మార్చిన వార్తా విశేషాలు - సొమ వారం మార్చి   15th 2010 - 8:13 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
తెరపడని క'ర్నాటకం
భుధ వారం, నవంబర్ 04, 2009 , 10:29 [IST]

bjpయెడ్యూరప్ప పనితీరుపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరిస్తోన్న బిజెపి కేంద్ర నాయకత్వం
బెంగళూరు, నవంబర్‌ 3, ప్రభాతవార్త: కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప పనితీరు పట్ల అసంతప్తి చెందిన బిజెపి శాసనసభ్యులు ఇపుడు ఒక్కో బందంగా ఢిల్లీలోని బిజెపి హైకమాండ్‌ను కలుసుకుని తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు వెళుతున్నారు.తాజాగా ఇంధనశాఖ మంత్రి కెఎస్‌.ఈశ్వరప్ప నాయకత్వంలో యెడ్యూరప్ప పట్ల అసమ్మతివాదులుగా ముద్రపడిన మైసూరు ఎంఎల్‌ఎ రామదాస్‌,చిక్కమగళూరు ఎంఎల్‌ఎ సి.టి.రవి,బెంగళూరు సర్‌ సివి రామన్‌నగర్‌ ఎంఎల్‌ఎ ఎస్‌. రఘ, నారాయణస్వామి బీసి నాయకులుగా కేంద్ర బిజెపికు తమఫిర్యాదులను వినిపించనున్నారు.బెంగళూరులో మంగళవారం హఠాత్తుగా రెవెన్యూశాఖమంత్రి గాలి కరుణాకరరెడ్డి వరద జిల్లాల డీసిలతో సమావేశమై వరద పరిహారచర్యలు, నవగ్రామాల పునర్నిర్మాణ పనులు చురుగ్గా నిర్వహించాలని వీడియో కాన్పరెన్సింగ్‌ జపి తాను కూడా వరద సహాయక పనుల్లో పాల్గొన్నట్లు తెలిపారు.గత మూడు రోజులుగా ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ఉత్తర కర్ణాటక జిల్లాల్లో వరద ప్రాంతాల్లో సంచరించి పునరావాసం పనులు చురుగ్గా జరిగేలా పర్యవేక్షిస్తుంటే ఇదే మాదిరిగా కరుణాకరరెడ్డి కూడా వరద సహాయక పనుల్లో పాల్గొనేందుకు డీసిలతో సభ నిర్వ హించటం విశేషం.

గత వారం పదిరోజులుగా సిఎం నాయకత్వంలో జరిగే వరద పనులవైపు కన్నెత్తి చూడని కరుణాకరరెడ్డి వీటి పనుల్లో బిజీగా ఉండటం పై స్థాయిలో ఏదన్నా రాజీ జరిగిందా అనే అనుమానానికి తావిచ్చింది. యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి సీటు నుంచి తొలగించే ప్రశ్నే లేదని పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పార్టీ ప్రతినిధి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వి ఢిల్లీలో ప్రకటించి ఇప్పటికి తామంతా యెడ్యూరప్ప  వెంట   ఉన్నట్లు  చెప్పారు.  ఈ సాయంత్రం మళ్లీ బిజెపి అగ్రనాయకులు ఢిల్లీలో సమావేశమై కర్ణాటక పరిస్థితిను అవలోకించనున్నారు. గత రెండు రోజులుగా దేశ రాజధానిలో మకాం వేసిన కర్ణాటక మంత్రి  గాలి జనార్థన రెడ్డి మంగళవారం కూడా సుష్మాస్వరాజ్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా యెడ్యూరప్ప నాయకత్వం మార్పు పట్ల పార్టీ నాయకులు మంత్రులు శాసనసభ్యులు ఎవరూ బహిరంగంగా ప్రకటనలు చేయవద్దని వీరికి సూచించినట్లు సమాచారం. తమ వైపు పెద్దసంఖ్యలో అసమ్మతి శాసనసభ్యులు ఉన్నారని చెబుతున్న జనార్థనరెడ్డి శిబిరంకు దెబ్బ తగిలేలా ముఖ్యమంత్రి బీజాపూర్‌లో ప్రకటన చేసి వరద పనుల్లో పాల్గొనని బిజెపి శాసనసభ్యులకు ప్రజలే సమాధానం చెప్పాలని పిలుపిచ్చారు.

గోవా, హైద రాబాద్‌ క్యాంపుల్లో ఉన్న శాసనసభ్యులు వెంటనే తమ తమ నియోజకవర్గాలకు చేరుకుని వరద సహాయకపనుల్లోపాల్గొనాలని సూచించారు. తన పాలనను వ్యతిరేకిస్తే ఈ అధికారం కూడా ఉండదని హెచ్చరించారు. మరోపక్క బళ్లారిలో సిఎం విలేకరులతో మాట్లాడుతూ విధానసభ స్పీకర్‌గా జగదీశ్‌ షెట్టర్‌ను నియమించాలని ఆదేశించిన కేంద్ర నాయకత్వం మాత్రమే ఇపుడు ఆయన్ని మంత్రివర్గంలోనికి తీసుకోవాలని కోరితే పాటిస్తామని చెప్పారు. తనంతట తానుగా శెట్టర్‌ను కెబినెట్లోకు తీసుకునే వీల్లేదని చెప్పారు. ఆయన చేరిక పట్ల పార్టీ కేంద్ర నాయకత్వంమాత్రం నిర్ణయం తీసుకుం టుందని చెప్పి భారాన్ని ఢిల్లీనాయకులపై వేశారు. శాసనసభ్యుల అభిప్రాయాలకు ఢిల్లీనాయకులు గౌర వించి అందరితో చర్చిస్తే బాగుంటుందని కరుణా కరరెడ్డి చెప్పారు.తమఅభిప్రాయాలకు గుర్తింపు లభి స్తుందన్న ఆశతో ఉన్నట్లు చెప్పారు.దీంతో మంగళవారంకూడా సంక్షోభం యథావిధిగాకొనసాగుతోంది
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 'అమీర్‌ఖాన్‌తో పనిచేయాలని ఉంది
 పార్లమెంటరీ విధానం మరింత పటిష్టం:..
 ధరలపై ధనాధన్‌
 అందరితో సంప్రదించాకే
 నిత్యానందకు రంజిత మసాజ్‌
 మహిళాబిల్లుతో ఎంపీల్లో ఆనందం
 సంఘీ రథయాత్రకు అపూర్వ స్పందన
 'బీహార్‌' పరివర్తన్‌ యాత్ర ప్రారంభం
 సచిన్‌ను చూసి నేర్చుకోండి
 రాష్ట్రపతితో ఎంపి గిరీష్‌ సంఘీ..
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com