మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
అటవీశాఖ ఉన్నతాధికారుల మెడకు బిగుస్తున్న ఒఎంసి ఉచ్చు
గురు వారం, నవంబర్ 05, 2009 , 10:19 [IST]

అరణ్య భవన్‌కు చేరిన 'కల్లోల్‌ బిశ్వాస్‌ '
గుప్పిట్లో పెద్దల జాతకాలు
హైదరాబాద్‌, నవంబర్‌4, ప్రభాతవార్త :
కర్నాటక మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం  మైనింగ్‌ కంపెనీ(ఓఎంసి)సాగిస్తున్న అక్రమ మైనింగ్‌ వ్యవహారం అటవీశాఖకు చెందిన పలువురు ఉన్న తాధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవ హారంలో ఒఎంసితో తలపడిన కల్లోల్‌ బిశ్వాస్‌ బుధవారం హైదరాబాద్‌  చేరుకొని అరణ్యభవన్‌లో ఫారెస్ట్‌ ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వడం  తాజా పరిణామం. అయితే ఒఎంసి అక్రమ మైనింగ్‌ వ్యవహారానికి తానొక్కడినే బాధ్యుడిని చేసి బలి పశువుగా మార్చాలని యత్నిస్తే అసలు ఇందులో ఉన్న సూత్రదారుల, పాత్రదారుల జాతకాలన్నీ వెల్లడిస్తానని బిశ్వాస్‌ హెచ్చరిస్తున్నట్లు వస్తున్న వార్తలు అటవీశాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అనంతపురం జిల్లా ఓబుళాపురంలో గాలి కంపెనీ ఒఎంసి  గత కొంతకాలంగా  అటవీశాఖ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ  మైనింగ్‌  చేస్తున్నట్లు  ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే.

ఒఎంసి అక్రమ మైనింగ్‌తో వేలాది కోట్లాది రూపాయల విలువైన ఖనిజసంపద తరలిస్తున్న  విషయం  యధార్ధమేనని కేంద్ర అటవీశాఖ కూడా ధృవీకరించిన క్రమంలో అనంతపురం జిల్లా అటవీశాఖ అధికారి కల్లోల్‌ బిశ్వాస్‌ అక్రమ మైనింగ్‌ పై వివరణ ఇవ్వాలని ఒఎంసి కి నోటీస్‌ కూడా  జారీ చేశారు. వాస్తవానికి ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ వ్యవహారం ఇప్పటికిప్పుడు బయటపడ్డ కుంభకోణమేమీకాదు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం పార్టీ  గత కొన్నేళ్లుగా ఈ విషయమై పోరాడు తూనే ఉంది. శాసనసభ కూడా అక్రమ మైనింగ్‌ వ్యవహారమై పలుసార్లు స్తంభించింది కూడా. అయినా ఎప్పుడూ ప్రభుత్వం కానీ ఉన్నతాధికా రులు కానీ స్పందించిన దాఖలాలులేవు.

కానీ ఓఎంసి అక్రమ మైనింగ్‌ పై  నోటీసులు జారీ చేసిన బిశ్వాస్‌ పై ఓఎంసి ప్రతినిధులు ఫిర్యాదు చేసిన మరుక్షణమే అటవీశాఖ అధిపతి శివశంకర్‌రెడ్డి ఒఎంసి వ్యవహారాలు చూడవద్దని  బిశ్వాస్‌ను ఆదేశిస్తూ ఆఘమేఘాలపై ఉత్తర్వులు జారీచేయడమేకాక ఆయన బాధ్యతలను తొలగించి వేరే అధికారికి బాధ్యతలు అప్పగించడంతో మరెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒఎంసి అక్రమ మైనింగ్‌కు యధాశక్తి సహకరిస్తూ ముడుపులతో మునిగితేలుతున్న కొందరు ఫారెస్ట్‌ ఉన్నతాధికా రులు స్వామి భక్తిని ప్రదర్శించుకుంటూ ఓఎంసి పాపాల చిట్టాకు మూలవిరాట్టులైన పెద్దలను కాపాడేందుకు కంకణం కట్టుకున్నారన్న ఆరోపణలు చుట్టుముడుతున్నాయి.

అటవీశాఖతో పాటు ప్రభు త్వంలోని పలువురు ఉన్పతాధికారులకు కూడా ఈ అక్రమం మైనింగ్‌తో సంబంధం ఉందని సమా చారం. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ వ్యవహారం కధాకమామిషు అంతా కేంద్ర నిఘా సంస్థల వద్ద ఉందని, ప్రధాన మంత్రి కార్యాలయం ఈ అంశమై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ అందరి జాతకాలు సేకరిం చిందని అంటున్నారు.

ముఖ్యమంత్రిగా కె.రోశయ్య బాధ్యతలు స్వీకరిం చిన తరువాత తొలిసారి జరిగిన ఒక ఉన్నతాధికారి బదిలీ  ఇందులో భాగంగానేనన్న అభి ప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని  ఓఎంసి అక్రమ మైనింగ్‌ పెద్దలతో పాటు ఉన్నతాధికారులందరిపై కఠినచర్యలు  తప్పవని  ప్రభుత్వ  వర్గాలంటున్నాయి. కాగా ఒఎంసి అక్రమ  మైనింగ్‌పై నోటీసులు జారీ చేసి అందరి దృష్టినాకర్షించిన కల్లోల్‌ బిశ్వాస్‌ బుధ వారం హుటాహుటిన అనంతపురం నుంచి హైద రాబాద్‌ చేరుకున్నారు. నోటీస్‌ జారీచేసిన పాపానికి ఉన్నతాధికారి అగ్రహం చవిచూసిన బిశ్వాస్‌ అరణ్య భవన్‌లో పలువురు ఉన్నతాధికారులకు తాజా పరి ణామాలను వివరించారు. అయితే సిసిఎఫ్‌ శివశం కర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన కారణంగా బిశ్వాస్‌ ఆయనను కలవలేకపోయారు.

కాగా బిశ్వాస్‌కు అక్రమ మైనింగ్‌కు సంబంధిం చిన అన్ని విషయాలు తెలుసునని,  తెరవెనుక సూత్రధారులు, పాత్రధారులెవరో అంతా ఆయనకు తెలుసునని,  విచారణ  సందర్భంగా బిశ్వాస్‌ నోరు తెరిస్తే ఎందరో పెద్దల జాతకాలు బయటపడతా యని అటవీ  శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు అంటున్నారు. తమ శాఖలోని కొందరు అక్రమా లకు పాల్పడే రాకెట్లతో కుమ్మక్కయి అటవీశాఖ పరువుతీస్తున్నారని వారు మండిపడుతున్నారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com