు ఉంటుందని ఆమె చెప్పారు.