కొంచెం చిలిపిదనం, అలరించే ముగ్ధత్వం, మైమరిపించే అభినయం వెరసి జెనీలియా . 'బొమ్మరిల్లులో హాసినిగా, శశిరేఖపరిణయంలో తెలుగింటి పెళ్లికూతురు శశిరేఖగా చక్కటి అభినయంతో మంత్రముగ్ధుల్ని చేసిన జెనీలియా తాజాగా 'కథ చెబుతానంటోంది. జస్ట్‌యెల్లో క్రియేషన్స్ పతాకంపై రూపొం దుతున్న 'కథ చిత్రంలో జెనీలియా కథానాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా 'తెరతో ముచ్చటించింది.
కొత్తగా 'కథ అంటున్నారు ఏమిటి? మనందరిరీ 'కథలంటే ఇష్టమే. 'కథ రొమాంటిక్ థ్రిల్లర్. ఆద్యంతం భావోద్వేగభరితంగా వ్ఞంటుంది. నేనింత వరకూ చేయనటువంటి విభిన్న కథాంశం. ఇందులో నేను పరిణితితో కూడుకున్న అమ్మాయి పాత్రను పోషిస్తున్నాను.
మీ పాత్ర చిత్రణ ఎలా వ్ఞంటుంది? నా పాత్ర పేరు చిత్ర. టీచర్‌గా కనిపిస్తాను. ఓ సాధారణ అమ్మాయి మనస్తత్వంలోని ఛాయలన్నీ వ్ఞంటాయి. చిలిపిదనంతో పాటు నిండైన ఆత్మవిశ్వాసం వ్ఞన్న పాత్ర. ఈ 'కథ ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి పాత్రను నేనింత వరకు చేయలేదు. 'కథ నాకు సరికొత్త ఇమేజ్‌ను ఇస్తుంది. ఓ పదేళ్ల తర్వాత కూడా గర్వంగా ఫీలయ్యే పాత్ర. నిన్న 'శశిరేఖా పరిణయం, నేడు 'కథ..అన్నీ కథానాయికా ప్రాధాన్యమున్న పాత్రల్నే ఎంచుకోవటానికి కారణమేమిటి? 'బొమ్మరిల్లులోని హాసిని పాత్ర ప్రేక్షకుల మనసులపై చెదరని ముద్రను వేసింది. నేను తెరపై కనిపించగానే హాసిని పాత్రతో పోల్చుకుంటున్నారు. దానిలోనుండి బయటపడి వైవిధ్యమున్న పాత్రల్ని చేయాలనుకుంటున్నాను. అందులో భాగంగానే ప్రత్యేకమైన పాత్రల్నే ఎంచుకుంటున్నాను. పాత్రల ఎంపికలో సెలెక్టివ్‌గా వ్ఞంటునట్టున్నారు? దర్శకనిర్మాతలు నేనెలాంటి పాత్రలకు సరిపోతానో నిర్ణయి ంచుకుని నా వద్దకు వస్తున్నారు. అదృష్టం కొద్ది నాకు మంచి పాత్రలు లభిస్తున్నాయి.
పాత్రల ఎంపికలో మీ ప్రాధాన్యతలేమిటి? ఏదో పాటలకు, నాలుగు సన్నివేశాలకు పరిమితం కాకుండా పాత్రపరంగా ప్రత్యేకత వ్ఞండాలి. చిన్న పాత్ర అయినా ప్రేక్షకులకు గుర్తిండిపోవాలి. దాంతో పాటు బ్యానర్, దర్శకనిర్మాతల సక్సెస్ రేట్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటాను. మీ కెరీర్‌ను విశ్లేషించుకుంటే మీకేమనిపిస్తుంది? కెరీర్ ప్రారంభంలో కొన్ని చిత్రాలు ఫెయిల్ అయినప్పుడు నాది ఐరన్‌లెగ్ అన్నారు. అయినా నాకు ఎప్పుడూ అవకాశాలు రాకుండా పోలేదు. తర్వాత చాలా ఛాలెంజింగ్‌గా పనిచేశాను. ఇప్పుడందరూ జెనీలియా గోల్డెన్ లెగ్ అంటున్నారు. నా హార్డ్‌వర్క్ ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిందని భావిస్తున్నాను.
ఎక్స్‌పోజింగ్ చేస్తారా? చేస్తాను (నవ్ఞ్వతూ). నా ముఖాన్ని. నా ముఖకవళికలు పలికించే భావాలే నాకు పెద్ద ఎక్స్‌పోజింగ్. మీరు మెచ్చే వ్యక్తి ఎలా వ్ఞండాలి? నన్ను నన్నుగా గౌరవించగలగాలి. మంచి సెన్సాఫ్ హ్యూమర్‌తో పాటు నిజాయితీపరుడై వ్ఞండాలి.
బాలీవ్ఞడ్‌లో రియాల్టీ షో చేస్తున్నారట? అవ్ఞను. ఈ రియాల్టీ షో కోసం ముంబయిలోని స్లమ్ ఏరియాలను సందర్శించాల్సి వచ్చింది. చాలా విషయాల్ని గమనించాను. జీవితాన్ని సరికొత్త కోణంలో గమనించడానికి ఈ షో నాకు ఓ మంచి అవకాశం.