మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
విశాఖ తూ.గో.జిల్లాల్లో నక్సల్స్‌ బంద్‌ ప్రశాంతం
గురు వారం, నవంబర్ 05, 2009 , 10:46 [IST]

vishakaప్రైవేట్‌ గెస్ట్‌హౌస్‌ పేల్చివేత
భారీగా పోలీసుల మొహరింపు
ప్రభాతవార్తప్రతినిధి-విశాఖపట్నం:
గోదావరి ఆపరే షన్‌ పేరుతో ఆదివాసీల నిర్బంధ దాడిని వ్యతిరే కంగా ఈ నెల 4, 5 తేదీల్లో మావోయిస్టు పార్టీ ఇచ్చిన రెండు రోజుల బంద్‌ పిలుపు బుధవారం ఊహించని విధంగా విజయవంతం అయింది. ఎఒబి సరిహద్దులో మావోయిస్టులు ఒక ప్రైవేట్‌ అతిథి గహాన్ని పేల్చివేశారు.విశాఖలో పెదబయలు మండలంలో బుధవారం కూడా రహదారికి అడ్డంగా చెట్టులు నరికి రవాణాకు అంతరాయం కల్గించారు. ఏజన్సీలో అన్ని ప్రాంతాలలో స్వచ్ఛందగా దుఖా ణాలు మూసివేశారు.  మావోయిస్టుల బంద్‌ సంద ర్భంగా విశాఖ ఏజెన్సీలో వున్న 11 మండలాల్లో అరకు, డుంబ్రిగుడ మినహ మిగిలిన మండలాల్లో మావోయిస్టుల బంద్‌ విజయవంతమైంది. పాడేరు, చింతపల్లి, జికె వీధి, జి.మాడుగుల, పెదబయలు, ముంచింగ్‌పుట్టు తదితర బంద్‌ ప్రశాంతంగా జరి గింది. రెండు రోజుల బంద్‌ కారణంగా ఏజెన్సీ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

vishaka బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరగకుండా నిలిపి వేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాడేరు-పెదబయిలు మార్గమధ్యలో వున్న చుట్టు మెట్ట సమీపంలో రెండు చెట్లను మావోయిలు నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. రోడ్డుకు సమీపంలో ఒక రేకుడబ్బా ఉంచి అందులోనుంచి ఒక వైరును ఉంచారు. ఆవైర్‌ బయటకు కనిపించేలా మావో యిస్టు ఏర్పాటు చేసి అలజడి సృష్టించారు. ఆ రేకు డబ్బాలో బాంబు పెట్టినట్టు ఉన్నా బాంబు మాత్రం కాదంటూ భయపెట్టడానికే మావోయిస్టులు ఈ విధంగా ఉంచినట్టు తెలిసింది.  బంద్‌ సందర్భంగా విశాఖ ఏజెన్సీ డివిజన్‌ కేంద్రమైన పాడేరులో దుకాణ సముదాయాలు, పెట్రోల్‌ బంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూసివేసి వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. ప్రైవేటు వాహనాలు సైతం నిలిపివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్సు, అంబేద్కర్‌ సెంటర్‌, మెయిన్‌ రోడ్డు తదితర ప్రాంతాలు వెలవెలబోయాయి. 

