| 'గ్రేటర్ వడపోత' |
| గురు వారం, నవంబర్ 05, 2009 , 10:14 [IST] |
 |
|
పిఆర్‌పితో పొత్తు తేలే వరకు అభ్యర్థుల జాబితా జాప్యం మొయిలీ పర్యటన వాయిదా, నేటి రాత్రికే తుది నిర్ణయం ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు గెలుపు గుర్రా లను ఎంపిక చేయడంలో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతనదైనమార్క్‌ను వేసేందుకు ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య బుధవారంనాడు సుమారు ఆరు గంటల సమయాన్ని కేటాయించారు. గండిపేట లోని డ్రీమ్ వ్యాలీ ఫామ్ హౌజ్‌లో పీసీసీ అధ్య క్షుడు డి.శ్రీనివాస్‌తో కలిసి స్క్రీనింగ్ కమిటీ అంద జేసిన అభ్యర్థుల జాబితాపై తీవ్రంగా కసరత్తు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు షబ్బీర్ అలీ(మాజీ మంత్రి), గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, మంత్రి దానం నాగేందర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు నందీశ్వర్ గౌడ్, కె.ఎం. ప్రతాప్‌లతో పాటు, గ్రేటర్ పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేలను పిలి పించుకుని కూడా అభ్యర్థులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఎమ్మెల్యేలలు తమ నియోజవర్గం పరిధిలోని ఆరు లేదా ఏడు కార్పొరేటర్ల స్థానాల్లో నాలుగింటికి సొంతంగా ఎంపక చేసుకునే అవకాశం ఇవ్వగా, మిగతారెండులేదా మూడుస్థానాల్లో ఆయా ఎంపీలు సూచించే అభ్యర్థులను రంగంలోకి దింపా లని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా, గ్రేటర్ పరి ధిలోని మంత్రులు తమ సొంత నియోజకవర్గాలు తప్ప, ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవ డాన్ని ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉం డగా, బుధవారం రాత్రి హైదరాబాద్‌కు రావాల్సిన రాష్ట్రకాంగ్రెస్ వ్యవహారాలఇన్‌చార్జి వీరప్ప మొయిలీ తన రాష్ట్ర పర్యటనను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. గురువారంకూడా వచ్చేది లేనిదీ ఇంకా తేలలేదు. కాగా, పిఆర్పీతో పొత్తుఉందో లేదో ఇంకా తేలకపోవడంకూడా కాంగ్రెస్‌జాబితా ఖరారు జాప్యా నికి కారణమని కొందరంటున్నారు. ఈ నేపథ్యంలో మొయిలీ లేకుండానే పిసిసిఅధ్యక్షుడు డి.శ్రీనివాస్, రోశయ్య కలిసి జాబితా విడుదలచేసే అవకాశం లేక పోలేదంటన్నారు.
పిఆర్పీతో పొత్తు పెట్టుకోవాలని కెవిపి రామచంద్రరావు సమక్షంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఢిల్లీకి వెళ్ళగానే మొయిలీ ప్లేట్ ఫిరాయించ డంపై కూడా కాంగ్రెస్ సీనియర్లతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.ఒకవేళ మొయిలీ ఢిల్లీనుంచి వస్తే ఈ విషయంపై ఆయనను గట్టిగా నిలదీసేందుకు కూడా సీనియర్లు సిద్దమవుతున్నారు. కాగా గ్రేటర్ ఎన్నికలఅభ్యర్థుల జాబితాను విడుదలచేసే ముందు దానిపై రోశయ్య తనదైన శైలిలో ముద్ర వేయాలను కుంటున్నారు. సొంతంగా విడుదల చేసే అవకాశం వస్తే, ఆ జాబితాను ముందుగా ఢిల్లీ అధిష్టానానికి ఫ్యాక్స్‌చేసేఅవకాశంఉంది. ఎంపీలు సర్వేసత్యనారా యణ, అంజన్‌కుమార్ యాదవ్, వి. హనుమంత రావు, మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, సబితాఇంద్రారెడ్డి,ఎమ్మెల్యేలుమర్రిశశిధర్‌రెడ్డి, విష్ణు వర్దన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, శంకర్‌రావు, జయసుధ తదితరుల రాకతో అక్కడ సందడి ఏర్పడింది. ఇదిలా ఉండగా, పిసిసి ఉపాధ్యక్షురాలు త్రిపురాన వెంకటరత్నం అక్కడ హడావుడిచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సిఎంను కలిసిన తర్వాత వెళ్ళిపోవచ్చు నంటూ గట్టిగా చెప్పుకుంటూ వచ్చారు. కాగా, తన కోటాలో 15పేర్లు ఇచ్చి, ఆ పేర్లు ఖరారు కావాల్సిం దేనంటూ అంజన్‌కుమార్‌యాదవ్ పట్టుపట్టారు
|
|
|
|
|
|
|