|
కమలాకర్, సంధ్య జంటగా కమల్ పిక్చర్స్ పతాకంపై బి.వి.రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'హాసిని తొంభైశాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియ జేస్తూ 'ఈ చిత్రంలో హీరోయిన్ సంధ్య హాసిని పేరుతో ప్రధాన పాత్రను పోషిస్తుంది. కథానాయికా ప్రాధాన్యత వ్ఞన్న చిత్రమిది. కుటుంబసమేతంగా చూసి ఆనందించే మంచి ఎంటర్‌టైనర్ అన్నారు. హీరోయిన్ సంధ్య మాట్లాడుతూ 'ఈ చిత్రంలో చిలిపిదనంతో వ్ఞండే పాత్రని పోషిస్తున్నాను. నా కెరీర్‌లో ఓ విభిన్న చిత్రమవ్ఞతుంది అన్నారు. గిరిబాబు, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు, కృష్ణభగవాన్ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కోటి, కెమెరా: కె.ప్రసాద్.
|