Home » జాతీయ వార్తలు » ఎమ్మెల్యేలు... రిసార్టుల నుంచి బయటికి రండి వరద బాధితులను ఆదుకోండి: యెడ్యూరప్ప
ఎమ్మెల్యేలు... రిసార్టుల నుంచి బయటికి రండి వరద బాధితులను ఆదుకోండి: యెడ్యూరప్ప
భుధ వారం, నవంబర్ 04, 2009 , 11:01 [IST]
బళ్ళారి నవంబర్ 3 ప్రభాతవార్త: ఉత్తర కర్ణాటకలో అతిృష్టి కారణంగా అపార నష్టం వాటిల్లి ప్రజలు హహాకారాలు చేస్తున్నారు. వారిని ఆదుకునేందుకు వీలుగా హైదరాబాద్,గోవా రిసార్టులలో ఉన్న ఎమ్యెల్యేలు తక్షణం తమ తమ నియోజక వర్గాలకు చేరుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూ యూరప్ప ఆదేశించారు. తోరణగల్లు సమీపంలోని జిందాల్ అతిథిగృహంలో రాత్రి బస చేసిన ఆయన మంగళవారం బీజాపుర జిల్లా వెళ్ళే ముందు విలేకరులతో మాట్లాడారు.
వరదలు అతివృష్టి వల్ల గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలే ప్రభువులని, వారికి చేయూతనందించి సహకరించాల్సిన ఎమ్యేల్యేలు రిసార్టులలో ఉండటం సమంజసం కాదని అన్నారు. నిరాశ్రితులను ఆదుకునే విషయమై ఎమ్యేల్యేలు స్పందించకపోతే ఈనెల 6తర్వాత తాను ప్రజల మధ్యకు వెళ్ళవలసి వస్తుందని హెచ్చ రికలు జారీ చేసారు.జగదీశ్‌శెట్టర్‌ను స్పీకర్ చేసింది తాను కాదు పార్టీ హైకమాండ్, ఆయన్ను మంత్రి గాకూడా హైమాండే చేస్తుంది,అయితే ఈ విష యంలో కొంత ఆలస్యం జరిగింది నిజమే అంత మాత్రాన ఇంత గందరగోళం సృష్టించాల్సిన అవసరంలేదని యడియూరప్ప అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఇప్పటికైన శెట్టర్ వాస్తవాలు తెలుసు కోవాలని అన్నారు. ఈనెల 5వ తేదీన ఢిల్లీ వెళ్ళి ప్రధాన మంత్రిని కలిసి అతివృష్టి వల్ల జరిగిన నష్టాన్ని వివరిస్తామన్నారు.
అధికారం చేపట్టే సమయంలో జనార్దనరెడ్డి సోదరుల సహకారం తీసుకున్నాను. ప్రస్తుతం టైం సరిగా లేక ఏర్పడిన గందరగోళాన్ని నివారించేందుకు పార్టీ జాతీయ నేతలు చర్చలు జరుపుతున్నారు. అనంత్‌కుమార్ ఇందుకు నాయ కత్వం వహించి సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ పార్టీ అధిష్టానం అభివృద్ధి పట్ల శ్రద్ద వహించాలని సూచించింది. అందుకే పార్టీలో నెలకొన్న భేదాభిప్రాయాల విషయమై ఆలోచించడం లేదన్నారు.