| బీహార్ బిజెపిలో ముసలం |
| గురు వారం, నవంబర్ 05, 2009 , 11:05 [IST] |
 |
|
పాట్నా,నవంబర్ 4 : కర్ణాటక బిజెపిలో అసమ్మతి కార్యకలాపాలు ఊపందుకొన్న తరువాత బీహార్ లోని కొంతమంది బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉపముఖ్యమంత్రి ఎస్.కె.మోడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కిసాన్ క్రెడిట్ కార్డు పధకం పరిధిలోకి కౌలుదారులను కూడా తీసుకొని వస్తున్నట్లు మోడీ చేసిన ప్రకటనను వారు వ్యతిరేకించారు.
కౌలు దారులకు కిసాన్ క్రెడిట్ కార్డు పధకాన్ని వర్తింపజేయడం వల్ల తమ పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయని బిజెపి సీనియర్ నాయకుడు గిరిరాజ్ సింగ్ అన్నారు. బీహార్‌లో గత సెప్టెంబర్ లో 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి ఎన్‌డిఎ కోలుకోలేదని బిజెపి రాజ్యసభ సభ్యుడు సి.పి.ఠాకూర్ అన్నారు. ప్రస్తుతం బిజెపిలో ఈ సంక్షోభం ఏర్పడిందని ఆయన చెప్పారు. మోడీని రాజీనామా చేయవల సిందిగా డిమాండ్ చేయాలని మాజీ బీహార్ ఆరోగ్యశాఖ మంత్రి సి.ఎం.రా§్‌ు నివాసభవనంలో మంగళవారం సాయంత్రం జరిపిన సమావేశంలో కొంతమంది ఎమ్మెల్యేలు,ఎంపీలు నిర్ణయించారు. మోడీ నాయకత్వం బలహీన పడిందనీ ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని బిజెపి సీనియర్ ఎమ్మెల్యే రామేశ్వర్ చౌదరీ కోరారు.
|
|
|
|
|
|
|