| సాగర్ కాలువల ఆధునీకరణకురూ.4444 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం |
| మంగళ వారం, నవంబర్ 03, 2009 , 11:24 [IST] |
 |
|
కేంద్రం అనుమతి: పొన్నాల హైదరాబాద్, నవంబర్ 2 ప్రభాతవార్త:నాగార్జున సాగర్‌కాల్వల ఆధునీకరణ పనులకుప్రపంచ బ్యాంకు నుంచి రూ.4444 కోట్ల రుణం తీసుకు నేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని భారీ నీటిపారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. సోమవారం ముఖ్యమంత్రి ఆధ్వ ర్యంలో జలయజ్ఞం ప్రాజెక్టులపై నీటి పారుదల శాఖ సమీక్ష సమావేశం వాయిదా పడింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డుతూ జూబ్లీహాల్ దివంగత వైఎస్‌ఆర్ పుస్తకా విష్కరణలో సిఎంకు ఆలస్యమైనందున మరో రెండు, మూడు రోజుల్లో జలయజ్ఞం పనులకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామ న్నారు. సాగర్ ఆధునీక రణ కు అవసరమయ్యే నిధులను తొ లుత 50% ప్రపంచ బ్యాంకు నుంచి 50% కేం ద్రం నుం చి రుణంగా తీసుకోవాలని నిర్ణ యిం చా మని, అయితే రాష్ట్ర ప్రభుత్వ కోరికమేరకు 100% నిధులు ప్రపంచ బ్యాంకు నుంచే రుణం గా తీసుకునేందుకు కేంద్రం అంగీకరిం చిందని ఆయన పేర్కొన్నారు.
జలయజ్ఞంలో చేప ట్టిన ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేయాలనే కృతనిశ్చ యంతో ప్రభుత్వం పనిచేస్తుందనీ, ఇందుకోసం అధిక నిధుల సమీకరణకు కృషి చేస్తున్నామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయటమే వైఎస్‌ఆర్ కు నిజమైన నివాళి అని పొన్నాల అభివర్ణించా రు. ఈరుణానికి సంబంధించిన కేంద్రం అంగీకార పత్రాన్ని త్వరలో ప్రపంచ బ్యాంకు పంపి, నిధుల విడుదలకు కృషి చేస్తామని లక్షయ్య వివరించారు.
|
|
|
|
|
|
|