మార్చిన వార్తా విశేషాలు - గురు వారం మార్చి   18th 2010 - 6:09 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
పొత్తులపై అధిష్ఠానానిదే తుది నిర్ణయం: డిఎస్‌
మంగళ వారం, నవంబర్ 03, 2009 , 10:48 [IST]

dsప్రభాతవార్త ప్రత్యేకప్రతినిధి/హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి నియామకంలో అధిష్ఠానం నిర్ణయాన్ని సమర్దించి, రోశయ్యే ముఖ్యమంత్రి అని తెగేసి చెప్పిన సీనియర్లు గ్రేేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పొత్తుల విషయంలో కూడా పిసిసి అధ్యక్షునికి మద్దతుగా నిలిచి ఏ విషయంలోనైనా మేము మీకు అండగా ఉన్నామని భరోసా కల్పించారు. పిఆర్‌పితో పొత్తుల అంశాన్ని అకస్మాత్తుగా తెరమీదకు తెచ్చి పిసిసి అధినేత డి శ్రీనివాస్‌ పార్టీలో పరస్పర అభిప్రాయాలు వ్యక్తమ య్యాయి.

అధిష్ఠానం సలహా మేరకే పిఆర్‌పితో పొత్తు లకు సిద్ధమయ్యామని చెప్పిన పిసిసి అధ్యక్షునికి పలు వురు సీనియర్లతోపాటు కొందరు మంత్రులు కూడా ముందుకు రావడంతో జగన్‌ వర్గ్గీయులు రెచ్చిపోయారు.  తాజాగా చెలరేగిన పిఆర్‌పితో పొత్తు విషయంలో కూడా సీనియర్లు డిఎస్‌కు అండగా నిలిచి అధిస్ఠానం ఆదేశాల మేరకు పొత్తులు అవసరమేనని కరాఖండిగా చెప్పగా, మంత్రులు సయితం అధిష్ఠానమే చెప్పినతర్వాత మరో మాట ఎలా ఉంటుందన్నారు.

 సోమవారం మధ్యాహ్నం గాంధీ భవన్‌కు వచ్చిన డిఎస్‌ సుమారు ముప్పావు గంటసేపు గ్రేటర్‌ ఎన్నికల్లో టిక్కెట్ల ఆశావహులను కలుసుకుని వారినుంచి అభ్యర్ధనలు స్వీక రించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్‌ బలంగా ఉందని, పిఆర్‌పితో పొత్తులు కేవలం తాత్కాలికంగా గ్రేటర్‌ ఎన్నికలకే పరిమితం కాదని, పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం అధిష్ఠానం ఆదేశాలమేరకు పిఆర్‌పితో పొత్తులపై ప్రాథమికంగా చర్చలు పూర్తయ్యాయని వివరించారు. మొత్తం 150 డివిజన్లలో పార్టీ ఒంటరిగా పోటీచేసి అత్యధికస్థానాలు గెల్చుకునే సత్తాఉందని, అయితే భవిష్యత్‌లో పిర్‌పితో పొత్తుపై చర్చలు ప్రారంభించామని స్పష్టం చేశారు.

వ్యక్తులు వ్యతిరేకిస్తే పొత్తులు ఆగవు: మధుయాష్కీ

 గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పీఆర్పీతో పొత్తు పెట్టుకోవడం తప్పేం కాదని, అది పార్టీని బలహీన పరిచే అంశమేకాదని కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ అభిప్రా యపడ్డారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉన్నప్పుడే పిఆర్పీతో పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చిం దని, తర్వాత దాని చర్చల కొనసాగింపు జరగలేదని పేర్కొన్నారు.  సెక్యులర్‌ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ లక్ష్యమని, రాష్ట్రంలో 14శాతం ఓట్లు సాధించిన పిఆర్పీతో పొత్తు పెట్టుకోవడం తప్పేంకాదని, దీనిపై సోనియా గాంధీ తప్ప కుండా నిర్ణయం తీసుకుంటారన్నారు.

పొత్తులపై తుది నిర్ణయం అధిష్ఠానానిదే:సాయి ప్రతాప్‌
పార్టీకి ప్రయోజనం కలిగించేందుకు వీలుగా పొత్తులు పెట్టుకోవడంతప్పేంకాదని, దీనిపైతుదినిర్ణయం అధిష్ఠానా నిదేనని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి సాయి ప్రతాప్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం ఉదయం ఆయన సిఎం రోశయ్యను సచివాలయంలో కలుసుకుని విశాఖ స్టీల్‌ తరఫున ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేశారు.

వైఎస్‌ ఉన్నప్పుడే పిఆర్‌పితో చర్చలు: బొత్సా
 మంత్రి బొత్స విలేఖరులతో ముచ్చటిస్తూ పిఆర్‌పితో పొత్తు అధిష్ఠానం నిర్ణయమైతే తప్పదన్నారు. పొత్తులకు వ్యక్తిగతంగా వ్యతిరేకమా అనుకూలమా అన్నది ప్రశ్న కాదని, చర్చలు జరుగుతున్నట్లు తాను పత్రికల ద్వారా తెలుసుకున్నానన్నారు. పార్టీయే నిర్ణయిస్తే కాదనేదేముం దని అన్నారు. అయినా పిఆర్‌పితో చర్చలు, సంప్రదిం పులు ఇవ్వాళ కొత్తకాదని, పార్టీ ప్రయోజనంపేరిట వైఎస్‌ ఉన్నప్పుడే ఆ ప్రక్రియ మొదలైందని గుర్తుచేస్తూ, ఇప్పుడు పొత్తులను వ్యతిరేకించే వారు ఆనాడు ఎందుకు పెదవి విప్పలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో ఉన్న మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి పొత్తులను సమర్ధించారు. అధిష్ఠానానికి అంతా తెలుసునన్నారు.

పొత్తుల వివాదానికి నాదే బాధ్యత:డిఎస్‌
 పొత్తులపై తలెత్తిన వివాదం విషయంలో తానే బాధ్యత వహిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అన్నారు.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 తెలంగాణ ద్రోహి టిఆర్‌సిసిసి: ..
 .ఎలుగుబంటి దాడి: ఒకరి మృతి
 'చేనేతకు చల్లని కబురు
 ఉపఎన్నికల్లో పోటీచేయకపోవడమే మేలు ..
 ఫ్రీ జోన్‌పై ధనాధన్‌ అట్టుడికిన..
 వైఎస్‌ ప్రజాహిత పథకాలను..
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com