మార్చిన వార్తా విశేషాలు - గురు వారం మార్చి   18th 2010 - 3:16 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
కడప గడపలో పనులు చేస్తూ
భుధ వారం, నవంబర్ 04, 2009 , 10:33 [IST]

annamaiah projectమా వాటా మాకివ్వరా!
 రూ.42 కోట్ల వాటర్‌ స్కీం పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్‌
కోటి రూపాయలకు సెటిల్‌మెంట్‌
రాజంపేట, నవంబర్‌ 3, ప్రభాతవార్త :
కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటి పరిధిలోని 50వేల మంది ప్రజలకు శాశ్వత ప్రాతిపధికన మంచినీటిని అం దించేందుకు గత ఆర్థిక సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో 42కోట్ల రూపాయల నిధులు మం జూరైయ్యాయి.

ఈ ప్రాజెక్టు కోసం ప్రస్తుత కేంద్ర మంత్రి ఎ.సాయిప్రతాప్‌, అప్పటి ఎమ్మెల్యే కొం డూరు ప్రభావతమ్మల సహకారంతో పాలకవర్గం ఎంతో కృషి చేసి మున్సిపాలిటి వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేందుకు అంగీకరించడంతో కేంద్ర ప్రభుత్వం యుఐడిఎస్‌ఎస్‌ఎంటి (అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ ఫర్‌ స్మాల్‌ అండ్‌ మీడియంటౌన్‌) పథకం కింద నిధులు మం జూరు చేసింది.

ఈ పథకం ద్వారా అన్నమయ్య  ప్రాజెక్టులో డెడ్‌ స్టోరేజిలో వుండే నీటిని శుద్దిచేసి రాజంపేట పట్టణానికి పంపింగ్‌ స్కీమ్‌ద్వారా సర ఫరా చేయాలని నిర్ణయించారు. అయితే వివిధ కారణాలతో స్కీమ్‌ పనులు ప్రారంభం కావడం లస్యమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాజంపేట మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. సర్వే పనులు, ఇతరశాఖాపరమైన పనులుముగిసిన తరు వాత రెండు నెలలక్రితం ముంబై హ్యూంపైప్స్‌ కం పెనీ మరొక సబ్‌ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిం చింది. పనులు ప్రారంభించిన సబ్‌ కాంట్రాక్టర్‌ అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్‌వే పైభాగంలో భారీ కట్ట డాన్ని, రాజంపేటలో మంచినీటి ట్యాంకుల నిర్మా ణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను కూడా ఇక్కడకు తరలించారు.

రాజంపేట పట్టణంలో పాత కంపోస్టు యార్డులో పది లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్‌ను నిర్మించేం దుకు పనులు ప్రారంభించారు. ఈ నేపధ్యంలో గత నెలలో నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత సోదరుడు అన్నమయ్య ప్రాజెక్టు సమీపంలో పనులు చేస్తున్న చోటుకు వెళ్ళి తమ వాటాగా స్కీమ్‌ వ్యయంలో పది శాతం (4 కోట్లు) ఇచ్చి పనులు చేసుకోవాలని హెచ్చరించినట్లు తెలిసింది. అయితే సబ్‌ కాంట్రా క్టర్‌కు ఈ విషయం అక్కడ పనిచేస్తున్న వారు చెప్పి తమ పనులు తాము చేసుకోవడంలో  నిమగ్నమ య్యారు. దీంతో ఆగ్రహించిన ప్రజాప్రతినిధి సోద రుడు వాటా విషయం తేల్చకుండానే పనులు చేయ డంపై మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహించి అక్కడ పనిచేస్తున్న యంత్రాలను కాల్చివేస్తామని హెచ్చరి కలు జారీ చేసినట్లు తెలిసింది.

