|
ప్రతిగుండె ప్రతిస్పందన: సబిత జగ్గయ్యపేట, నవంబర్ 2, ప్రభాతవార్త : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి స్ధానంలో ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెెడ్డి ఉంటేనే ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఫలిస్తాయని, ఆ విధంగా కాంగ్రెస్‌పార్టీలోని ప్రతి గుండె ప్రతిస్పందిస్తోందని హోంశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటమం డలంలోని షేర్‌మహ మ్మద్‌పేట గ్రామంలో మాజీ ప్రభుత్వవిప్ సామినేని ఉదయ భాను ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమం లోరాజీవ్‌గాంధి, వైఎస్ రాజశేఖరరెడ్డిల విగ్ర హాలను ఆమె ఆవిష్క రించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ 2014లో రాహూల్‌గాంధీని ప్రధానిగా చూడాలని జగన్ అన్నారని అదేవిధంగా పార్టీని బలోపేతం చేసుకో వాలని అన్నారు. కార్య కర్తలు జగన్‌ను ముఖ్య మంత్రినిచేయాలని నినాదాలు చేయటంతో మీకో రికను అధిష్టానం దృష్టికి తీసుకెళతానని ఆమె అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సుస్ధిరంగా ఉన్నాయ న్నారు. పోలీసలు వ్యవహరిస్తున్న తీరు అభినందనీ యమ న్నారు. వైఎస్ ఆశయాలను సాకారం చేసు కోవాల ని, పాదయాత్రతో ప్రజల కష్టనష్టాలు తెలుసుకొని వారి అవసరాలు గుర్తించి పరిపాలన చేసిన మహానాయకుడు వైఎస్ అన్నారు. సభాధ్యక్షుడుమాజీప్రభుత్వవిప్‌సామినేని ఉదయబానుమాట్లాడుతూ తనఆరాధ్య దైవ మైన వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్ఠిం చుకో వటం బాధాకరంగా ఉన్నదని, గ్రామంలో డ్వాక్రా మహిళలు పావలావడ్డీ రుణాలకు కృతజ్ఞతగా వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకొని
|