మార్చిన వార్తా విశేషాలు - సొమ వారం మార్చి   15th 2010 - 8:13 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
సాయం కన్నా సహకారం సంతోషాన్నిచ్చింది
భుధ వారం, నవంబర్ 04, 2009 , 12:05 [IST]
సమీర, హైదరాబాద్‌

కొంచెం ఇష్టం కొంచెం కష్టం
కొంచెం ఇష్టం కష్టం శీర్షిక ప్రారంభించిన దగ్గర నుంచీ నా అనుభవాన్ని కూడా రాసి పంపాల నుకుంటున్నాను...
నేను బిటెక్‌ చదివే రోజుల్లో మా అక్క హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండేది. ఎప్పుడు నేను డబ్బులు కావాలని ఫోన్‌ చేసినా వెంటనే ఎకౌంట్‌లో వేసేది. ఏం కావాలన్నా నన్ను అడుగు, అమ్మని ఇబ్బంది పెట్టకు. ఇప్పటికే నీ ఫీజ్‌ కోసం అమ్మ, నాన్నగారూ కష్టపడు తున్నారు అని చెప్పేది. అయినా నాన్నగారు నాకు నెలనెలా పాకెట్‌మనీ ఇస్తుండేవారు.

అది కాదనకుండా తీసుకునేదాన్ని. మా అక్క అప్పుడప్పుడూ పంపే డబ్బులు కూడా కొంత జల్సా చేసినా కొంతైనా పొదుపు చేసేదాన్ని. వాటితో సిస్టం కొనాలన్నది నా లక్ష్యం. మా అమ్మకి అంతా తెలుసు నేనేం చేస్తున్నానో. ఎంత దాస్తున్నానో. ఇంట్లో ఏ కాస్త అవసరం కలిగినా నీ డబ్బులున్నాయి కదా తీసుకురా మళ్లీ నాన్నగారు నీకిస్తారులే  అనేది. నేను మాత్రం తెచ్చేదాన్ని కాదు. ఓ రోజు ఉన్నట్టుండి అనుకోని ఖర్చు వచ్చిపడింది. 20వేలు అవసరపడ్డాయి. అమ్మ నాన్నగారికి నా దగ్గరున్న డబ్బు సంగతి చెప్పి తీసుకోమంది. తనడగితే నేను ఇవ్వడం లేదుకదా మరి.

నాన్నగారు నన్ను అడిగారు. ఏమ్మా నువు దాచుకున్నవి ఇస్తే నేను నా ఎరియర్స్‌ రాగానే నీకు తిరిగి ఇచ్చేస్తా అన్నారు. నేను నా దగ్గర లేవని చెప్పాను. మా నాన్నగారు మరేం మాట్లాడకుండా వెళ్లిపోయారు. వేరే చోటనుంచి డబ్బులు సర్దుబాటు చేసుకున్నారు. అప్పటినుంచీ మా అమ్మ నాతో మాట్లాడటం మానేసింది. తండ్రికంటే డబ్బే నీకు ముఖ్యం అయ్యింది అని నిష్ఠూరాలాడింది. దీపావళికి మా అక్క ఊరి నుంచి రాగానే జరిగిందంతా చెప్పింది. మా అక్క కూడా నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. మరో రెండు నెలలకు మా సెమిస్టర్‌ పరీక్షలు అయిపోయాయి. నేను అక్కదగ్గరికి హైదరాబాద్‌ చూసేందుకు వెళ్లాను.

అక్కడనుంచి తిరిగి వచ్చేసరికి మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ నిన్ను ఎంత బాధపెట్టానమ్మా. నువు చేసిన మంచిపనేదో మాకు చెబితే ఏమయ్యేదే. నీ గురించి తప్పుగా అనుకోకపోదుం కదే అంటూ నన్ను కావలించుకుని ఏడుస్తోంది. మా నాన్న గారు వచ్చి నీ స్నేహితురాలు దుర్గ వచ్చివెళ్లిందమ్మా. నువ్విచ్చిన 20 వేలు తిరిగి ఇచ్చి నీకు   మరీ మరీ థాంక్స్‌చెప్పమంది. పరీ క్షల ముందు ఫీజ్‌ కట్టేందుకు నువు సహాయం చేయకపోతే ప్రిన్సిపల్‌ పరీక్ష రాయనిచ్చేవాడు కాదని చెప్పింది. ఐ ప్రౌడాఫ్‌ యు అన్నారు.

అమ్మ మాట్లాడకుండా కొన్నాళ్లు బాధపెట్టినా, నాన్న, అక్క నా మీద చూపించిన అభిమానం నన్ను సంతోష పెట్టింది. డబ్బుతోనే  మనుషుల మధ్య ఎన్నో స్పర్థలు పెరుగుతాయన్న మాట నా విషయంలో నిజంకానందుకు ఎంతో సంతో షించాను. నేను స్నేహితురాలికి చేసిన సాయం  గొప్పతనం లేదు కానీ మా వాళ్లు నన్ను అర్థం చేసుకోవడంతో, నా పనిని సమర్థించడంతో నా సంతోషం రెట్టింపయ్యింది. 

 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 ముద్దుగానే ముద్ద
 'చారిత్రికంతో మల్లాది వసుంధర..
 'స్త్రీ శక్తి మహెజబీన్‌
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com