మార్చిన వార్తా విశేషాలు - శని వారం మార్చి   13th 2010 - 4:41 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
ధరణికి దిగని ధరలు
గురు వారం, నవంబర్ 05, 2009 , 10:11 [IST]

VEGITABLES5 ఏళ్లలో 50 కోట్లతో అధికారుల
ఉద్యాన 'వన భోజనాలు
కేటాయించిన నిధులకు లెక్కలు లేవ్ఞ
తగ్గుతున్న కూరగాయల సాగు విస్తీర్ణం
హైదరాబాద్‌, నవంబర్‌4, ప్రభాతవార్త :
కూర గాయాల  సాగువిస్తీర్ణం పెంచి వాటి ధరలకు పగ్గం వేయాలని, అదుపులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పురిట్లోనే సంధికొడుతోంది.    కోట్లాది రూపాయలు  ఉద్యానవనశాఖకు అందించి సాగు విస్తీర్ణం పెంచాలని ఆదేశిస్తూ నిధులు కేటా యిస్తే అవి  హారతి కర్పూరంలా తరిగిపోయి, కొం దరు అధికారుల జేబులు నింపుతున్నాయనే ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. ఆశించిన  సాగు విస్తీర్ణం  సెంటు కూడా పెరగడంలేదు.  పెరుగుతున్న కూర గాయల ధరలభారంతో అన్నివర్గాల ప్రజలు గగ్గోలు పెడుతున్నా, ఉద్యావనశాఖ అధికారులు మాత్రం కార్యాలయంలో కూర్చోని  సాగువిస్తీర్ణం, ఉత్పత్తిని గ్రాఫ్‌షీట్లలో, పవర్‌ ప్రజెంటేషన్లలో ఆకాశంలో చుక్కలు చూపుతూ పాలకులను  తప్పుదారి పట్టిస్తు న్నారని ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి.

కూరగాయల రైతులకు విత్తనాలు, ఎరువులు తదితర వాటికి సబ్సిడీలు ఇవ్వడానికి గత ఐదేం డ్లలో ప్రభుత్వం 50కోట్ల రూపాయలకు పైగా ఉద్యానవన శాఖకు అందిస్తే అవి ఎవరికిచ్చారో కూడా లెక్కలు చెప్పలేని పరిస్ధితిలో ఆ శాఖలో ఉందని రైతుల నుంచి తీవ్రమైన నిర సనలు వ్యక్తమ వుతున్నాయి. రాష్ట్రంలో  సాగవుతున్న కూరగాయల విస్తీర్ణం ఎంత?  ఉత్పత్తి ఎంత?  రైతులకు  అందిస్తున్న సబ్సిడీలు  ఏమిటి?  ఏ ప్రాంతాలలో  ఏ రకం కూరగాయలు పండుతాయనే ఇత్యాది  ప్రశ్నలలో  ఒక్క ప్రశ్నకు కూడా సదరు ఉద్యానవన శాఖ అధికారుల వద్ద  సమాధానం లేదనేది  కఠోర వాస్తవం. 2008-09 సంవత్సరం ముగిసి ఆరు నెలలకు పైగా గడిచిపోయినప్పటికీ సాగు విస్తీర్ణం ఎంతో ఆ శాఖ వద్ద లెక్కలు లేవంటే అతిశయో క్తికాదు.

ఈ వైఖరి వారి నిర్లక్ష్యాన్ని, అచేతనను,  పనితీరుకు దర్పణమని వ్యవసాయశాఖ సీనియర్‌ అధికారులే  వ్యాఖ్యానిస్తున్నారు.  రాష్ట్రంలో ఈ ఏడాది 2.74 లక్షల హెక్టార్లలో కూరగాయలు సాగు చేపట్టాలని  ఉద్యానవనశాఖ లక్ష్యంగా నిర్ణ యించింది.  అయితే వర్షాభావ పరిస్థితులతో భూగర్బ జలాలు అడుగంటిపోవడంతో 1.34 లక్షల హెక్టార్లలో మాత్రమే కూరగాయల సాగు జరిగినట్లు అనధికార లెక్కలు చెపుతున్నాయి,  తగ్గిన విస్తీర్ణాన్ని పెంచడానికి 50 వేల హెక్టార్లలో కూరగాయల సాగు చేపట్టాలని ప్రభుత్వం  అత్య వసర ప్రణాళిక రూపొందించింది. ఈ విస్తీర్ణానికి సరిపడ విత్తనాలను  సబ్సిడీపై సరఫరా చేయా లనినిర్ణయించింది.ఇందులోభాగంగా  ప్రతిపట్టణ ప్రాంతంలో  క్లస్టర్‌ ప్రోగ్రాం కింద నూరు, నూట యాబై ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల సాగు చేపట్టాలని కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసు కున్నది.

