మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
శీతాకాలం మేలుచేసే రోటీ
భుధ వారం, నవంబర్ 04, 2009 , 12:03 [IST]

moongdal stuffed parataమూంగ్‌దాల్‌ స్టఫ్డ్‌ పరాఠా
కావలసిన పదార్థాలు
మైదా లేదా గోధుమ పిండి- కప్పుడు
వంట నూనె-రెండు టేబుల్‌ స్పూన్లు(పిండిని కలపడానికి)
కాల్చడానికి నూనె-ఎనిమిది టేబుల్‌ స్పూన్లు
పెసరపప్పు-అరకప్పు
పచ్చికారం-ఒక టేబుల్‌ స్పూన్‌
ధనియాల పౌడర్‌-ఒక టేబుల్‌ స్పూన్‌
ఇంగువ-చిటికెడు
అల్లం, పచ్చిమిరపకాయల ముద్ద-ఒక టేబుల్‌ స్పూన్‌
ఉప్పు- తగినంత

తయారుచేయు విధానం: పెసరపప్పును ముందుగా ఉడికించుకోవాలి. అది చల్లారాక కవ్వంతో బాగా కలిపితే పల్చటి ముద్దలాగా తయారవుతోంది. ఈ మిశ్రమానికి  పచ్చిమిరప కాయలు, అల్లం ముద్ద, పచ్చికారం, ధనియాల పౌడర్‌, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. రెండు టేబుల్‌ స్పూన్ల వంటనూనెను వేడిచేసి ఆ మిశ్రమంలో వేయాలి. ఇలా వేడి నూనెవేయడం వల్ల పరోఠాలు  మెత్తగా వస్తాయి. ఈ పప్పు ముద్దలో ఇంగువ కూడా వేసి బాగా కలపాలి.
 
kerala parataపరాఠా తయారీ: గోధుమపిండి లేదా మైదాలో కొద్దిగా ఉప్పు, కొంచెం నీరు పోసి పిండి మెత్తగా కలుపుకోవాలి. దీనిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనెను కూడా పోయాలి. ఈ పిండి ముద్దను నిమ్మకాయంత సైజులో చేసుకొని మధ్యలో పెసరపప్పు మిశ్రమాన్ని కూరాలి. దీనిని చపాతీల్లాగా తయారుచేసి తక్కువ మంటమీద కాల్చుకోవాలి. వేడివేడి మూంగ్‌దాల్‌ స్టఫ్డ్‌ పరాఠా రెడీ అవు తుంది. దీనితో పాటు ఉల్లిపాయ ముక్కలు తింటే ఆరోగ్యానికి మంచిది కూడా.

కేరళ పరాఠా
కావలసిన పదార్థాలు
గోధుమపిండి-ఒక కప్పు
నూనెలేదా నెయ్యి-ముప్పావు కప్పు
బియ్యపు పిండి -రెండు టేబుల్‌స్పూన్లు
వేయించడానికి నూనె లేదా నెయ్యి- 8టేబుల్‌ స్పూన్లు
కోడిగుడ్డు-ఒకటి
ఉప్పు-తగినంత

తయారుచేయు విధానం:
గోధుమపిండిలో నీరు, ఉప్పు, నెయ్యి, కోడిగుడ్డు పగలగొట్టి అందులో వేసి బాగా కలపాలి. ఈ కలిపిన ముద్దను కాసేపు మూతపెట్టి పక్కన పెట్టాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లాగా చేసుకోవాలి. దీనిని రౌండ్‌గా మళ్లీ చుట్టి, దానిని తిరిగి చపాతీలాగా చేసుకోవాలి. ఈవిధంగా రౌండ్స్‌ చేయడం వల్ల చపాతీలో పొరలు ఎక్కువగా వస్తాయి. తినడానికి మెత్తగా, రుచిగా ఉంటుంది. సన్నటి మంట మీద కాల్చుకుంటే తినడానికి బాగుంటుంది. ఇలాంటి పరోఠాలు తింటే ఆరోగ్యానికీ కూడా ఎంతో మంచిది.

thandoori rotiతందూరి రోటీ
కావలసిన పదార్థాలు
గోధుమపిండి లేదా ఆటా పిండి
నూనె- ఒక టేబుల్‌ స్పూన్‌
నీరు-తగినంత
ఉప్పు-తగినంత

తయారుచేయు విధానం: గోధుమపిండిలో ఉప్పు, సరిపడినంత నీరు పోసి మెత్తగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దానిని ఎనిమిది అంగుళాలు ఉండేటట్టుగా రోటీలను చేసుకోవాలి. చేసిన రోటీమీద కొద్దిగా నీటితో తడిచేసి మడిచి మళ్లీ చేసుకోవాలి. దానిని తవాలో సన్నని మంట మీద కాల్చుకోవాలి.

5నిమిషాల తరువాత దానిని అట్లపుల్లతో పట్టుకుని మంట డైరెక్ట్‌గా తగిలేటట్టు స్టవ్‌ మీద 5నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత తిరిగి తవా మీద 5నిమిషాలు ఉంచాలి. ఈవిధంగా చేయడం వల్ల రోటీని అటుఇటు తిప్పనవసరం లేకుండా కాలిపోతుంది. వేడివేడి తందూరి రోటీ తయారవుతుంది. ఇటువంటి రోటీలు తినడం ఆరోగ్యానికి ఎంతో క్షేమకరం.

 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 రాధాతత్త్వము
 స్నేహితులంటే ఎలా ఉండాలి?
 సమానవాదమే మనవాదం
 మెప్పించే మాటతీరు
 పిన్నవయసు సిఇఒ
 తల్లిపాల బ్యాంకు మరొకటి
 సీ'రియల్'‌లో వాస్తవాలెక్కడ?
 రాఖీ వెనుక రాచగాధలు
 పాక్‌ ప్రధాని లత అభిమాని
 వీణా వాదనలో ప్రవీణ
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com