మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం మార్చి   12th 2010 - 7:04 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
గరిష్టంగా బంగారం ధర
భుధ వారం, నవంబర్ 04, 2009 , 1:24 [IST]

హైదరాబాద్‌, నవంబర్‌ 3: బంగారం ధర చుక్కలను తాకుతోంది. అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్ల పతనం బంగారం ధర పెరగడానికి కారణమౌతోంది. ఇన్వెస్టర్లు షేర్ల బదులు బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీనితో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌లో రికార్డ్‌ స్థాయిలో పది గ్రాముల బంగారం ధర 16,254 రూపాయలు పలికింది. ఫ్రిబవరి కాంట్రాక్ట్‌కు బంగారం ఈ ధర పలికింది. దీనితో పాటు డిసెంంబర్‌ కాంట్రాక్ట్‌ ధర పది గ్రాములకు 16,248 రూపాయలు పలికింది.

అంతర్జాతీయంగా అన్ని దేశాల స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట పట్టడంతో ఒక్కసారిగా బంగారాకి రెక్కలు వచ్చినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. షేర్స్‌లో పెట్టుబడులు అంత ఆకర్షిణీయంగా కనిపంచకపోవడంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు దష్టి సారించారు. బంగారం ప్రత్యామ్నా పెట్టుబడి రంగంగా మారింది. అంతర్జాతీయ గోల్డ్‌ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,063 డాలర్లు పలికింది. ఇది క్రితం రోజు 1,059 డాలర్లు ఉంది. 

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌)  200 టన్నుల బంగారాన్ని ఆర్‌బిఐకి అమ్ముతుందన్న వార్తలు కూడా బంగారం ధర పెరగడానికి కారణమని భావిస్తున్నారు. ఐఎంఎఫ్‌ బంగారం అమ్ముతుందన్న వార్తలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావింత చేశాయని, ఫలింగా గోల్డ్‌ బులిష్‌ ట్రెండ్‌ కొనసాగినట్లు మార్కెట్‌ విశ్లేషకులు కిశోర్‌ నార్నే, అనంద్‌ రాఠి అభిప్రాయపడ్డారు. ఐఎంఎఫ్‌ 200 టన్నుల బంగారాన్ని 6.8 బిలియన్‌ డాలర్లకు ఆర్‌బిఐకి అమ్ముతున్నట్లు ప్రకటించింది.

ఈ సంవత్సరం బంగారం ధర పెరుగుతూనే ఉంది. 2009లో బంగారం ధర ఇప్పటి వరకు 21 శాతం పెరిగింది. 2000 సంవత్సరం తరువాత ఐఎంఎఫ్‌ ఇలా బంగారాన్ని ఆర్‌బిఐకి అమ్మడం ఇదే మొదటిసారి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నందున ఈ సంవత్సరం మన దేశంలోకి దిగుమతులు తగ్గాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్‌ 22 వరకు మన దేశంలోకి 157.9 టన్నుల బంగారం దిగుమతి అయ్యింది. గత సంవత్సరం ఇదే కాలంలో 383 టన్నుల బంగారాన్ని వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు.

ప్రపంచ వ్యాపింతంగా స్టాక్‌ మార్కెట్లు కరెక్షన్‌ దిశగా ప్రయాణీస్తున్నాయి. అన్ని ప్రధాన స్టాక్‌ మార్కెట్లు పతనం బాటులో నడుస్తున్నాయి. ఈ వారం మొత్తం బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛ్‌ంజ్‌ (బిఎస్‌ఇ), నేషనల్‌ స్టాక్‌ఎక్స్ఛ్‌ంజ్‌ రెండు  నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 491 పాయింట్లు నష్టపోయింది. ఇంత భారీ కరెక్షన్‌ రావడం ఈ వారంలో ఇదే మొదటిసారి. ప్రధానంగా మెటల్‌, రియాల్టీ స్టాక్‌ భారీగా పతనమయ్యాయి. సోమవారంనాడు గ్లోబల మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్‌ అయ్యాయి.

ఆ రోజు గురునానక్‌ జయంతి వల్ల మన మార్కెట్లకు సెలవు. మంగళవారంనాడు స్టాక్‌ మార్కెట్లు ప్రారంభంలోనే బలహీనంగా కనిపించాయి. ఏ దశలోనూ అవి కోలుకోలేదు. దేశీయ కొనుగోలుదారుల నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడంతో స్టాక్‌ మార్కెట్‌ కోలుకోలేదు. నిఫ్టీ 147 పాయింట్లు నష్టపోయి 4564 పాయింట్ల వద్ద క్లోజయింది.

ప్రధానంగా గ్లోబల్‌ మార్కెట్లు బలహీనంగా ఉండటం వల్లే ఇండియా మార్కెట్లు కూడా అదే బాటులో నడుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా మెటల్‌, ఆటో షేర్ల విషయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గత పదిహేను రోజులుగా మార్కెట్‌ పతనం కావడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం పై పెట్టుబడులు పెడుతున్నారు.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 అస్సాం గ్యాస్‌కు కాగ్‌ అక్షింతలు
 విక్రమ్‌ సోలార్‌ పెట్టుబడులు
 అపర కుబేరుల్లో ఇద్దరు భారతీయులు
 వాటాల విక్రయానికి బిఎస్‌ఎన్‌ఎల్‌..
 మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్‌..
 టాంజరిన్‌ స్పా అండ్‌ సెలూన్‌..
 వీడియోల ద్వారా రైతులకు బోధన
 మార్కెట్లోకి ఫోర్డ్‌ ఫిగో కారు
 
 
ముఖ్య వార్తలు
  ఐటి, పరిశ్రమల భద్రతకు..
  'ఇంటర్‌'లో 60 వేల మంది డుమ్మా
  మైనింగ్‌ మాఫియాకు సర్కార్‌ దన్ను
  ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం..
  15 లేదా 16న లోక్‌సభలో మహిళా బిల్లు
  సొంత పార్టీ నుంచి సూకీ బహిష్కరణ
  ఒఎన్‌జిసి, ఐఒసి ఐపిఒలు ఉండవు
  కొత్త హంగులతో మాక్స్‌ ఐపిఎల్‌..
  హైతీ బాధితుల సహాయార్థం లియాండర్‌..
  రుణాల వడ్డీ మాఫీపై రాష్ట్రాల పోటీ
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com