భారీస్థాయిలో పోలీసు బందోబస్తు
బుధవారం జరిగిన బంద్‌ కారణంగా ఎక్కడా ఎటువంటి అంవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రధాన కూడల్లో ప్రత్యేక దళాలతో పాటు సిఆర్‌పిఎఫ్‌ బలగాలతో మొహరింపజేశారు. పాడేరు నుంచి విశాఖ, నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి, అరకు ప్రాం తాలకు ఆర్టీసి బస్సు సర్వీసులను నడిపారు. పాడేరు ఆర్టీసీ డిపోలో వున్న 31 బస్సులు ఉండగా, వాటిలో మారుప్రాంతాలైన నుర్మతి, బొయితిలి, కొరవంగి, కుమడ, గెమ్మెలి, మంప బస్సు సర్వీసులను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేశారు. మావోయిస్టుల ఏరివేత చర్యల్లో భాగంగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన జి.మాడుగుల, పెదబయిలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, జి.కె.వీధి, సిలేరు, ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎత్తున కూంబింగ్‌లు నిర్వహించారు. మొదటి రోజు బంద్‌తో ఆంధ్రా-ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధవా తావరణం నెలకొంది. తొలిరోజు ప్రశాంతంగా బంద్‌ ముగియడంతో అన్ని వర్గాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రైవేట్‌ అతిథిగహం పేల్చివేత
ఒడిషా సరిహద్దు ప్రాంతమైన చిత్రకొండ గెస్ట్‌ హౌస్‌, పంప్‌హౌస్‌, పైప్‌లైన్‌తో పాటు కొయ్యూరు చెక్‌ పోస్టులను మావోలు పేల్చిన సంఘటనలతో పాటు వాహనాలు తిరగకుండా రోడ్డులను దిగ్బం ధం చేయాలనే లక్ష్యంతో రోడ్డుకడ్డంగా మావో యిస్టులు చెట్లను నరికి వేసి రవాణా సౌకర్యాలను స్తంభింపజేశారు. జి.మాడుగులలో బుధవారం సాయంత్రం మావోయిస్టులు రోడ్డు పక్కన ఉన్న చెట్లును నరికి వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో గోతులు తవ్వి రాకపోకలకు అంత రాయం కలిగించారు. ఏదిఏమైనా మావోయిస్టుల బంద్‌ మొదటి రోజు విజయవంతం అయింది.

ఎఒబిలో మావోయిస్టుల అలజడి

ఆంధ్రా-ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల అలజడి మళ్లీ ప్రారంభమయింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరున మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జల్లెడ పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో మావోయిస్టులు ఏజెన్సీలో రెండురోజులపాటు  బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఆంధ్రా,ఒడిషా సరిహద్దు ప్రాంతాల పరిధిలో ఉన్న గుచ్చింపేట, ఎర్రసామంతవలస, డోకిశీల, దుగ్గేరు, లోవవలస పరిసర ప్రాంతాల్లో సుమారు 15 కిలోమీటర్ల పొడుగున రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లును నరికివేసి రోడ్డుకు అడ్డంగా వేసారు. అక్కడ కొరాపుట్‌ ఏరియా కమిటీ దళసభ్యులు ప్రత్యేకంగా వాల్‌పోస్టర్లను చెట్లకు అతికించారు. ప్రధానంగా ఆదివాసీ పాపురా బెటాలియన్‌ కింద నాగరికత కమిటీ నిర్ణయాలను వ్యతిరేకించాలని, కేంద్రప్రభుత్వ ఆలోచనలకు నిరసనగా తలపెట్టే రెండు రోజుల బంద్‌ను విజయవంతం చేయాలని పిలుప ునిచ్చారు.

రోడ్డుకు ఇరువైపులా చెట్లను నరికివేసి పడివేయడంతో బుధవారం ఆంధ్రా-ఒరిస్సా రాష్ట్రాల మద్య పూర్తిగా రవాణా స్థంబించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసు యం త్రాంగం మరింత అప్రమత్తమైంది. ఆర్టీసి అధికా రులు ఎఒబి ప్రాంతాల వైపు ఉన్న సర్వీసులను రద్దు చేశారు.మావోయిస్టుల బంద్‌ పిలుపు ప్రభావం బుధవారం తూర్పుగోదావరి జిల్లా ఏజన్సీలో అంతగా కనిపించలేదు. నైట్‌హాల్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసులను మాత్రం ఆర్టీసి ముందుగానే నిలిపివేసింది. ఏడు మండల కేంద్రాల మీదుగా సాధారణ బస్సు సర్వీసులు యధాప్రకారం నడి చాయి. సరిహద్దు జిల్లా అయిన విశాఖ ఏజన్సీలో ఒక చెక్‌పోస్టును దగ్ధం చెయ్యడంతో పాటు మావోయిస్టుల కదలికలు కనిపించడంతో తూర్పుగోదావరి పోలీసులు అప్రమత్తమయ్యారు. వై రామవరం మండలంలోని గుర్తేడు, పాతకోట, బొడ్డగండి, దారగడ్డ వంటి గిరిజన గ్రామాల్లో మావోయిస్టుల కదలికలపై స్పెషల్‌ పార్టీ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. కాగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయన్న వార్తలను పోలీసు అధికారులు తోసిపుచ్చుతున్నారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com