|
24కేరట్ల బంగారాన్ని కొనలేని ఈ రోజుల్లో కిలో కేరట్ కొనుక్కుంటే చాలు. ఆరోగ్యానికి విలువైన సంపద లభించినట్లే. ముదురు కాషాయరంగులో పొడుగ్గా కనిపించే కారెట్‌లో పోషకాలు పుష్కలం. పచ్చిగా అయినా, కూరగా అయినా, స్వీట్‌గా అయినా, పాయసం చేసైనా దీన్ని తినొచ్చు.
ఎలా తిన్నా అమోఘమైన రుచి, అద్భుతమైన ఫలితాలు దొరుకుతాయి. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరం లేదంటారు కదా! కొన్ని కారెట్లు తిన్నా అదే ఫలితం లభిస్తుందంటున్నారు డాక్టర్లు. పైగా ఇవి యాపిల్ కన్నా చౌక కూడాను. రోజులో ఏ సమయంలోనైనా దీన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
కేరట్ గురించి కొత్త విషయాలు మనం గర్వించదగ్గ విషయం ఏమంటే కేరట్ భారత్‌లోని చాలా ప్రాంతాల నుంచి ప్రపం చానికి పరిచయం అయ్యింది. ఇప్పుడు పాకి స్తాన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షణ ఇరాన్, చైనా, జపాన్‌తో పాటు పశ్చిమ యురోపియన్ దేశాలకు కూడా విస్తరించింది. ఇది ఎన్నో రంగుల్లో లబి µస్తుంది. పసుపు, తెలుపు, పర్పల్‌లో కూడా కేరట్ దొరుకుతుంది. కానీ ఆరెంజ్ కలర్ కారెట్ ప్రపంచంలో అత్యధికంగా ఆదరణ పొందు తోంది. పోషక విలువలు బీటా కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్ అనే యాంట ీఆక్సిడెంట్స్‌ఎక్కువగా లభించేది కారెట్‌లోనే. ఫొటో కెమికల్స్, కాల్షియమ్, పొటాషియమ్, విటమిన్ ఎ, బి1, బి2, సి మరియు ఇ ఇందులో దాగి ఉన్నాయి. ఉడికించిన కేరట్ విటమిన్ ఎ, పొటాషియం, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియమ్‌లను కలిగి ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసి, రివిటలైజ్ చేయడంలో దీనికిదే సాటి.
రోగాలు దూరం కేన్సర్ నిరోధకంగా పనిచేసే అతిగొప్ప కూర గాయ కారెట్. గుండెజబ్బును నివారించడం లోనూ చక్కగాపని చేస్తుంది. చర్మానికి పోషణ ఇస్తుంది. కాలిన గాయాలు మానేందుకు పూతగా కూడా దీన్ని ఉపయోగించవచ్చని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
నోటిలో ఏర్పడే పుళ్లు, వేడిని తగ్గించేందుకు భోజనం తరువాత ఓ కేరట్ తీసుకుంటే మంచిది. పళ్లలో ఇరుక్కున ఆహార పదార్థాలను తీసేసి, పళ్లను శుభ్రపరిచేందుకు ఇది ఉప యుక్తం. టాన్సిలిట్స్‌కి మంచి మందుగా పనిచేస్తుంది. ఎలర్జీలు, ఎనీమియానుంచి కాపాడేందుకు క్యారెట్ మొదటి సాధనం. నరాల బలహీనతనుంచి కూడా రక్షిస్తుంది.
రోజువారీ అవసరం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కమిటీ ఆఫ్ ద నేషనల్ రీసెర్చ్ కౌనిల్ ఆఫ్ ది యుఎస్‌ఎ చెప్పిన ప్రకారం అన్ని వయసుల వారికీ రోజూ నియమిత శాతం విటమిన్ బి తప్పనిసరిగా అవసరం. ఆ స్కేల్ ఇక్కడ చూద్దాం.
|