మార్చిన వార్తా విశేషాలు - సొమ వారం మార్చి   15th 2010 - 8:13 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
పౌల్ట్రీ రైతులు సంతోషం
భుధ వారం, నవంబర్ 04, 2009 , 1:20 [IST]

poultryన్యూఢిల్లీ నవంబర్‌ 3:- దేశంలో శీతాకాలం రావడం వల్ల, పండుగ సీజన్‌ కావడం వల్ల పౌల్ట్రీ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఇదే సమయంలో దాణా ఖర్చు తగ్గడం వల్ల పౌల్ట్రీ రైతుల మార్జిన్‌లు మెరుగుపడ్డాయి. సోయామీల్‌ ధరలు కూడా ఇటీవల కాలంలో తగ్గుతున్నాయి.

ఆగస్టు నెలలో కోళ్ళదాణా ధర టన్నుకు రూ. 19వేలు ఉంటే ప్రస్తుతం దానిని రూ. 16,500 వద్ద స్థిరీకరించారు. సోయాబీన్‌ ధర దేశవ్యాప్తంగా టన్నుకు రూ.17,600 వద్ద ఉంది. మొక్కజొన్న ధరలు కూడా రూ.10,280 వద్ద స్థిరంగా ఉన్నాయి.

గత కొద్ది నెలలుగా దాణా ధరలు స్థిరంగా ఉండటం వల్ల పౌల్ట్రీ  రైతులు, ట్రేడర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే ఢిల్లీ మార్కెట్లో కోడి ధర రూ. 65 నుంచి రూ. 70కి పెరిగింది. కోడిగుడ్ల ధరలు కూడా 15 శాతం పెరిగి హోల్‌సెల్‌ మార్కెట్లో రెండున్నర రూపాయల స్థాయికి చేరింది. 2009-10 సంవత్సరంలో సోయాబీన్‌ ఉత్పత్తి పది శాతం పడిపోయి 97 లక్షల టన్నులకు చేరుకునే అవకాశం ఉంది.

దీనితో సోయాబీన్‌ ధరలు భవిష్యత్తులో పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇండియాలో పౌల్ట్రీ పరిశ్రమ 15 మిలియన్‌ టన్నుల దాణాను ఉపయోగిస్తుంది. దాని విలువ దాదాపు రూ.15వేల కోట్లు. ఇండియాలో 23 లక్షల టన్నుల బ్రాయిలర్‌ మాంసం ఉత్పత్తి అవుతుందని అంచనా. బ్రాయిలర్‌ ఉత్పత్తిలో ఇండియాది ఐదో స్థానం.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 విద్యుత్‌ కొరతతో ఐటి కంపెనీలకు..
 ఎన్‌ఎమ్‌డిసి స్పందన అంతంత మాత్రమే
 డిజిన్వెస్ట్‌మెంట్‌కు స్పందన..
 లండన్‌లో మీడియా సెంటర్‌
 సిమెంటు ధర పెరిగే అవకాశం
 రానే-టిఆర్‌డబ్ల్యు కొత్త యూనిట్‌
 పొరుగు దేశాలకు ఎరువుల రవాణా
 అస్సాం గ్యాస్‌కు కాగ్‌ అక్షింతలు
  హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ రెండో ప్లాంట్‌
 హైదరాబాద్‌కు ఆరో స్థానం
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com