| అమర్‌పై నాన్-బెయిలబుల్ వారంట్ |
| భుధ వారం, నవంబర్ 04, 2009 , 11:16 [IST] |
 |
|
|
న్యూఢిల్లీ : రెండేళ్లనాటి చీటింగ్‌కేసులో తమ ఎదు ట హాజరుకానందుకు సమాజ్‌వాది పార్టీ నాయ కుడు అమర్‌సింగ్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం నాన్-బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. వివిధ కారణాల వల్ల సింగ్ ఇంతకుముందు అక్టోబర్ 3, జూలై 13తేదీల్లో తమ ఎదుట కూడా హాజరుకాక పోవడంతో, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిం చిన చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కావేరి బవే జా అతనిపై నాన్-బెయిలబుల్ వారంట్ జారీచే శారు. ఈకేసులో సింగ్ ఫిర్యాదిదారుగా ఉన్నార ని, తన వాంగ్మూలం నమోదుకు ఆయన కోర్టుకు హాజరుకాకుండా పదేపదే తప్పించుకుంటున్నారని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నవీన్‌కుమార్ విన్నవించడంతో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
|
|
|
|
|
|
|