| గాయం కారణంగా సిడిల్ ఔట్ |
| భుధ వారం, నవంబర్ 04, 2009 , 12:30 [IST] |
 |
|
హైదరాబాద్, నవంబర్ 3: ఆస్ట్రేలియా జట్టుకు గాయాల బెడతో పెరిగిపోతోంది.ఇప్పటికే గాయాలతో మేటి క్రికెటర్లు జట్టుకు దూరంకావడంతో కెప్టెన్ రికీపాంటింగ్ అసంతప్తితో ఉన్నాడు. మరో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ కండరాలు పట్టివేయడంతో సీరస్‌కు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ, ఆల్‌రౌండర్ హోప్స్ జట్టుకు దూరమైన విషయం విధితమే. మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో సిడిల్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్రపోషించాడు.
ఐదు ఒవర్లు బౌల్ చేసి జట్టును విజయపథంలో నడిపించిన సిడిల్ చికిత్స నిమిత్తం స్వదేశానికి పయనమయ్యాడు. గాయం తీవ్రత పెద్దదేమీ కాదనీ ఫిజియో కెవిన్ సిమ్స్ ప్రకటించాడు. ముందు జాగ్రత్త చర్యగా పీటర్ సిడిల్‌కు విశ్రాంతి కల్పించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించిందని తెలిపాడు. స్వదేశానికి చేరుకుని క్రికెట్ ఆస్ట్రేలియా మెడికల్ స్టాఫ్ సమక్షంలో చికిత్స తీసకుంటాడని వివరించాడు. వేసవిలో సీజన్ ప్రారంభానికి కోలుకుని జట్టుకు అందుబాటులో ఉంటాడని ధీమా వ్యక్తం చేశాడు.
|
|
|
|
|
|
|