ఈ ఏడు విత్తనాల సబ్సిడీకోసం ప్రభు త్వం  దాదాపు  పన్నెండు కోట్ల రూపాయలకు పైగా  ఉద్యానవనశాఖకు  అందించింది. అయితే నిధులు హరించుకుపోయాయి. కాని కూరగా యల సాగు పెరిగిన దాఖలాలు కన్పించడంలేదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.
కూరగాయల సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభు త్వం ప్రతి సంవత్సరం పది కోట్ల రూపాయల వరకు అందిస్తుండగా గత ఏడాది 1 కోట్ల రూపా యలవరకు అందించింది. గతఐదేండ్లలో దాదాపు 50 కోట్ల రూపాయల వరకు కూరగాయల సాగు పేరిట ప్రభుత్వం వ్యయం చేసినప్పటికీ   సాగు విస్తీర్ణం ఎకరా కూడా పెంచలేకపోయారని, కేటా యించిన నిధులు దారితప్పి కొంతమంది అధికా రుల జేబులు నింపాయని  రైతాంగం నుంచి తీవ్రమైన ఆరోపణలు  విన్పిస్తున్నాయి.

వనరులున్న తగ్గుతున్న  విస్తీర్ణం

రాష్ట్రంలో కూరగాయల సాగు చేయడానికి పుష్కలమైన వనరులున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి సరిహద్దులో ఉన్న రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలో కూరగా యలు పండించడానికి కావాల్సిన వనరులు న్నాయి. కూరగాయల సాగుచేసే రైతులకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చే వారే  కరవయ్యారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలు వారికి చేరడం లేదనే ఆరోపణలు తారస్ధాయిలో ఉన్నాయి. ఫలితంగాఏయేటికాయేడు విస్తీర్ణం తగ్గిపోతోంది. గతంలో రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలలో కలిపి 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో కూరగాయల సాగు జరి గేది. ప్రస్తుతం  రంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలిపికూడా  13వేల హెక్టార్లలో మాత్రమే కూరగాయల సాగవుతుం దని రైతులు చెపుతున్నారు.

ఒక సర్వే నివేదిక ప్రకారం  హైదరాబాద్‌ పరి సరాల ప్రాంతాలు కలిపి ప్రతి ఏటా  10 లక్షల మెట్రిక్‌టన్నుల కూరగాయల వినియోగం ఉం టుంది.గతంలో జనాభా తక్కువగాఉండి ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయల పంటలు సాగవడంతో డిమాండుకు సరిపోను కూరగాయల  ఉత్పత్తులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం విస్తీర్ణం తగ్గ డంతో దిగుబడులు కూడా తగ్గాయి, దీనికి తోడు జనాభా పెరిగిడిమాండుఅధికమైంది.దీనితో హైద రాబాద్‌ పరిసరప్రాంతంలో పండుతున్న కూరగా యలు ఇక్కడి అవసరాలు తీర్చ లేకపోతున్నాయి. దీనితో కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక, మహ రాష్ట్ర రాష్ట్రాల  నుంచి  సరఫరా అవుతున్నాయి.

అయినప్పటికీడిమాండ్‌ తీరకధరలు ఆకాశన్నంటు తున్నాయి. జూలైనుంచిజనవరివరకు అన్ని ప్రాం తాలలో కూరగాయల పంటలు సాగవుతుం టాయి. అందులో ఈ కాలంలో కూరగాయల ధరలు కొంతమేరకు తక్కువగా ఉంటాయి. సాధా రణంగా   ఫిబ్రవరి నుంచి కొరత ఏర్పడుతుంది. అప్పుడు కూరగాయల ధరలు క్రమంగా ఆకాశ న్నంటుతుంటాయి.  ఈ సందర్భంలోనే ఉద్యాన వన శాఖ జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందని రైతు నిపుణుల నుండి సూచనలు వస్తున్నాయి.   ఇప్పటికైనా పాలకులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కాలానుగుణంగా కూరగాయల రైతులను ప్రోత్సహించాలని, తద్వారా రైతులను ఆదుకోవాలని, ప్రజల ఇబ్బందులను నివారించా లని నిపుణులు పేర్కొంటున్నారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 జమునకు ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం
 పరిహారంలోనూ పరిహాసం!
 మహిళా లోకానికి శుభాకాంక్షలు
 చల్లని కబురు
 లేచింది మహిళా లోకం దద్దరిల్లింది..
 ముగ్గురు రైతుల ఆత్మహత్యలు
 పర్యటన జయప్రదం
 వద్దన్నవారూ వస్తారు
 థర్డ్‌ జనరేషన్‌ (3జి) ప్రారంభించిన..
 పర్యావరణ మార్పులతో పంట నష్టం :..
 
 
ముఖ్య వార్తలు
  ఐటి, పరిశ్రమల భద్రతకు..
  'ఇంటర్‌'లో 60 వేల మంది డుమ్మా
  మైనింగ్‌ మాఫియాకు సర్కార్‌ దన్ను
  ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం..
  15 లేదా 16న లోక్‌సభలో మహిళా బిల్లు
  సొంత పార్టీ నుంచి సూకీ బహిష్కరణ
  ఒఎన్‌జిసి, ఐఒసి ఐపిఒలు ఉండవు
  కొత్త హంగులతో మాక్స్‌ ఐపిఎల్‌..
  హైతీ బాధితుల సహాయార్థం లియాండర్‌..
  రుణాల వడ్డీ మాఫీపై రాష్ట్రాల పోటీ
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com