మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం మార్చి   12th 2010 - 7:04 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
పిఆర్‌పితో పొత్తు చర్చలు
గురు వారం, నవంబర్ 05, 2009 , 10:53 [IST]

jathiyaసోనియాకు తెలుసుపాల్వాయి గోవర్థనరెడ్డి
న్యూఢిల్లీ, నవంబరు4, ప్రభాతవార్త :
పిసిసి చీఫ్‌ డి.శ్రీనివాస్‌  ప్రజారాజ్యంతో చేసిన పొత్తు చర్చలు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి తెలుసని సీనియర్‌ నేత పాల్వాయి గోవర్థన్‌రెడ్డి చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన సోనియాగాంధీని కలిసి కొద్దిసేపు రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం సోనియాకు తెలుసన్నారు. పిఆర్‌పితో పొత్తు కోసం జరిగిన చర్చల్ని ఎవరెవరు వ్యతిరే కించారో కూడా సోనియా తనకు తెలుసన్నారని పాల్వాయి చెప్పారు.

sonia గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు సంబంధించి కొన్నివివరాలనుకూడా సోనియా అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఎంతో సమర్థుడైన రోశయ్యను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమిం చినందుకు, మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపుపై  సోనియాను అభినందించినట్లు చెప్పారు. రోశయ్య సమర్థవంతగా పనిచేస్తున్నట్లు అధినేత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ చక్కటిపరిపాలనను అందిస్తుందన్నారు. జగన్‌ పేరు చెప్పుకుని కొంతమంది గొడవచేస్తున్నారే తప్ప రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు బాగున్నాయన్నారు. పిఆర్‌పితో పొత్తు వల్ల కాంగ్రెస్‌కు మంచి జరుగు తుందని సూచించానన్నారు.

మొయిలీతో కాంగ్రెస్‌ సీనియర్ల భేటీ
రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రాజకీయ పరిస్థి తుల్ని చక్కదిద్దాలని, జగన్‌కు అనుకూలంగా  క్రమ శిక్షణను ఉల్లంఘిస్తున్న వారికి కళ్లెం వేయాలని కాం గ్రెస్‌ సీనియర్‌ నేతలు  జెసి  దివాకర్‌రెడ్డి, ఎఆర్‌ ఆమోస్‌, పాల్వాయిగోవర్థన్‌రెడ్డి కాంగ్రెస్‌రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌ఛార్జ్‌ మొయిలీని కోరారు. బుధవారం న్యూఢిల్లీలో సీనియర్లు మొయిలీని కలిశారు. జగన్‌ వర్గం చేస్తున్న హడావిడిని నియంత్రించాలని కోరి నట్లు సమాచారం. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పిఆర్‌పితో పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలవగలుగుతుందనే అభిప్రాయాన్ని వెల్లడిం చారు. కాంగ్రెస్‌ ఒంటరిగాపోతే నష్టం జరుగుతుం దనే విషయంమర్చిపోవద్దన్నారు.

జగన్‌వర్గం నూరి పోసే అవాస్తవాలనునమ్మవద్దనిమొయిలీని కోరారు.  రోశయ్యనుబలహీనపర్చేందుకుచేస్తున్న ప్రయత్నాలే తప్ప పార్టీకిలాభంచేకూరే విధంగా జగన్‌ వర్గం పని చేయటం లేదని విన్నవించారు. గ్రేటర్‌ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఎంతోప్రతిష్టాత్మకమైనవని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో సాధించే విజయం 2014 అసెంబ్లీ ఎన్నికలపైకూడా ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షాలు పుంజుకోకుండా ఉండాలంటే చిరు చరిష్మాను ఉపయోగించుకోవాలన్నారు. దీనిపై మొయిలీ స్పం దిస్తూ ంండు రోజుల్లో పరిస్థితులన్నీ చక్కదిద్దుతా మని తమకు చెప్పారని ఆ నేతలు తెలిపారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 అందరితో సంప్రదించాకే
 మహిళా బిల్లుపై బిజెపిలో అసమ్మతి
 ఏడుగురు రాజ్యసభ సభ్యులపై..
 18న శ్రీకృష్ణ కమిటీ సమావేశం
 17నుంచి సంఘీ రథయాత్ర మళ్లీ షురూ
 అలరించిన తెలంగాణ జాతర
 తెలుగు, కన్నడ భాషల ప్రాచీన హోదా..
 ఒఎంసి కేసులో సర్కారుకు చుక్కెదురు
 
 
ముఖ్య వార్తలు
  ఐటి, పరిశ్రమల భద్రతకు..
  'ఇంటర్‌'లో 60 వేల మంది డుమ్మా
  మైనింగ్‌ మాఫియాకు సర్కార్‌ దన్ను
  ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం..
  15 లేదా 16న లోక్‌సభలో మహిళా బిల్లు
  సొంత పార్టీ నుంచి సూకీ బహిష్కరణ
  ఒఎన్‌జిసి, ఐఒసి ఐపిఒలు ఉండవు
  కొత్త హంగులతో మాక్స్‌ ఐపిఎల్‌..
  హైతీ బాధితుల సహాయార్థం లియాండర్‌..
  రుణాల వడ్డీ మాఫీపై రాష్ట్రాల పోటీ
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com