దీంతో సబ్‌ కాంట్రా క్టర్‌ ప్రాజెక్టు వద్ద పనులు నిలిపివేసి రాజంపేటలో సైట్‌ క్లియరెన్స్‌ వున్న నూనెవారిపల్లె రోడ్డులోని పాతకంపోస్టుయార్డులో ట్యాంక్‌నిర్మాణానికి పనులు చేపట్టారు. ప్రాజెక్టు దగ్గర పనులు నిలిపి పట్ట ణంలో పనులు చేసుకుండడంతో మరింత రెచ్చి పోయిన కాంగ్రెస్‌ నేత సైట్‌ వద్దకు వెళ్ళి మరోసారి మాముళ్ళ విషయం తేల్చినతరువాతే పనులు చేసు కోవాలని హుకుం జారీ చేశారు. పనిచేస్తున్న వారికి కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వెం టనే స్పందించిన సబ్‌ కాంట్రాక్టర్‌ మద్యవర్తి, ఓ ఇం జనీరింగ్‌ అధికారి ద్వారా ప్రజా ప్రతినిధి సోదరు డితో సంప్రదింపులు జరిపారు.

మాముళ్ళ విష యంలో ఇరువర్గాల మధ్య చర్చలు కొలిక్కిరాలేదని తెలిసింది. పది శాతం సొమ్ము ఇవ్వలేమని సబ్‌ కాంట్రాక్టర్‌ చేతులెత్తినట్లు తెలిసింది. పనులు మొత్తం అసలు కంపెనీ ఆధ్వర్యంలోనే జరుగుతు న్నాయని నచ్చజెప్పినట్లు తెలిసింది. మెటీరియల్‌ మొత్తం కంపెనీ సరఫరా చేస్తుందని మీరడిగినంత తాను ఇవ్వలేనని చెప్పి ఉన్న ఫలంగా ఇతర ప్రాం తాల నుంచి తీసుకువచ్చిన కార్మికులను సబ్‌ కాం ట్రాక్టర్‌ పంపించివేసి పనులు నిలిపివేశారు. ఈ విషయం ఓ అధికారి, పాలకవర్గంలో కీలకమైన నేతలు కేంద్రమంత్రి సాయిప్రతాప్‌ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఈ వ్యవహారంలో తనను లాగవద్దని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత సబ్‌ కాంట్రాక్టర్‌తో ఓ ప్రముఖ కంపెనీకి చెందిన వ్యక్తి ద్వారా మంచినీటి పథకం అంచనా వ్యయంలో 2.5 శాతం (కోటి రూపాయలు) ఇచ్చేం దుకు ఇరువురి మద్య సెటిల్‌మెంట్‌ జరిగినట్లు విశ్వ సనీయ వర్గాల ద్వారా తెలిసింది. మొదటి పేమెంట్‌ వచ్చిన వెంటనే సెటిల్‌మెంట్‌ మేరకు సొమ్ము చెల్లించాలని లేదంటే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.

ఏది ఏమైనా కోటి రూపాయల సెటిల్‌మెంట్‌ వ్యవహారం రాజంపేట రాజకీయ చరిత్రలో సంచలనంగా మారి చర్చనీ యాంశమైంది. జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోల్చితే అటు రాజకీయంగా శాంతికి మారుపేరుగా రాజం పేటకు పేరుంది. అయితే అభివృద్ధి పనుల్లో ప్రజా ప్రతినిధులు బలవంతంగా మాముళ్ళ వసూళ్ళకు బరితెగించే పాలెగాళ్ళ సంస్కృతికి దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దివంగత సిఎం రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన మంచినీటి పథకం పనులు జరిగేందుకే  అధికార పార్టీ నేత  సోదరుడు వాటా కోసం హుకుం జారీ చేయడం గమనార్హం.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 తెలంగాణ ద్రోహి టిఆర్‌సిసిసి: ..
 .ఎలుగుబంటి దాడి: ఒకరి మృతి
 'చేనేతకు చల్లని కబురు
 ఉపఎన్నికల్లో పోటీచేయకపోవడమే మేలు ..
 ఫ్రీ జోన్‌పై ధనాధన్‌ అట్టుడికిన..
 వైఎస్‌ ప్రజాహిత పథకాలను..
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com