మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
'కొండపైకి 'కొండా పయనం
మంగళ వారం, నవంబర్ 03, 2009 , 10:56 [IST]

konda surekhaఆత్మకూరు, నవంబర్‌ 2, ప్రభాత వార్త: వైఎస్‌రాజ శేఖరరెడ్డి పట్ల తనకున్న కృతజ్ఞతాభావాన్ని మంత్రి పదవికి రాజీనామ సమర్పించడం ద్వారా ప్రకటిం చుకున్న శాయంపేట ఎంఎల్‌ఏ కొండా సురేఖ వేలాది మంది అనుచరులతో వందలాది వాహనాల్లో సోమవారం కర్నూలు జిల్లా ఆత్మ కూరు అటవీ డివిజన్‌లోని చింతగుండం తిప్పకు వచ్చారు. పవిత్రమైన కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి కలిసి రావడంతో చింతగుం డంతిప్ప మార్గంలో వున్న రుద్రకోడు దివ్యక్షేత్రానికి సుమారు 30వేల మంది యాత్రికులు చేరుకు న్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాలతో అడవి దారి రద్దీగా మారింది.

ఈ పరిస్థితుల్లో సాయం త్రం 4.30 గంటలకు కొండా సురేఖ వాహనశ్రేణి నల్లమ లలో ప్రవేశించింది. గాలేరు సమీపానికి ఈవాహన శ్రేణి వెళ్లే సరికి మార్గం ఇరుకుగా వుం డటంతో ఎక్కడి వాహనాలు అక్కడి నిలిచి పోయాయి. దీంతో పోలీసులు కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీని ఓ వాహనంలో ముం దుకు పంపారు.

దీంతో వరంగల్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి సుమారు 250 వాహ నాల్లో  వచ్చిన అభిమానులు చింతగుండం వరకు వెళ్లలేక పోయారు. నడిచి వెళ్లాలన్నా వాహనాలు నిలిచిన ప్రదేశానికి చింతగుండం సుమారు 18 కిమిల దూరం ఉండటం అప్పటికే చీకటి పడటం వంటి అంశాల వల్ల సాధ్యం కాలేదు. చీకట్లోనే కొండా సురేఖ,ఆమె భర్త మురళీ చింత గుండం తిప్పను అతికొద్ది మంది అనుచరులతో అధిరో హిం చారు.

తిప్పపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేలకూలి మరణించిన ప్రదే శంలో ఆమె తన వెంట తీసుకెళ్లిన రాజీనామ పత్రాన్ని వుంచి మౌనంగా నివాళులు అర్పిం చారు. ఎంఎల్‌సి కొండామురళీ ఉద్వేగభరితంగా నినాదా లిచ్చారు. ఆర్భాటంగా జరుగు తుంద నుకున్న కొండా దంపతుల కొండయాత్ర ఇలా యాంటిక్లైమా క్స్‌కు చేరుకుంది. ప్రణాళి కబ ద్దంగా ఈ ప్రతి ష్టాత్మకమైన యాత్రను ఏర్పాటు చేసు కోక పోవడం సమస్యలకు కారణ మైంది. చింత గుండం ప్రయాణం ఎప్పుడైనా మధ్యాహ్నం 2 గంటలలోపే అడవిలోకి వెళ్లేలా ప్లాన్‌ చేసు కోవాలి. అది భారీగా జనాలతో, వాహ నాలతో వెళ్లాలనుకున్నప్పుడు మరింత శ్రద్దగా దారులను సరిచేసుకుని, వాహనాలను ఓవర్‌ టేక్‌ చేయ కుండా నెమ్మదిగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకో వాల్సివుంది.

ఈ జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల అడవిలోని గాలేరు సమీపంలో వాహన శ్రేణిలో కొన్ని వాహనాలు ఇరుక్కుపోవడం వల్ల ట్రాఫిక్‌ స్థంభించింది. దీంతో కొండా దంపతులు మాత్రము ట్రాఫిక్‌ ఆవల వున్న ఓ తవెరా వాహ నంలోవెళ్లేలా పోలీసులుఏర్పాటు చేయ గలిగారు. రాత్రి 7 గంటలకు కాని కొండా దంప తులుచిం తగుండం తిప్పకు చేరుకోలేకపో యారు. చీకట్లో గుండ్ల రస్తాలో ఇబ్బందులు పడుతూ కొండ ఎక్కితాము అనుకున్న పనిని కొండా దంపతులు అయిందనిపించారు.వీరివెంటవచ్చిన అభిమాను లకు ఆత్మకూరు పట్టణం లోని మార్కెట్‌ కమిటీ ఆవరణలో భోజన సౌకర్యం కల్పించారు.

 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com